|
Updated at 11:40 AM
క్లైమాక్స్ చిత్ర గమనాన్ని నిర్దేశించేలా ఉంది దీనితో చిత్రం ముగిసింది సమీక్ష మరి కాసేపట్లో..
Updated at 11:25 AM
కథ లాజిక్ కి అతీతంగా భావాలను రెచ్చగోట్టడంలో నడిపిస్తున్నారు.
Updated at 11:00 AM
ఆశ్చర్యకరంగా విషాదకరమయిన సన్నివేశం వచ్చింది క్లైమాక్స్ వైపు కథ పరుగు తీస్తుంది తెర మీద రక్తం పారుతుంది.
Updated at 10:52 AM
వాస్తు బాగుందే పాట కోసం కొని మాస్ సన్నివేశాలను సృష్టించారు ఈ ఐటం సాంగ్ లో నలుగురు భామలు డాన్స్ చేస్తున్నారు.
Updated at 10:35 AM
జీప్ లు ఎగురుతున్నాయి గాలిలో ఇంకొన్ని మిగిలాయి అవి కూడా పూర్తయ్యాయి మరో భారీ డైలాగ్ ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పినటు అనిపిస్తుంది ఎవరా హీరో?
Updated at 10:35 AM
మరి కొన్ని సంభాషణలు అభిమానులను అలరిస్తున్నాయి.
Updated at 10:35 AM
తారక్ నోటి నుండి మరోసారి రాజకీయ సంభాషణ అభిమానులు మరోసారి టాప్ లెపారూ.
Updated at 10:29 AM
రాజా వాసి రెడ్డి పాట మొదలయ్యింది కార్తీక ఎన్టీయార్ తో సమానంగా డాన్స్ వేయటం ఆసక్త్తి కరమయిన విషయం.
Updated at 10:27 AM
మరింత విలనిజంతో రెండవ అర్ధం మొదలయ్యింది.
Updated at 10:25 AM
మొదటి అర్ధ భాగం పూర్తయ్యింది ఒక అభిమానికి ఎం కావాలో అన్ని ఉన్నాయి ఇందులో రెండవ అర్ధ భాగం కూడా ఇలానే ఉంటుందో లేదో చూడాలి.
Updated at 10:20 AM
ఇంటర్వల్ సన్నివేశం లో వచ్చిన ఫైట్ ఛత్రపతి ఫైట్ ని తలపించేలా ఉన్నా కీరవాణి తనదయిన మాయజాలంతో సన్నివేశాన్ని రక్తి కట్టించారు.
Updated at 10:15 AM
కథలో కొన్ని మలుపుల తరువాత ఎన్టీయార్ బలవంతంగా హీరో కావలిసి వచ్చింది.
Updated at 10:05 AM
"దమ్ము" పాటకు సమయం ఫుల్ మాస్ గా తెరకెక్కించిన పాట త్రిష చాలా అందంగా ఉంది. ప్రదర్శన పరంగా కార్తీక ఆకట్టుకుంటుంది.
Updated at 10:00 AM
కార్తీక హాస్యంతో కూడిన ప్రవేశం ఇచ్చింది.
Updated at 9:55 AM
అనుకొంకుండా పాట మొదలయింది "రూలర్" ఆనంద్ సాయి వేసిన సెట్ లకి తారక్ కత్తి సాము తోడయ్యింది. థియేటర్ ఈలలతో మారు మ్రోగుతుంది.
Updated at 9:35 AM
భారీగా సిస్టర్ సెంటిమెంట్ నడుస్తుంది.
Updated at 9:25 AM
బ్రహ్మానందం ప్రవేశం సింపుల్ గా ఉంది.
Updated at 9:20 AM
పాట అయిపోయిన వెంటనే ఫైట్ మొదలయ్యింది. బోయపాటి శ్రీను ప్రత్యేకత ఫైట్ ల లో కనిపిస్తుంది.
Updated at 9:10 AM
పాట మొదలయింది ఆసక్తి కరంగా పాటను తెరకెక్కించారు.
Updated at 9:05 AM
త్రిష తెర మీదకి వచ్చింది తెలుగు చిత్రం లో కథానాయిక ప్రవేశం ఎలా ఉంటుందో మీకు తెలిసిందే.....
Updated at 9:00 AM
తారక్ రాజకీయ ప్రవేశాన్ని ఉద్దేశించి ఒక డైలాగ్. అభిమానులు ఉత్సాహం తో ఈలలతో థియేటర్ దద్దరిల్లిపోతుంది.
Updated at 8:55 AM
బ్లాక్ & వైట్ ఎపిసోడ్ ముగిసింది తారక్ తెర మీదకి వచ్చారు అభిమానుల కేరింతలతో థియేటర్ దద్దరిల్లిపోతుంది.
Updated 8:45 AM
రాజ్,నాజర్,సుమన్ మరియు తదితరులతో బ్లాక్ & వైట్ లో మొదలయ్యింది
Click For English Live Updates 'Dammu ' -->
|