Updated 9:15 PM
దీనితో దమ్ము ఆడియో వేడుక ముగిసింది త్వరలో ఆడియో రివ్యూ అందిస్తాం
Updated 9:05 PM
ఎన్టీయార్ వేదిక మీద మాట్లాడుతున్నారు అద్బుతమయిన వక్త అనిపించుకుంటున్నారు
Updated 8:59 PM
చిత్రం గురించి బోయపాటి శ్రీను మాట్లాడుతున్నారు. చిత్ర విజయం మీద ధీమాగా కనిపించారు
Updated 8:43 PM
కీరవాణి తొలి సి డి ని ఆవిష్కరించి ఎన్టీయార్ మరియు ప్రణతిలకు అందజేశారు
Updated 8:38 PM
ఎన్టీయార్ కుటుంబ సమేతంగా వేదిక మీదకి వచ్చారు. అతిధులందరు వేదికను అలంకరిస్తున్నారు
Updated 8:34 PM
బోయపాటి శ్రీను ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ కి అభిమానుల నుండి అనూహ్యమయిన స్పందన కనిపించింది.
Updated 8:28 PM
నిర్మాత కే .ఎస్ రామ రావు నాలుగో పాట "రూలర్"ను విడుదల చెయ్యగా , త్రిష మరియు కార్తీక సంయుక్తంగా " వాస్తు బాగుందే" పాటను విడుదల చేశారు
Updated 8:24 PM
పృథ్వి చంద్ర "ఓ లిల్లి" అనే పాటకు డాన్స్ చేస్తున్నారు ఆల్బం లో ఇది మూడవ పాట
Updated 8:20 PM
పృథ్వి చంద్ర "ఓ లిల్లి" అనే పాటకు డాన్స్ చేస్తున్నారు ఆల్బం లో ఇది మూడవ పాట
Updated 8:17 PM
మూడవ పాట విడుదలకు దర్శకుడు బోయపాటి శ్రీను ని వేదిక మీదకు పిలిచారు. రాజమౌళి మాట్లాడుతూ త్వరలో ఎన్టీయార్ తో ఒక చిత్రం చేస్తాను అని అన్నారు ఈ మాటకి వేదిక కేరింతలతో దద్దరిల్లింది
Updated 8:10 PM
రెండవ పాట విడుదల కోసం ఎస్.ఎస్.రాజమౌళి ని వేదిక మీదకు పిలిచారు. ఎన్టీయార్ అభిమానుల నుండి రాజమౌళికి అద్బుతమయిన స్వాగతం లభించింది
Updated 8:05 PM
దమ్ము చిత్రంలో మొదటి పాటను దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు విడుదల చేశారు
Updated 7:52 PM
ఎన్టీయార్ మీద ఒక ప్రత్యేక వీడియో ప్రదర్శిస్తున్నారు
Updated 7:48 PM
ఎన్ టి ఆర్ ఇప్పుడే కుటుంబ సమేతంగా వేదికను చేరుకున్నారు చూడటానికి చాలా బాగున్నారు అభిమానుల నుండి అద్బుతమయిన స్వాగతం లభించింది
Updated 7:35 PM
దమ్ము లో ఎన్ టి ఆర్ ఫస్ట్ లుక్ చూపిస్తున్నారు దీనికి బోయపాటి శ్రీను వాయిస్ ఓవర్ ఇచ్చారు ఫాన్స్ కి కన్నుల పండుగగా ఉంది
Updated 7:26 PM
సత్య మాస్టర్ మరియు వారి బృందం ఇప్పుడే ఒక ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు
Updated 7:16 PM
కీరవాణి పాటలతో ఒక ప్రత్యేక వీడియో ప్రదర్శిస్తున్నారు ఆయన స్వరపరిచిన హిట్ సాంగ్స్ అన్ని చూపిస్తున్నారు
Updated 7:13 PM
ఆడిటోరియం పూర్తిగా నిండిపోయింది వేదిక బయట కూడా భారి జనం వేచి చూస్తున్నారు
Updated 7:05 PM
వేడుక ఇప్పుడే మొదలయ్యింది సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. ఇక్కడ వేదిక మొత్తం అభిమానుల కేరింతలతో అద్బుతమయిన వాతావరణం నెలకొనింది. ఇపుడే ఒక ప్రదర్శన జరుగుతుంది
Updated 6:55 PM
హలో ఫ్రెండ్స్ మీకోసం యంగ్ టైగర్ ఎన్ టి ఆర్ నటించిన "దమ్ము" చిత్ర ఆడియో విడుదల వేడుక కార్యక్రమ అప్డేట్స్ 123తెలుగు.కాంలో ఇస్తున్నాం కొద్దిసేపట్లో వేడుక మొదలు కానుంది మరిన్ని విశేషాల కోసం చూస్తూనే ఉండండి 123తెలుగు.కాం
Click here for 'Dhammu' Audio Function English version updates
|