Updated 09 :57 PM
కార్యక్రమం ముగిసింది మీరు ఎంజాయ్ చేసుంటారని అనుకుంటున్నాము. మరిన్ని తెలుగు చిత్ర విశేషాల కోసం 123తెలుగు.కాం చూస్తూ ఉండండి
Updated 09 :41 PM
"గబ్బర్ సింగ్ రచ్చ రచ్చే ! ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్ లో పెద్ద విజయం సాదిస్తుందని. పవన్ కళ్యాణ్ ఎప్పుడు విభిన్నమయిన పాత్రలు చెయ్యడానికి ప్రయత్నిస్తుంటాడని అవి విజయవంతం కాకపోవచ్చు. కాని ఈ చిత్రం 100% మాస్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది" అని చిరంజీవి అన్నారు
Updated 09 :40 PM
పవన్ కళ్యాణ్ మరియు నాగ బాబు లతో చురంజీవి వేదిక మీద ఉన్నారు అభిమానులకు కన్నుల పండుగగా ఉంది
Updated 09 :30 PM
పవన్ కళ్యాణ్ మరియు నాగ బాబు లతో చురంజీవి వేదిక మీద ఉన్నారు అభిమానులకు కన్నుల పండుగగా ఉంది
Updated 09 :18 PM
ట్రైలర్ కత్తిలా ఉంది చివర్లో పవన్ గుర్రం మీద వస్తుంటే కళ్ళు సరిపోవు
Updated 09 :13 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక ప్రత్యేక వీడియో ప్రదర్శిస్తున్నారు
Updated 09 :00 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక ప్రత్యేక వీడియో ప్రదర్శిస్తున్నారు
Updated 8 :56 PM
బ్రహ్మానందం వేదిక మీదకు వచ్చారు అప్పట్లో గ్యాంగ్ లీడర్ వంద రోజుల వేడుక మూడు వేరు వేరు ఊర్లలో జరగతాన్ని గుర్తు చేశారు అలీ మరియు బ్రహ్మానందం ఇద్దరు కలిసి వేదిక మీద హాస్యాన్ని పండిస్తున్నారు
Updated 8 :42 PM
దేవి శ్రీ ప్రసాద్ వేడుకను మరో దశకు తీసుకెళ్ళారు తన లైవ్ ప్రదర్శనతో వేదికను దద్దరిల్లిస్తున్నాడు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు, ఇక్కడ డి ఎస్ ఫై మానియా నడుస్తుంది ప్రస్తుతం
Updated 8 :28PM
తరువాతి పాటను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చెయ్యబోతున్నారు
Updated 8 : 19 PM
"దిల్ సే" పాటను దిల్ రాజు విడుదల చేశారు
Updated 8 : 12 PM
మందు బాబులం పాటను విడుదల చెయ్యడానికి నాగ బాబు వేదిక మీదకు వచ్చారు.
Updated 8 : 12 PM
చిరంజీవిని గబ్బర్ సింగ్ డైలాగ్ "నాక్కొంచెం తిక్కుంది దానికొక లేక్కుంది" చెప్పమని సుమ అడిగారు వేదిక దద్దరిల్లిపోయింది చిరంజీవి తన శైలిలో చెప్పారు పవన్ కళ్యాణ్ ఎంజాయ్ చేశారు.
Updated 7 : 58 PM
వేదిక వద్దకు అల్లు అర్జున్ వచ్చారు రెండవ పాట విడుదల చెయ్యడానికి శ్రీను వైట్ల వేదిక మీదకు వచ్చారు
Updated 7 : 51 PM
మెగా స్టార్ చిరంజీవి హాజరు కావటం వేడుకను మరింత ఉత్సాహంగా జరిపేల చేస్తుంది. ముగ్గురు అన్నదమ్ములను ఇలా ఒకే వేదిక మీద చూడటం కన్నుల పండుగగా ఉంది
Updated 7 : 44 PM
శ్యాం ప్రసాద్ రెడ్డిగారు మొదటి సాంగ్ ని విడుదల చేశారు. ఇప్పుడే బ్రహ్మానందం వేదిఅక్ వద్దకు విచ్చేశారు
Updated 7 : 40 PM
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడే వేదిక వద్దకు విచ్చేశారు అభిమానుల అరుపులు ఆడిటోరియం పైకప్పు ఎగిరిపోతుందేమో అనిపించేలా ఉన్నాయి. నాగ బాబు కూడా చిరంజీవితో కలిసి వచ్చారు.
Updated 7 : 34 PM
శ్రుతి హాసన్ కూడా వేదికను చేరుకున్నారు పింక్ కలర్ చీరలో చాలా అందంగా ఉన్నారు
Updated 7 : 32 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడే వేదిక వద్దకు వచ్చారు ఆడిటోరియం అభిమానుల అరుపులు కేరింతలతో అద్దిరిపోతుంది. అతిదులందరు ఆయనకి శుభాకాంక్షలు తెలపడానికి గుమిగూడారు
Updated 7 : 25 PM
సాగర్,మాధుర్య మరియు బృందం పవన్ కళ్యాణ్ హిట్ పాటలకు నృత్యం చేస్తున్నారు
Updated 7 : 18 PM
సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ వేదికను చేరుకున్నారు అభిమానుల నుండి అద్బుతమయిన స్వాగతం లభించింది. కోట శ్రీనివాసరావు గారు కూడా వేదికను చేరుకున్నారు.
Updated 7 : 12 PM
హాస్య ప్రధానమయిన స్కిట్ ప్రదర్శిస్తున్నారు
Updated 7 : 10 PM
నిర్మాత శ్యాం ప్రసాద్ రెడ్డిగారు,జెమిని కిరణ్ మరియు కొంతమంది రాజకీయ నాయకులు కూడా వేదికను చేరుకున్నారు
Updated 7 : 07 PM
సత్య మాస్టర్ బృందం పవన్ కళ్యాణ్ పాటలకు నృత్యం చేస్తున్నారు
Updated 7 : 00 PM
సుమ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు, అభిమానులను చాలా బాగా అలరిస్తున్నారు, ఒక్కొక్కరిగా అతిధులు వేదికను చేరుకుంటున్నారు.
Updated 6 : 53 PM
దర్శకుడు హరీష్ శంకర్,అలీ మరియు శ్రీను వైట్ల వేదిక వద్దకు విచ్చేశారు పవన్ పాటలు ఇంకా వేస్తున్నారు అభిమానుల కేరింతలకు అవధుల్లేకుండా పోతుంది.
Updated 6 : 47 PM
నిర్మాత గణేష్ బాబు ఈ వేడుకను విజయవంతం చేసేందుకు చాలా కష్టపడుతున్నారు తానే స్వయంగా అన్ని చూసుకుంటున్నారు ఇప్పుడే రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ విచ్చేశారు
Updated 6 : 41 PM
అతిదులందరు ఒక్కొక్కరుగా విచ్చేస్తున్నారు ఇప్పుడే పంజా చిత్ర నిర్మాత నీలిమ తిరుమల శెట్టి విచ్చేశారు వేదిక బయట చాలా మంది వేచి చూస్తున్నారు చాలా మంది అభిమానులు "కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్" బట్టలను ధరించడం ఆసక్తికరమయిన విషయం
Updated 6 : 36 PM
పవన్ కళ్యాణ్ కి సంబందించిన పాటలు మరియు సన్నివేశాలను ప్రదర్శిస్తున్నారు అభిమానులు కేరింతలతో ఆడిటోరియం దద్దరిల్లిపోతుంది
Updated 6:30 PM
హలో ఫ్రెండ్స్ మీకోసం మేము "గబ్బర్ సింగ్" చిత్ర ఆడియో విడుదల వేడుక లైవ్ అప్డేట్స్ ఇస్తున్నాము మరి కొద్ది క్షణాల్లో అప్డేట్స్ మొదలవుతాయి చూస్తూనే ఉండండి
Click here for 'Gabbar Singh' Audio Function English version live updates
|