గబ్బర్ సింగ్ లైవ్ అప్డేట్స్

Gabbar Singh

సినిమా స్టిల్స్

పోస్టర్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated at 9:45PM

క్లైమాక్స్

Updated at 9:41PM

భారీ క్లైమాక్స్ సన్నివేశం నడుస్తుంది చాలా స్కార్పియోలు గాల్లో ఎగురుతున్నాయి

Updated at 9:35PM

కథ ఎమోషనల్ సన్నివేశాలతో నడుస్తుంది. పవన్ తనదయిన శైలి లో భావాలను పలికిస్తున్నారు

Updated at 9:22PM

మలైకా అరోరా "కెవ్వ్ కేక" పాటతో తెర మీద కేక పుట్టిస్తుంది

Updated at 9:08PM

"దిల్ సే" పాట మొదలయ్యింది పవర్ స్టార్ , శృతి ల అభినయానికి స్విస్ అందాలు తోడయ్యి పాటను అద్బుతం అనిపించేలా చేశాయి

Updated at 8:59PM

పోలిస్ స్టేషన్ లో అంత్యాక్షరి సన్నివేశం అద్బుతం. హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ కి హ్యాట్స్ ఆఫ్

Updated at 8:49PM

తనకే సొంతమయిన శైలి లో కామెడి పండిస్తూ జయప్రకాశ్ రెడ్డి తెర మీదకి వచ్చారు థియేటర్ లు నవ్వులు పండిస్తున్నారు

Updated at 8:36PM

భారీ ఇంటర్వల్ ఫైట్.. అప్పుడే అయిపోయిందా అనేంత వేగంతో మొదటి అర్ధ భాగంని నడిపించారు.అలరించే సన్నివేశాలు పవన్ నుండి పంచ్ డైలాగ్ ల తో మొదటి అర్ధ భాగం పూర్తయ్యింది రెండవ అర్ధ భాగం ఎలా ఉంటుందో అనే ఆసక్తిని పెంచుతూ

Updated at 8:15PM

దీని వెంటనే దేవి శ్రీ ప్రసాద్ మాయాజాలం "పిల్లా" పాట స్విస్ లో చిత్రీకరించిన ఈ పాట చూడడానికి కన్నుల విందుగా ఉంది

Updated at 8:10PM

భాగ్య లక్ష్మి కి తాగుబోతు తండ్రి పాత్రలో కోట శ్రీనివాస రావు "మందు బాబులం మేము మందుబాబులం" అంటూ తెర మీదకు వచ్చారు

Updated at 8:01PM

పవన్ కళ్యాణ్ గూండాలతో కబడ్డీ ఆడే సన్నివేశం చాలా వినోదాత్మకంగా చిత్రీకరించారు.

Updated at 7:57PM

రిక్షా మీద "ఈ పేటకు నేనే మేస్త్రి" అంటూ పవన్ రావటం ఈ సన్నివేశాన్ని చూశాక అభిమానులు సీట్ లో కూర్చోగలరా అనేది ప్రశ్నే

Updated at 7:56 PM

శృతి హాసన్ పాత్ర పేరు భాగ్య లక్ష్మి. రికవరీ రంజిత్ కుమార్ పాత్రలో బ్రాహ్మి, బ్యాంకు రికవరీ ఆఫీసర్ గా పరిచయం

Updated at 7:50 PM

ఆకాశం అమ్మాయి అయితే పాత మొదలయ్యింది శృతి మరియు పవన్ ల మధ్య సన్నివేశాలు చాలా అద్బుతంగా ఉన్నాయి.

Updated at 7:43 PM

పల్లెటూరి అమ్మాయి పాత్రలో శృతి హాసన్ పరిచయమయ్యారు. పవన్ కళ్యాణ్ తనదయిన శైలిలో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు

Updated at 7:41 PM

"నాకు నేనే పోటి నాతో నాకే పోటి నాతో ఎవరు పోటీకి రారు ,రాలేరు" పవన్ కళ్యాణ్ నుండి పంచ్ డైలాగ్

Updated at 7:38 PM

సాంబ పాత్రలో అలీ పరిచయమయ్యారు . "పది మంది కోసం మంచి చేద్దాం అనుకునేవాడిని పది కాలాలు పాటు బతకాలని దీవించమ్మ" సుహాసినితో పవన్ కళ్యాణ్

Updated at 7:32 PM

కొండవీడు గ్రామానికి విలన్ పాత్రలో అభిమన్యు సింగ్ పాత్ర పరిచయం. తనికెళ్ళ భరణి పాత్ర కూడా తెర మీదకు వచ్చింది

Updated at 7:20 PM

ఆకాష్, పూరి జగన్నాథ్ కొడుకు చిన్నప్పటి "గబ్బర్ సింగ్" పాత్రలో "షోలే" సినిమా చూస్తూ పరిచయమయ్యారు తల్లి తండ్రుల పాత్రలలో సుహాసిని మరియు నాగినీడు పరిచయమయ్యారు

Updated at 7:15 PM

టైటిల్స్ వేసిన విధాన గన్స్ బ్యాక్ గ్రౌండ్ తో బుల్లెట్ లాంటి చిత్రానికి సూచికలా ఉన్నాయి.

Updated at 7:12 PM

చిత్రం ఇప్పుడే త్రివిక్రమ్ శ్రీనివాస్,శ్యాం ప్రసాద్ రెడ్డి మరియు రమేష్ సిప్పీ లకు కృతజ్ఞతలు తెలుపుతూ మొదలయ్యింది.

Updated at 7:11 PM

హలో ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన మాస్ ఎంటర్ టైనర్ చిత్రం "గబ్బర్ సింగ్" లైవ్ అప్డేట్స్ అందిస్తున్నాం ఫస్ట్ ఆన్ నెట్

 
Translated by - Raviteja
Bookmark and Share