లవ్ ఫేల్యూర్ మొదటి షో వివరాలు

Love Failure

సినిమా స్టిల్స్

ఆడియో ఆవిష్కరన

వీడియోస్

 

Updated 12:20AM

శుభం కార్డుతో సినిమా సంతోషంగా ముగిసింది. కాలేజ్ స్టూడెంట్స్ కి బాగా నచ్చే ఫీల్ గుడ్ మూవీ.

Updated 12:10AM

రెండవ భాగంలో మొదటి పాట మొదలైంది.

Updated 12:00AM

మూడు ప్రేమ కథలు ఒకే సారి నడుస్తున్నాయి. ఎవరి సమస్యలు వారికున్నాయి.

Updated 11:45AM

విడిపోవడానికి గల కారణాలు చిన్న ఫ్లాష్ బ్యాచ్క్ రూపంలో చూపించాడు. మున్డెం జరుగుతుందో వేచి చూద్దాం.

Updated 11:31AM

సిద్ధార్థ్ తన స్నేహితులతో కలిసి హాలిడే టూర్ కి వెళ్ళాడు. అక్కడ తన స్నేహితులు విడిపోవడానికి గల కారణాలు అడుగుతున్నారు.

Updated 11:07AM

మొదటి భాగంలో రెండు పాటలు మాత్రమే పెట్టాడు. అందువల్ల సినిమా ఫ్లో దెబ్బతినకుండా సాగింది.

Updated 11:05AM

రెండవ భాగం ఎలా ఉండబోతుందో చూద్దాం. అమలా మరియు తల్లితండ్రుల మధ్య సన్నివేశాలతో సాగింది.

Updated 11:03AM

మొదటి భాగం పూర్తి కావచ్చింది. ఇప్పటి వరకు కామెడీ మరియు ఫన్నీ డైలాగులు బావున్నాయి. సిద్ధార్థ్ మరియు అతని స్నేహితుల మధ్య కామెడీ బాగా పండింది.

Updated 10:47AM

డైలాగులు బాగా ఫన్నీ గా ఉన్నాయి. అవి బావుండటంతో సన్నివేశాలు కూడా బాగా పండాయి.

Updated 10:30AM

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలైంది. కాలేజ్ లో సిద్ధార్థ్ మరియు అమలా పాల్ మధ్య 'ఇంతెజారే' పాట మొదలైంది.

Updated 10:15AM

ముఖ్య పాత్రల్ని విడిపోతూ వారిని పరిచయం చేసాడు. కారణం మాత్రం చూపించలేదు. ఈ పరిణామానికి అప్సెట్ అయిన సిద్ధార్థ్ కాలేజ్ లో లవ్ ఫెయిల్యూర్ పాట పాడుకుంటున్నాడు.

Updated 10:10AM

టైటిల్స్ రోలింగ్ చాలా బావుంది. మొదటి సన్నివేశం ముఖ్య పాత్రల మధ్య మొదలైంది.

Updated 10:06AM

ప్రేక్షకుల్లో అధిక భాగం స్టూడెంట్స్ ఉన్నారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు యూత్ లో సిద్ధార్థ్ కి ఎంత్ క్రేజ్ ఉందొ. ప్రసాద్ మల్టిప్లెక్స్ లో మీడియా వారు మాత్రం పెద్దగా లేకపోవడం విశేషం.

Updated 10:00AM

హలో ఫ్రెండ్స్ 'లవ్ ఫెయిల్యూర్ ' లైవ్ అప్డేట్స్ మీ కోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం ఈ చిత్రం పూర్తయ్యే వరకూ సినిమా గురించిన విశేషాలు మీకు ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా అందిస్తూనే వుంటాం. చూస్తూనే ఉండండి 123 తెలుగు.కాం

 
- Ashok
Bookmark and Share