|
Updated 11:57AM
క్లైమాక్స్ - చిత్రానికి సంతోషకరమయిన ముగింపు దక్కింది అందరు ఆనందంగా ఉన్నారు కాసేపట్లో రివ్యూ అందిస్తాం చూస్తూనే ఉండండి 123తెలుగు.కాం
Updated 11:44AM
మరో ఫైట్ సీన్ నడుస్తుంది ఆది తన ఫైట్ లతో అందరిని ఆకట్టుకుంటున్నాడు
Updated 11:37AM
కథ కాస్త సీరియస్ అయ్యింది ప్రతీకార నేఫధ్యం మొదలయ్యింది
Updated 11:33AM
ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో రాహుల్ దేవ్ కథలోకి ప్రవేశించారు.
Updated 11:22AM
రాజేంద్ర ప్రసాద్ కామెడితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నారు. ఇప్పుడే ఒక చేజ్ సీన్ జరిగింది. మంచి కామెడీ తో చిత్రం సాగుతుంది.
Updated 11:11AM
కామెడి విభాగం లో వెన్నెల కిషోర్ చాలా బాగా న్యాయం చేస్తున్నారు
Updated 11:06AM
ఆది, శాన్విల ప్రేమలో అంతరాలు సృష్టించేందుకు రాజేంద్ర ప్రసాద్ పలు వేషాలు వేస్తున్నారు
Updated 10:56AM
'నిన్ను చూసిన క్షణమున' పాటను టర్కీలో చిత్రీకరించారు చూడటానికి చాలా బాగుంది ఈ పాట
Updated 10:41AM
ఇంటర్వల్- మొదటి అర్ధ భాగం కామెడి మరియు రొమాన్స్ తో నడిచింది. రేడవ అర్ధం లో కథ కీలకంగా ఉండేలా కనిపిస్తుంది. రాజేంద్ర ప్రసాద్ పాత్ర ప్రాదాన్యత సంతరించుకోనుంది
Updated 10:37AM
ఆది మరియు కొంతమంది గూండాల మధ్య భారి ఫైట్ ఒకటి జరిగింది
Updated 10:33 AM
మరో పాట మొదలయ్యింది "లవ్లీ లవ్లీ"
Updated 10:23 AM
రాజకీయ నాయకుడు పిజేపిగా పరుచూరి గోపాల కృష్ణ కథలోకి ప్రవేశించారు
Updated 10:19 AM
హీరొయిన్ ఫ్రెండ్ గా చిన్మయి ఘట్రాజు అద్బుతంగా నటిస్తుంది రెండవ పాటకు సమయం "చోరి చోరియే"
Updated 10:13 AM
ప్రధాన పాత్రల మధ్య ప్రేమ కథ మొదలయ్యింది కాస్త కామెడికి పదునయిన మాటలను జత చేసి కథను నడిపిస్తున్నారు
Updated 9:57 AM
రాజేంద్ర ప్రసాద్ కూతురిగా శాన్వి తెర మీదకు వచ్చింది చూడటానికి చాలా అందంగా ఉంది
Updated 9:54 AM
ఆది అన్నయ్యగా హర్ష వదినగా సత్య కృష్ణ లు తెర మీదకు వచ్చారు
Updated 9:50 AM
ఆది స్నేహితుడిగా వెన్నెల కిషోర్ కథలోకి వచ్చారు
Updated 9:48 AM
ఆహుతి ప్రసాద్ బంక్ బాబు పాత్రలో తెర మీద్దకి వచ్చారు అయన చూడటానికి బప్పి లహరిలా ఉన్నారు డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి
Updated 9:39 AM
ఆది ఇంట్రడక్షన్ అదిరిపోయింది. మొదటి పాట మొదలయ్యింది డాన్సు లు చాలా బాగా చేస్తున్నాడు.
Updated 9:31 AM
మంగళంపల్లి మహారధి పాత్రలో రాజేంద్రప్రసాద్ తెర మీదకు వచ్చారు ఆయనతో పాటు తనికెళ్ళ భారతి ప్రవేశించారు
Updated 9:29 AM
చిత్రం ఇప్పుడే మొదలయ్యింది టైటిల్ ఆసక్తికరంగా వేస్తున్నారు
Updated 9:25 AM
హలో ఫ్రెండ్స్! మీకోసం ఈరోజు మేము ఆది,శాన్వి ప్రధాన పాత్రలలో నటించిన "లవ్లీ" చిత్ర లైవ్ అప్ డేట్స్ ఇస్తున్నాం. చూస్తూనే ఉండండి 123తెలుగు.కాం
Click For English Live Updates 'Lovely '
|