Updated 09:54 PM
ఇంతటితో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "పంజా" చిత్ర ఆడియో కార్యక్రమం అధికారికంగా ముగిసింది. మా ప్రత్యక్ష సమాచారం మీకు ఆనందాన్ని ఇచ్చిందని ఆశిస్తున్నాం. నమ్మకమైన, ఖచ్చిత మైన అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 123 తెలుగు.కామ్
Updated 09:53 PM
ఇంకా పవన్ చెప్పినదేమిటంటే : "నా ఆప్తుడు ఎస్ జే సూర్య సలహామేరకు విష్ణువర్ధన్ తో పనిచేసాను. ఆయన పంజా చిత్రాన్ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాకు ఆయన పడ్డ కష్టానికి నిజంగా కృతజ్ఞతలు చెబుతున్నా. ప్రోడుసర్స్ తో పాటు చిత్ర యూనిట్ ప్రతీ ఒక్కరికీ మనః స్పూర్తి గా ధన్యవాదాలు తెలుపుతున్నా.
Updated 09:46 PM
పవన్ కళ్యాణ్ మాటల్లో " చిత్ర పరిశ్రమకు వచ్చిన 15 ఏళ్ళ లో ఎప్పుడూ మీరంతా నా గుండెల్లోనే గూడుకట్టుకున్నారు. మీ అనురాగం, ఆప్యాయత మరువలేనిది. నన్ను తొలి నాళ్లలో అన్నయ్య నటించమని అడిగినపుడు నా మనస్సు ను నేను ప్రశ్నించుకున్నాను. నేను దీనికి అర్హుడినేనా అని. నా ప్రతీ చిత్రంలోనూ నిర్లక్ష్యంగా ఎప్పుడూ లేదు. వంశపారం పర్యంగా విజయాలు అందుకోవాలని నేనెప్పుడు అనుకోలేదు కేవలం కృషితోనే సాధించాలని భావించేవాడిని. నేను తక్కువ సినిమాలు చేయటం బాధాకరమే అయినప్పటికీ దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పంజా కోసం కూడా ఎంతో శ్రమించాను.
Updated 09:35 PM
విష్ణువర్ధన్ మాట్లాడుతూ "ఈ అద్భుతమైన సందర్భంలో భాగస్వామి కావటం నాకు చాలా సంతోషంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి, ప్రోడుసర్స్ కు అభినందనలు."
Updated 09:33 PM
అనంతరం రాజమౌళి మాట్లాడారు. పంజా టైటిల్ అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమా ట్రైలర్స్ సూపర్ గా ఉన్నాయన్నారు. ఈమూవీ తప్పక ఘన విజయం సాధిస్తుందని ఆశించారు.
Updated 09:30 PM
కీరవాణి స్టేజి పై మాట్లాడుతూ "మా గురువుగారైన ఇళయరాజా గారు , అతని కుమారుడు యువన్ శంకర్ రాజా గొప్ప సంగీతాన్ని అందిస్తారని కీర్తించారు. పంజా సినిమా బ్లాక్ బస్టర్ గా నిలవాలని మనః స్పూర్తిగా కోరుకుంటున్నా" అని వెల్లడించారు.
Updated 09:25 PM
పవన్ కళ్యాణ్ ఓ మంచి వక్త. వేడుకకు వచ్చిన జనసమూహానికి ఆయన మనః పూర్వక ధన్యవాదాలు అర్పించారు. పవన్ కు కరుడుకట్టిన అభిమాని అయిన ఈఈఠ్ టాపర్ పృద్వీతేజ్ ను గోల్డ్ మెడల్ తో పవన్ కళ్యాణ్ సత్కరించారు.తర్వాత ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తొలి Cఢ్ ఆవిష్కరించారు.
Updated 09:18 PM
ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం వేదికపై జరగబోతోంది. అందుకోసం అతిధులందరినీ స్టేజి పైకి ఆహ్వానిస్తున్నారు.
Updated 09:14 PM
"సాయం పొందిన వాడు కృతజ్ఞత చూపించక పోవటం ఎంత తప్పో, సాయం చేసిన వాడు కృతజ్ఞత ఆశించటం కూడా అంతే తప్పు" పంజా డైలాగ్
Updated 09:10 PM
మూవీ లో తదుపరి సాంగ్ "ఎలా ఎలా" పాట ఆవిష్కృతమైంది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ స్టెప్స్ చాల ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. సినిమాకు చెందిన ఓ కొత్త డైలాగ్ ప్రోమో ప్రదర్శించారు. ఇది నిజంగా రాకింగ్ ట్రైలర్. ఇది చూసిన అభిమానుల్లో అమితానందం. పవన్ కామెడి టైమింగ్ కడుపుబ్బా నవ్వించేదిగా ఉంది.
Updated 09:00 PM
"పాపారావ్" పాటను తెరపై ప్రదర్శిస్తున్నారు. ఈ పాటను పవన్ కళ్యాణ్.. బ్రహ్మానందం పై పాడటం విశేషం. తన కాట్రవల్లి మాటలతో అలీ ప్రేక్షకుల మధ్యన కామెడి చేస్తున్నారు. అనంతరం ప్రాచీన యుద్ద తంత్రం కలరిపయట్టు ను స్టేజి పై ప్రదర్శిస్తున్నారు.
Updated 08:54 PM
స్టేజి పైకి బ్రహ్మానందం వచ్చారు. అతని రాకతో ప్రేక్షకుల్లో ఒక్కసారిగా కేరింతలు. 'పంజా' చిత్రం పవన్ కళ్యాణ్ నట జీవితం లో ఓ మచ్చుతునక గా నిలిస్తుందని ఆయన చెప్పారు. ఈ సినిమా లో పవన్ అద్భుత నటన అభిమానులకు వీనుల విందు కానుందని తెలిపారు. తను ఈ సినిమాలో సబ్ ఇన్స్పెక్టర్ పాపారావు గా నటిస్తున్నట్టు చెప్పారు. యువన్ శంకర్ రాజా సంగీతం సూపర్ గా ఉందన్నారు. విష్ణువర్ధన్ డైరెక్షన్ చాలా బావుందని ప్రసంసలు కురిపించారు.
Updated 08:38 PM
సిని ఇండస్ట్రీ లో పవన్ కళ్యాణ్ 15 ఏళ్ళ సేవకు జ్ఞాపికగా ఓ ప్రత్యేకమైన పాటను ప్రదర్శించనున్నారు. ఇది ఖచ్చితంగా రాక్ చేయబోతోంది. అటువైపు ప్రేక్షకుల హర్షద్వానలతో స్టేడియంలో సందడే సందడి.
Updated 08: 26 PM
స్టేజి పై అత్యద్భుత ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. అలీ తన చిలిపి చేష్టలతో సందడి చేస్తున్నాడు.
Updated 08: 13 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పుడే వేదిక వద్దకు చేరుకున్నారు. ఇంతలోనే అభిమానులంతా ఆయన్ను చుట్టూ ముట్టే ప్రయత్నం చేస్తున్నారు.
Updated 08: 10 PM
పంజా టైటిల్ సాంగ్ ను జాని మాస్టర్ అతని బృందం ప్రదర్శించి ప్రేక్షకుల్లో ఉల్లాసం నింపనున్నారు. ఇంతలో సుమ ఓ ప్రకటన చేసారు అదేమంటే, రాజమౌళి, కీరవాణి ఎంట్రన్స్ వద్ద విపరీతమైన ట్రాఫిక్ జాం లో చిక్కుకున్నారని.
Updated 07: 58 PM
యు ట్యూబ్ పంజా పోటీ లో ఉత్తమ ఎంట్రీ లను తెరపై చూపిస్తున్నారు.
Updated 07: 45 PM
వంశి పైడిపల్లి, సాయ్ ధరం తేజా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నారు. వేదికపై పవన్ సాంగ్స్ కు డాన్సు ప్రదర్శన జరుగుతోంది.
Updated 07: 34 PM
ఇప్పుడు 'పంజా' చిత్రంలోని తరువాతి పాట ఆవిష్కృతం కానుంది. "చేయి వేయరా" అనే ఈ పాటను సలోని ప్రదర్శించి చూపబోతున్నారు.
Updated 07: 23 PM
సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా వేడుక లోకి ప్రవేశించారు. ఇక్కడి వాతావరణం చూస్తుంటే నమ్మశక్యం కావటంలేదు. అంతటి కోలాహలం నెలకొంది. గణేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో పనిచేసిన నాటి అనుభవాలను చెబుతున్నారు.
Updated 07: 13 PM
'పంజా' సినిమాలో మొదటి పాట ఆవిష్కృతమైంది. "అనుకోనిదే కదా" అనే ఈ సాంగ్ ను ప్రియ హేమేష్ - బి రాజా ఆలపించారు.
Updated 07: 00 PM
ఈ సాయంత్రం వేళ మొదటి స్టేజి ప్రదర్శన మొదలైంది. ఆంధ్ర స్టూడెంట్ సాంగ్ ను డ్యాన్సర్ల బృందం రక్తి కట్టిస్తున్నారు. ఈలలు, చప్పట్లతో స్టేడియం మారుమోగుతోంది.
Updated 06: 55 PM
వావ్...స్టేజి పైకి అలీ రాకింగ్ ఎంట్రీ...పంజా చిత్రం లో పవన్ కళ్యాణ్ వేషధారణతో అలీ అందరిచూపులనూ ఆకర్షిస్తున్నాడు. రేబాన్ స్పెట్స్, గడ్డం తో అబ్బో సూపర్ కామెడి
Updated 06: 50 PM
ఫంక్షన్ అధికారికంగా ప్రారంభమయింది. స్టేజి పైకి చేరుకున్న సుమ యాంకర్ గా వ్యవహరించబోతోంది. ఇంకోవైపు నిర్మాత బివిఎస్ యన్ ప్రసాద్ లోనికి ప్రవేశించారు
Updated 06: 35 PM
నిర్మాత శోభు యార్లగడ్డ చివరి నిమిషం లోనూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. డైరెక్టర్ విష్ణువర్ధన్ విఐపి వరుస లో ఉన్నవారి తో ముచ్చటిస్తూ కనిపిస్తున్నారు. ఎల్ఇడి స్క్రీన్స్ పై పవన్ కళ్యాణ్ గురించి చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తుల బైట్స్ ప్లే చేస్తున్నారు.
Updated 06: 25 PM
'పంజా' చిత్ర దర్శకుడు విష్ణువర్ధన్ వేదిక లోకి చేరుకుంటున్నారు.. అత్యుత్సాహం తో ఉరకలేస్తోన్న జనాన్ని అదుపు చేయటం తలకు మించిన భారంగా పరిణమిస్తోంది.
Updated 06: 15 PM
ముఖ్య అతిధులు.. చిత్ర పరిశ్రమకు చెందిన వ్యక్తులు ఒక్కొక్కరిగా ప్రాంగణం వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎల్ఇడి తెరలపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాటలు హోరెత్తిస్తున్నాయి.
Updated 05: 58 PM
వెన్యూ వద్ద రెండు వైపులా ఉన్న భారీ ళేఢ్ స్క్రీన్స్ పై ఖుషీ, జల్సా చిత్రాల వీడియో పాటలు ప్లే చేస్తున్నారు. ప్రేక్షకులంతా వాటిని చూసి ఆనందం తో తేలియాడుతున్నారు.
Updated 05: 45 PM
స్టేడియం బయట ఒకటే కోలాహలం.. ప్రాంగణం వద్దకు వచ్చేందుకు అభిమానుల ఉత్సాహం.. దీంతో ఈ ప్రాంతమంతా జాతర మాదిరి మారింది. ఇక్కడ ఏర్పాటు చేసిన తెరపై సినిమాలోని కొన్ని వర్కింగ్ స్టిల్ల్స్ ప్రదర్శిస్తున్నారు వాటిలో బ్రహ్మానందం, ఆలి మైమరపిస్తున్నారు.
Updated 05: 30 PM
గచ్చిబౌలి స్టేడియం పవర్ స్టార్ అభిమానుల నినాదాలతో మారుమోగుతోంది. వేడుక ప్రారంభానికి ముందు స్టేజ్ పై అబ్బుర పరిచే ప్రదర్శనలు అందరినీ ఉత్తేజితుల్ని చేస్తున్నాయి.
Updated 05: 25 PM
మీకోసం పంజా ఆడియో ఆల్బం విడుదల విశేషాలు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం నుంచి ప్రత్యక్షం గా అందిస్తున్నాం. ఎప్పటి కప్పుడు తాజా సమాచారం కోసం, వీనుల విందుగా సాగే కార్యక్రమ అప్డేట్స్ కోసం చూస్తూ నే ఉండండి 123 తెలుగు.కామ్
|