|
మేం వయసుకు వచ్చాం : చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోగా ఎదిగిన తనీష్ హీరోగా విడుదలైన చిత్రం " మేం వయసుకు వచ్చాం ". నీతి టేలర్ మరియు మదాలస శర్మ ఈ చిత్రంలో కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం రెండు వేరు వేరు
మతాలకు సంభందించిన ఒక అబ్బాయి మరియు ఒక అమ్మాయి మధ్య నడిచే యూత్ ఫుల్ లవ్ స్టొరీ. నక్కిన త్రినాధ రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు.
ఈ చిత్రం బాక్స్ ఆఫీసు దగ్గర 4వ స్థానంలో ఉంది.
.
 ఈ చిత్రంలో తనీష్ మరియు నీతి టేలర్ మంచి నటనను కనబరిచారు. ఈ చిత్రంలో వచ్చే పాటలలో మదాలస శర్మ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత తెలుగు తెరపై కనిపించిన విలక్షణ నటుడు మరియు దర్శకుడు భాగ్యరాజ్ ఈ చిత్రంలో మంచి పాత్ర మరియు నటనతో అలరించారు. ఈ చిత్రం మొదటి అర్ధ భాగంలో వచ్చే కామెడి ప్రేక్షకులను బాగా నవ్వించింది.
 ఈ చిత్రం రెండవ అర్ధ భాగం చాలా నిధానంగా సాగుతుంది. ఈ చిత్రంలోని పాటలు అంతంత మాత్రంగానే ఉన్నా ఆ పాటలు సందర్భానుసారంగా రాకుండా ప్రేక్షకులని కొంత ఇబ్బంది పెడతాయి. ఈ చిత్ర దర్శకుడు రెండు వేరు వేరు మతాలకు సంభందించిన ఇద్దరి మధ్య నడిచే ప్రేమకథని అంత సమర్థవంతంగా తెరకెక్కించలేకపోయాడు. ఈ చిత్ర కథలో సినీ ఆరాధకులు కోరుకునే ఎలాంటి కొత్తదనం లేదు మరియు ఇది ఒక రొటీన్ ప్రేమ కథా చిత్రం.
బాక్స్ ఆఫీసు వద్ద :
ఎ)సెంటర్స్ : మాములుగా ఆడుతుంది
బి)సెంటర్స్ : పరవాలేదు
సి) సెంటర్స్ : పరవాలేదు
మాములుగా ఆడుతుంది
|