బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : బ్లాక్ మనీ
Next
 

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ అంటే అది మోహన్ లాల్ అనే చెప్పాలి. జర్నలిస్ట్ పాత్రలో ఆయన అద్భుతంగా నటించారు. అమల పాల్ కూడా తన పాత్ర మేరకు బాగానే నటించింది. తన పాత్రలోని నెగెటివ్ షేడ్స్ ను చాలా బాగా ఎలివేట్ చేసింది. ఇంటర్వెల్ బ్యాంగ్ మరియు ఫస్టాఫ్ చివరి 30 నిముషాల సినిమా చాలా ఆసక్తికరంగా సాగింది. అసలు మీడియా సర్కిల్ ఎలా పనిచేస్తుంది, అవి టాప్ ప్లేస్ లో నిలవడానికి ఇతర చానల్స్ తో ఎలా పోటీపడతాయి అనే వాటిని సృష్టాంగా, ఆసక్తికరంగా చూపారు.

 
సెకండాఫ్ మొదటి 15 నిముషాల గడిచాక సినిమా కాస్త కష్టంగా మారింది. మోహన్ లాల, అమలా పాల్ ఇద్దరూ పోలీసుల నుండి తప్పించుకోవడం, దాక్కోవడం వంటి సీన్లు అసలు కథను పక్కదారి పట్టించాయి. దీంతో అప్పటి వరకు ఒక మూడ్లో ఉన్న సినిమా ఉన్నట్టుండి ఇంకొక మూడ్లోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఓవర్ గా ఉంది. సినిమాలో కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు కారణం లేకుండానే వస్తూ కాస్త తికమక పెట్టాయి. కథనం మొత్తం సీరియస్ గా నడిచేది కావడంతో కామెడీని కోరుకునే వారికి నిరుత్సాహం తప్పదు.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : ప్రారంభం పర్వాలేదు
 
బి సెంటర్స్ : ప్రారంభం పర్వాలేదు
 
సి సెంటర్స్ : ప్రారంభం పర్వాలేదు
 
తీర్పు: ప్రారంభం పర్వాలేదు
 
Bookmark and Share