బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : రారండోయ్ వేడుక చూద్దాం
Next
 
రారండోయ్ వేడుక చూద్దాం : అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం 'రారండోయ్ వేడుక చూద్దాం'. 'ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో' చిత్రాలు తర్వాత నాగ చైతన్య, 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ చేసిన సినిమా కావడంతో ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించి మొదటి తొమ్మిది రోజుల్లో రూ. 35 కోట్ల గ్రాస్ వసూలు చేసి లాంగ్ రన్లో సైతం బాగానే ఆడుతూ హిట్ చిత్రంగా నిలిచింది.


 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 4వ స్థానంలో ఉంది.
.
అమాయకత్వం, పెంకితనం, మంచితనం, తింగరితనం వంటి అన్ని లక్షణాలు కలగలిసిన భ్రమరాంబ క్యారెక్టర్ కనిపించే ప్రతి సన్నివేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. నాగ చైతన్యకు ఆమెకు మధ్య నడిచే లవ్ ట్రాక్ బాగుంది. ఇక సెకండాఫ్లో కథనం కాస్త ఊపందుకోవడంతో సినిమాలో లీనమయ్యే ఛాన్స్ దొరికింది. హీరో హీరోయిన్ తో తన ప్రేమను, తనలోని భాధను చెప్పే ఎపిసోడ్లో నాగ చైతన్య నటన, చెప్పిన డైలాగులు చాలా రియలిస్టిక్ గా, ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. ఇక సినిమా మధ్య మధ్యలో వచ్చే వెన్నెల కిశోర్ కామెడీ కొన్ని నవ్వుల్ని పంచింది.


 
చాలాసేపటి వరకు నిమా అసలు కథలోకి వెళ్లకపోవడంతో నత్త నడకన సాగుతున్నట్టు అనిపించడంతో పాటు అవసరానికి మించిన పాత్రల్ని పరిచయం చేయడం, ఆ పాత్రధారులైన పృథ్వి, రఘుబాబు, పోసాని, తాగుబోతు రమేష్, సప్తగిరి వంటి మంచి హాస్యం పండించగల నటుల్ని కూడా పూర్తిస్థాయిలో కాకుండా అరకొరగా వాడుకుని వదిలేయడంతో నిరుత్సాహం కలిగింది. ఇక ఇంటర్వెల్ ట్విస్ట్ చూసి సెకండాఫ్లో ఆ పాయింట్ చుట్టూ కొత్తదనమున్న మంచి డ్రామా ఏదైనా ఉంటుందేమో అని ఊహిస్తే అది కూడా కాస్త సాధారణంగానే ఉంది. చిత్ర క్లైమాక్స్ కూడా ఒక ఫైట్ తో సులభంగా, రొటీన్ గానే ముగిసిపోయింది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :
 
ఎ సెంటర్స్ : బిలో యావరేజ్
 
బి సెంటర్స్ : బిలో యావరేజ్
 
సి సెంటర్స్ : బిలో యావరేజ్
 
తీర్పు: హిట్
 
Bookmark and Share