బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : బాహుబలి 2
Next
బాహుబలి - ది కంక్లూజన్ : దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరక్కించిన అద్భుత చిత్రం 'బాహుబలి-2'. భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా 8000 స్క్రీన్లలో రిలీజైన ఈ చిత్రం అన్ని ఏరియాల నుండి బలమైన పాజిటివ్ టాక్ తెచ్చుకోని ఇండియాలో రూ. 1000 కోట్ల గ్రాస్, ప్రపంచవ్యాప్తంగా రూ. 1500 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నతో మొదలయ్యే ఈ సినిమాలో ప్రేక్షకులను అబ్బురపరిచే విజువల్స్, కళ్ళు చెదిరే గ్రాఫికల్ వర్క్ మేజర్ హైలెట్స్ గా నిలిచాయి. సినిమా చూస్తున్నంత సేపు ప్రతి ఫ్రేమ్ ఒక వండర్ లా తోచింది. దానికి తోడు రచయిత విజయేంద్ర ప్రసాద్ క్రియేట్ చేసిన శివగామి, అమరేంద్ర బాహుబలి, కట్టప్ప, భల్లాలదేవుడు, దేవసేన వంటి పాత్రలు, వాటి స్వభావం మరింతగా ఆకట్టుకున్నాయి. ఇక రాజమౌళి ఆ పాత్రలు మధ్య నడిపిన ఎమోషనల్ డ్రామాకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ సీక్వెన్సులు, సెకండాఫ్లో వచ్చే భావోద్వేగా సన్నివేశాలు, క్లైమాక్స్ లోని పోరాట సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలాలు.

 
జక్కన్న చెక్కిన ఈ శిల్పంలో పెద్దగా ప్రేక్షకులను నిరుత్సాహపరిచే బలహీనతలు లేవు. సెకండాఫ్ చివర్లో కాస్త జోరు తగ్గినట్టు తోచిన యుద్ద సన్నివేశాలు కాస్తంత నిరుత్సాహానికి గురిచేయగా తమన్నా పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం ఆఖర్లో అనుష్క పాత్రలో పెద్దగా ఏమోషన్ పనిచేయకపోవడం చిన్న చిన్న అసంతృప్తులుగా తోచాయి.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : బాగుంది
 
బి సెంటర్స్ : బాగుంది
 
సి సెంటర్స్ : బాగుంది
 
తీర్పు: బ్లాక్ బస్టర్ హిట్
 
Bookmark and Share