బాక్స్ ఆఫీసు రిపోర్ట్

ఫొటొ : గురు
Next
 
గురు : విక్టరీ వెంకటేష్ పూర్తిగా తన లుక్ మార్చేసి రొటీన్ ఫార్ములాకి భిన్నంగా చేసిన చిత్రమే ఈ 'గురు'. ఫస్ట్ లుక్ రిలీజ్ నుండి బ్రహ్మాండమైన క్రేజ్ సంపాదించుకుని ప్రీమియర్ షోల ద్వారా కూడా మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని మార్చి 31న విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టి హిట్ టాక్ తెచ్చుకుని ప్రస్తుతం నగరంలోని కొన్ని థియేటర్లలో మాత్రమే నడుస్తోంది.

 
ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 3వ స్థానంలో ఉంది.
.
సినిమాలో వెంకటేష్ నటన అందరినీ గొప్పగా ఆకట్టుకుంది. ఫ్రస్ట్రేషన్ కలిగిన బాక్సింగ్ కోచ్ ఎలా ఉంటాడు, అతని ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ఆటను తన శిష్యులను ఎలా ట్రీట్ చేస్తాడు, టాలెంట్ ఉన్న వలలను ఎంకరేజ్ చెయ్యడానికి ఎలాంటి త్యాగాలు చేస్తాడు అనే అంశాలను వెంకీ చాలా గొప్పగా తన నటన ద్వారా చూపెట్టారు. దర్శకురాలు సుధా కొంగర సినిమాను తీసిన విధానం కూడా బాగా ఆకట్టుకుంది. ఆమె ఏం చెప్పాలనుకున్నారో దాన్నే సూటిగా ఎలాంటి డీవియేషన్స్ లేకుండా చెప్పి మెప్పించారు. హీరోయిన్ రితిక సింగ్ కూడా ఒక అల్లరి అమ్మాయిగా, బాక్సర్ గా వెంకీతో పోటాపోటీగా నటించింది.

 
సినిమాలోని సెకండాఫ్ కాస్త నెమ్మదించింది. పాత్రల మధ్య ఎమోషన్ బిల్డ్ చేయడానికి దర్శకురాలు కాస్త ఎక్కువ టైమ్ తీసుకోవడంతో ఆ ఎపిసోడ్లు కాస్త బోర్ అనిపించాయి. అలాగే వెంకీ రితికా సింగ్ కు శిక్షణ ఇచ్చే సన్నివేశాలని ఇంకాస్త బాగా చూపించి ఉండాల్సింది. అలాగే క్లైమాక్స్ బాక్సింగ్ మ్యాచ్ లో కూడా ఇంటెర్నేషనల్ లెవల్ అప్పీల్ మిస్సయింది.
 
బాక్స్ ఆఫీసు వద్ద :

 
ఎ సెంటర్స్ : బిలో యావరేజ్
 
బి సెంటర్స్ : బిలో యావరేజ్
 
సి సెంటర్స్ : బిలో యావరేజ్
 
తీర్పు: హిట్
 
Bookmark and Share