ఇంటర్వ్యూ : ఏకే కంభంపాటి – సినిమా తీయడం కోసం నేను యుఎస్ లో జాబుని మానేసి వచ్చాను.

ఇంటర్వ్యూ : ఏకే కంభంపాటి – సినిమా తీయడం కోసం నేను యుఎస్ లో జాబుని మానేసి వచ్చాను.

Published on Apr 16, 2013 10:30 PM IST
First Posted at 19:05 on Apr 16th

Chinna-Cinema-Director

ఏకే కంభపాటి దర్శకత్వం వహించిన సినిమా ‘చిన్న సినిమా’. ఈయన ఒక ఎన్.ఆర్.ఐ. తనకు సినిమాల మీద వున్నా మక్కువతో తను చేస్తున్న ఉద్యోగాన్ని వదేలేసి వచ్చాడు. ఈయన న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేశాడు. ఏకే చాలా సాదాసీదాగా వుండే వ్యక్తి. ఏదో అద్బుతం జరిగి తన మొదటి సినిమాతోనే గొప్పవాణ్ణి కావాలని ఈయన అనుకోవడంలేదు.ఈ సినిమా చాన్స్ ఆయనకు ఎలా వచ్చింది. అలాగే ఈ సినిమా విశేషాలను విలేకరుల సమావేశంలో ఆయన తెలియజేశారు. ఏకే దర్శకత్వం వహించిన ‘చిన్న సినిమా’ ఈ శుక్రవారం విడుదలకానుంది. ఈ సినిమా విశేషాలను ఆయన మాటల్లోనే చూద్దాం.

ప్రశ్న: ఈ చిన్న సినిమా అంటే ఏమిటి చెప్పడి ?

స. చిన్న సినిమా ఒక వంగ్య కామెడీ సినిమా. ఈ సినిమాలో 80% ఈ వంగ్య కామెడీయే వుంటుంది. అలాగే మంచి వేదాంతం కూడా వుంటుంది. ఈ సినిమాలో ముఖ్యమైన సన్నివేశాలను యుఎస్ లో చిత్రికరించాము, మిగిలిన దానిని హైదరాబాద్లో చిత్రికరించాము. ఈ సినిమాలో ఇంటర్వల్ కు ముందు, క్లైమక్స్ కి ముందు మంచి ఏమోషినల్ సన్నివేశాలు తెరకెక్కించాము. ఈ సినిమాకి ఈ పేరు సరిగ్గా సరిపోయింది. ఈ సినిమాలో అనవసరమైన పాత్రాలు ఏమి లేవు అన్ని పాత్రలు సినిమాలో ముఖ్యమైన పాత్రనే పోషిస్తాయి.

ప్రశ్న. ఈ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిందా? ఈ సినిమాలో సినిమా వారిని టార్గెట్ చేశారా ?

స. లేదు. ఈ సినిమాలో సినీ ఇండస్ట్రీ గురించి గాని లేదా సినిమా వారిని గాని టార్గెట్ చేయలేదు. ఈ సినిమాని పూర్తిగా కామెడీ సంభాషణలతో కొన్ని ముఖ్యమైన పాత్రలపై తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాని తక్కువ ఖర్చుతో నిర్మించాము కాబట్టి ‘చిన్న సినిమా’అని పేరు పెట్టడం జరిగింది. ఇది నిజంగా చిన్న సినిమాయే. కానీ దీనిని ప్రామాణిక విలువలు లేని, చెడ్డ సినిమాకాదు (నవ్వుతూ). ఈ సినిమాని మంచి ప్రామాణిక విలువలతో నిర్మించాము.

ప్రశ్న. ఎలా ఈ ప్రాజెక్ట్ మొదలైంది?

స.నాకు సినిమాలంటే చాలా ఇష్టం. నేను 2004లో ఫిల్మ్ ఎడిటింగ్ లో చేరాలనుకున్నాను కాని అది కుదరలేదు. దానితో నేను చికాగో నుండి న్యూయార్క్ వెళ్ళాను. అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో చేరి ఫిల్మ్ మేకింగ్ నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నా తపన, ఇష్టాన్ని చూసి నా ఫ్రెండ్, కజిన్ శేఖర్ లు నాకు చాలా సపోర్ట్ చేశారు. కోర్స్ ముగిసిన తరువాత నేను నా కలని నిజం చేసుకోవాలనుకున్నాను. శేఖర్ ని కలిసి కొని లైన్స్ కథని చెప్పను. దానితో వారు నువ్వు సినిమా తీయగలవని శేఖర్ కముల, దేవా కట్ట నన్ను ప్రోత్సహించారు.

ప్రశ్న. ఈ సినిమాలో ఎవరు ముఖ్యమైన నటులు ఎవరు?

స. ఈ సినిమాలో హీరో అర్జున్ కళ్యాణ్. తను న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో డిగ్రీ చేస్తున్నాడు. ఈ సినిమాలో సుమోన హీరోయిన్. తను ఒక బెంగాలీ. తను చాలా అడ్స్ లో నటించింది. ఈ సినిమాలో మెయిన్ విలన్ మహేష్. తను ఎన్.ఆర్.ఐ. వీరితో పాటుగా తాగుబోతు రమేష్, ఎల్.బి.శ్రీరామ్, వెన్నెల కిషోర్, కోమల్ ఝాలు నటించారు.

ప్రశ్న. ఈ సినిమా పై మీరు ఎలాంటి అంచనాలతో వున్నారు?

స. నేను అద్బుతం జరగి ఎవరికీ రాని కలెక్షన్లు రావాలని అనుకోవడం లేదు. నేను ఈ సినిమా తీస్తున్నప్పుడు కొన్ని విషయాలను నేర్చుకున్నాను, మేము ఈ సినిమాని చాలా చక్కగా నిర్మించాము.ఈ సినిమాలో వచ్చే బావొద్వేగమైన సన్నివేశాలు, కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులకి చాలా బాగా నచ్చుతాయి. నేను కచ్చితంగా చెబుతున్నాను అందరికి ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమాను చూసిన ప్రజలు మమ్మల్ని అబినందిస్తారు.

ప్రశ్న. ఈ సినిమా ఎన్.ఆర్.ఐ ప్రేక్షకులను టార్గెట్ గా చేసుకొని నిర్మించారా?

స. కాదు. ముఖ్యంగా ఎన్.ఆర్.ఐ ని మాత్రమే టార్గెట్ చేసి నిర్మించలేదు. ఆడియన్స్ ని టార్గెట్ చేసి ఈ సినిమాను నిర్మించడం జరిగింది. ఇది మంచి విజయాన్ని సాదిస్తుంది. ఈసినిమా పెద్ద వారికి. 35సంవత్సరాల లోపు వారికి చాలా బాగా నచ్చుతుంది. ఈ సినిమాలోని కామెడీ , వంగ్యంగా మాట్లాడే మాటలు అందరికి నచ్చుతాయి. మేము ఈ సినిమాని యుఎస్ లో చాలా తక్కువ ఖర్చు తో విడుదల చేస్తున్నాము. ఈ సినిమాని 10 సెంటర్స్ లో విడుదల చేస్తున్నాము. ప్రిమియర్ షో ని 3సెంటర్స్ లో వేస్తున్నాము.

ప్రశ్న. ఈ సినిమా షూటింగ్ మొదలవడానికి ముందు మీరు ఎక్కువ వర్క్ ఏమైనా చేశారా?

స. నిజం చెప్పాలంటే లేదు. సినిమా మొదలవడానికి ముందు మేము మొత్తం 14 రోజులు పనిచేశాము.మొత్తం ప్రయత్నమంత సినిమా షూటింగ్ లోనే చేశాను. దీనివల్లె కొంత ఆలస్యం అయ్యింది. మేము చాలా వరకు టైం మొత్తం షూటింగ్ లోనే గడిపేవాళ్ళం. నేను దీని వల్ల ప్రీ -ప్రొడక్షన్, ప్లానింగ్ గురించి చాలా నేర్చుకున్నాను.

ప్రశ్న.మీకు ఈ సినిమా కెరీర్ కోసం ఒక మంచి జాబు వదిలేశానని అనిపించిందా ?

స. సినిమా షూటింగ్ జరుగుతున్నపుడు నేను చాలా కష్టాలను ఎదురుకున్నాను. ఆ సమయంలో నేను వేరేవిదంగా ఆలోచించేవాడిని. నేను నా మొదటి సినిమాకి తీయగాలనా అనే అనుమానం వచ్చింది. ప్రతిసారి రిస్క్. టెన్షాన్. కాని వాటిని కళ్ళు మూసుకొని అనుభవిస్తూ సినిమాని ముగించాను. నాకున్న కొద్దిపాటి సోర్స్ తో చాలా జాగ్రత్తగా నిర్మించాను. నాకు ప్రస్తుతం కాస్త ఆందోళనగా వుంది ప్రజలు ఎలా సినిమాని రిసీవ్ చేసుకుంటారోనని. నేను పడిన కష్టానికి గర్వపడుతున్నాను, అలాగే చాలా ఆనందంగా వున్నాను.

ప్రశ్న. మీ నిర్ణయానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ చేసిందా ?

స. నేను నా బార్యకి నా నిర్ణయాన్ని చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యానికి గురైంది. ఆ తరువాత తను కొద్ది రోజుల్లోనే నన్ను అర్థం చేసుకొని నాకు సపోర్ట్ చేసింది.

ప్రశ్న. ఎటువంటి ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా మీరు హైదరాబాద్లో షూటింగ్ నిర్వహించాగానని అనుకున్నారా ?

స. నిజం చెప్పాలంటే. అవుననిచెప్పాలి. మేము హైదరబాద్లో ప్రతీది తెలుసుకోవలసి వచ్చింది. మాకు పబ్లిక్ డిజైనర్ ఎవరు,ఎక్కడుంటారు, ప్రొడక్షన్ టీంని ఎలా కలుసుకోవాలి అనే విషయాల గురించి మా దగ్గర ఎటువంటి క్లూస్ లేవు. పి.జి. వింధ గారు మాకు సహాయం చేశారు. ఆయన మాతో చేరిన తరువాత ప్రొడక్షన్ మేనేజర్ ని, మిగిలిన వారందరిని పరిచయం చేశాడు. ఆ తరువాత షూటింగ్ ని రెండు రోజుల్లో ప్రారంబించాము.

ప్రశ్న. ఈ సినిమాలో కొన్ని హైలైట్స్ గురించి చెప్పండి?

స. కామెడీ, డైలాగ్స్, కొన్ని ఎమోషినల్ సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. ఎల్.బి.శ్రీరామ్, తాగుబోతు రమేష్, వెన్నెల కిషోర్ లు ఈసినిమా లో ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు.

ప్రశ్న. ఈ సినిమాలో ఏమైనా బూతు సీన్స్ ఉన్నాయా ?
స. లేదు. ఈ సినిమాలో అలాంటివి లేవు. ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికేట్ ను జారిచేశారు. మీరు ఈ సినిమాలోని సీన్స్ ని చూసినప్పుడు కళాసౌందర్యాలను చూసినట్టుగా అనిపిస్తుంది.

ప్రశ్న. మీ భవిషత్తు ప్లాన్స్ ఏమిటి? యుఎస్ తిరిగి వెళ్తారా లేక మరో సినిమాని తీస్తారా?

స. నేను కచ్చితంగా మరో సినిమాని తీస్తాను. నేను ఈ సినిమా ఫలితం గురించి చూస్తున్నాను. తరువాత నిర్ణయించుకుంట ఏం చేయాలనేది. కానీ కచ్చితంగా నేను మరో సినిమా తీస్తాను. ‘చిన్న సినిమా’ విజయాన్ని సాదిస్తే వెంటనే నా తరువాత సినిమా మొదలుపెడతా, ఒకవేళ సినిమా విజయాన్ని సాదించలేకపొతే, నేనుచేసిన తప్పులను సరిచూసుకొని తరువాత మళ్ళీ ఒక మంచి సినిమాని తీస్తాను.

ఇంతటితో ఏకే కంభంపాటి ఇంటర్వ్యూ ముగిసింది. ఈ సినిమా ఎ – సెంటర్స్ లో ప్రేక్షకుల మనసును గెలుచుకుంటుందో చూడాలి. ఈ యంగ్ డైరెక్టర్ కల నిజమవుతుందా, బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా విజయాన్ని సాదిస్తుందా,లేదా అనేది తెలియాలంటే ఈ శుక్రవారం వరకు వేచి వుండాల్సిందే.

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు