ప్రత్యేక ఇంటర్వ్యూ : చంద్రశేఖర్ యేలేటి – ఆడియన్స్ కదలకుండా సాహసం సినిమా చూస్తారు..

ప్రత్యేక ఇంటర్వ్యూ : చంద్రశేఖర్ యేలేటి – ఆడియన్స్ కదలకుండా సాహసం సినిమా చూస్తారు..

Published on Jul 12, 2013 2:46 AM IST

Chandra-shekar

కొన్ని ఆసక్తికరమైన సబ్జెక్ట్స్ తీసుకొని సినిమాలు చేయడంలో చంద్రశేఖర్ యేలేటికి మంచి పేరు ఉంది. చాలా గ్యాప్ తరువాత ఆయన తీసిన ”సాహసం” సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందకు రానుంది. ‘సాహసం’ కూడా యేలేటి స్టైల్ లో చాలా ఆసక్తి కరమైన ఓ సబ్జెక్ట్ ని తెరకెక్కించారు. నిధి కోసం వేటాడే కథని ఆధారంగా ఈ సినిమాని నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనతో మేము కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించడం జరిగింది. ఆ విశేషాలు మీ కోసం…

ప్రశ్న) చాలా గ్యాప్ తరువాత మీరు మీ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మీరు కష్టపడ్డ విషయంలో సంతోషంగా ఉన్నారా?

స) ఈ ప్రోడక్ట్ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ సినిమా బాగా వచ్చింది. మంచి విజయాన్ని సాదిస్తుందని నేను అనుకుంటున్నాను. ‘అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’.

ప్రశ్న) మీరు అసాధారణమైన స్టొరీలను, సినిమాలను చేస్తారు. మీకు మామూలు కథాంశాలు సక్సెస్ అందుకోవడానికి ఆసక్తి చూపరా?

స) (నవ్వుతూ) ‘ నేను చేసేది కూడా మెయిన్ స్ట్రీం అనే అనుకుంటానండి’. ముఖ్యంగా, నేను సినిమా చూసేవారిని రెండున్నర గంటలు ఎంటర్టైనింగ్ అందించాలనుకుంటాను. అది సినిమా కథ మీద, బడ్జెట్ ను ఆదారంగా చేసుకొని తీస్తాను. కొన్ని సినిమాలు మల్టీ ప్లెక్స్ లలో మాత్రమే విజయాన్ని సాదించవచ్చు. ఈ కోవకు చెందినదే ‘ప్రయాణం’ ఆ సినిమాని డిఫరెంట్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి తీశాను. కానీ ‘సాహసం’ సినిమా వీటికి విరుద్దంగా ఉంటుంది. ఒక మంచి మెయిన్ స్ట్రీం కథతో, మెయిన్ స్ట్రీం హీరోతో చేసిన సినిమా. ఆడియన్స్ ఈ సినిమా మొత్తం ఎంటర్ టైన్ అవుతారు. అందరూ ఈ సినిమా కథకి కనెక్ట్ అయ్యి కదలకుండా చూస్తారు.

ప్రశ్న) సాహసం ఎలా మొదలైంది?

స) ఒక రోజు ఓ మాగజైన్ లో చాలా కాలంనాటి ప్రోపర్టీ ఒకటి అమ్ముతున్నారని చూసాను. అలాగే నేను ఒక అడ్వెంచరస్ సినిమా ఒకటి చేయాలనుకుంటున్నా దాంతో ఆర్టికల్ ని ఆధారంగా చేసుకొని ఓ కథని తయారు చేసాను. ఇక్కడ నివసిస్తున్న ఒకతను ఇక్కడి నుంచి పాకిస్థాన్ వెళ్లి తన పాతకాలం ప్రోపర్టీ కోసం పోరాడితే ఎలా ఉంటది? ఈ జర్నీలో చాలా లోటుపాట్లు ఉంటాయి. ఇదే సాహసం సినిమాకి ముఖ్య భూమిక. గోపీచంద్, బివిఎస్ఎన్ ప్రసాద్ నన్ను అడిగినప్పుడు నేను ఈ లైన్ చెప్పాను వాళ్ళకి వెంటనే నచ్చింది.

ప్రశ్న) ఈ సినిమాకి భారీ బడ్జెట్ అవసరం. అలాంటి సదర్భంలో మీరు ఇండస్ట్రీలోని టాప్ ముగ్గురు హీరోలని తీసుకొని ఉంటే కమర్షియల్ గా మీకు బాగా హెల్ప్ అయ్యేది కానీ మీరెందుకు గోపీచంద్ ని ఎంచుకున్నారు?

స) గోపీచంద్ ఒక మాస్ హీరో, అలాగే ఇదివరకే అతనితో కలిసి పనిచేసాను. నేను ఇది వరకే చెప్పినట్టు అతను నన్ను అడిగినప్పుడు నేనీ కథ చెప్పాను, అతనికి నచ్చింది దాంతో ఇద్దరం కలిసి జర్నీ చేసాము.

ప్రశ్న) మీరు కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను లడఖ్ లో షూట్ చేసారు. ఆ అనుభవం ఎలా ఉందో చెప్పండి?

స) ఈ భూ ప్రపంచం మీద ఉన్న అందమైన ప్రదేశాల్లో లడఖ్ కూడా ఒకటి. అక్కడ షూట్ చెయ్యడం చాలా కష్టం. కానీ ఒక్కసారి మీరు ఆ వాతావరణానికి అలవాటు పడితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. ఫైట్ కొరియోగ్రాఫర్ సెల్వ మరియు అతని ఫైటర్స్ టీం ఎంతో కష్టపడి ఆ వాతావరణంలో షూట్ చేసారు. కానీ మొత్తం టీం ఆ షెడ్యూల్ ని ఎంజాయ్ చేసారు. లడఖ్ లో చూపించడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి.

ప్రశ్న) ఈ సినిమాలో తాప్సీ పోషించిన పాత్ర ఏమిటి?

స) తాప్సీ ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రని పోషించింది. హీరో జర్నీ పాకిస్థాన్ కి వెళ్ళడానికి ఆమె కారణం. ఆమె పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమాలో తాప్సీ ప్రస్తుతం సొసైటీ లో ఉన్న మత సంఘర్షణల గురించి ఆందోళన చెందే పాత్ర పోషించింది. ఆమె భక్తి మరియు సొసైటీలో ఉన్న మతాలకు ప్రాముఖ్యం ఇస్తుంది.

ప్రశ్న) తాప్సీని తీసుకోమని మీరే చెప్పారని గోపీచంద్ అన్నారు, దానికి ఏమన్నా ప్రత్యేక కారణం ఉందా?

స) నాకైతే గోపీచంద్ మరియు తాప్సీ ఒకరికి ఒకరు బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చుకున్నారని ఫీల్ అవుతున్నాను. ఆమెకి చాలా ధైర్యం ఉంది. సినిమాలో గుర్రాల చేజ్ లతో ఉన్న సీన్స్ లో, అలాగే మొదలైన యాక్షన్ సీన్స్ లో చాలా ధైర్యంగా ఎంతో బాగా నటించింది.

ప్రశ్న) మేము ఈ సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్ గురించి కాస్త లైట్ గా విన్నాము. వాటి గురించి కాస్త చెబుతారా?

స) ఈ సినిమాలో స్పెషల్ ఎఫెక్ట్స్ చాలా బాగా వచ్చాయి. చివరి అరగంటలో అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ నిధి అన్వేషణలో ఇంకా ఆసక్తి క్రియేట్ చెయ్యడానికి కొంత సిజి టెక్నిక్స్ వాడాము. వాటన్నిటినీ స్క్రీన్ పైన ఆడియన్స్ చూసేటప్పుడు థ్రిల్ ఫీలవుతారు. ఈ సినిమాకి పనిచేసిన సిజి టీంకి, అలాగే విఎఫ్ఎక్స్ చేసిన టీంకి మంచి పేరొస్తుంది.

ప్రశ్న) సినిమా విజువల్ గా చూడటానికి చాలా గ్రాండ్ గా ఉంది. బడ్జెట్ పరంగా ఆ విషయాలను ఎలా మేనేజ్ చేసారు?

స) మీరన్నట్టు ఇలాంటి కొన్ని సినిమాలు చేసినప్పుడు బడ్జెట్ కంట్రోల్ దాటి వెళుతుంటుంది. నేను టీవీ చూస్తుంటాను ముఖ్యంగా నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లాంటివి, అలాగే చాలా చదువుతుంటాను. చాలామంది టెక్నీషియన్స్ కలిసి ప్రతి ఫ్రేం ని చాలా గ్రాండ్ గా రావాలని చాలా కష్టపడతారు.

ప్రశ్న) సినిమాలు కాకుండా, ఇంకా ఎం చెయ్యడానికి మీరు బాగా ఇష్టపడతారు?

స) నాకు నా పిల్లలతో కలిసి ఆడుకోవడం, వారితో కొంతసేపు కలిసి గడపడానికి ఇష్టపడతాను. అలాగే బాగా టీవీ చూస్తాను ముఖ్యంగా నేషనల్ జియోగ్రాఫిక్ చానల్ లాంటివి. అలాగే బాగా పుస్తకాలు చదువుతాను. కానీ హాబీస్ అనేవి కాలానికి తగ్గట్టు మారుతూ ఉంటాయి. మేము ఒక కొత్త సినిమా కోసం రీసర్చ్ స్టార్ట్ చేసినప్పుడు ఇక ఎక్కువ టైం దాని మీదే ఉంటాను.

ప్రశ్న) మీకు డ్రీం ప్రాజెక్ట్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా?

స) నా మైండ్ లో కొన్ని స్క్రిప్ట్స్ ఉన్నాయి. అలాగే కొన్ని కథలని బిగ్ స్క్రీన్ పై చూపించాలి అనుకుంటున్నాను. ప్రస్తుతం పెరుగుతున్న బడ్జెట్, మన సినిమాల పరిధి మారుతోంది కాబట్టి ఎవరో ఒకరు నా సినిమాలు చేస్తారని అనుకుంటున్నాను.

ప్రశ్న) మీరు ఏ హీరోతో అయినా పని చెయ్యాలనుకుంటున్నారా?

స) నాకు పవన్ కళ్యాణ్, మహేష్ బాబులతో పనిచెయ్యాలని ఉంది. వాళ్ళ ఇమేజ్ కి, బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథలనే నేను రాసుకున్నాను.

ప్రశ్న) వాళ్ళతో పని చెయ్యడానికి ఏమన్నా స్టెప్స్ తీసుకున్నారా?

స) ఇప్పుడు ఏమీ చెప్పలేను. ఈ విషయం చాలా వాటి మీద ఆధారపడి ఉంటుంది.. ఉదాహరణకి సక్సెస్..

ప్రశ్న) మీరు భవిష్యత్తులో చేయనున్న సినిమాలు ఏమిటి?

స) ప్రస్తుతానికి కొన్ని కమిట్ మెంట్స్ ఉన్నాయి. కావున రెండు – మూడు స్టొరీలపై పనిచేస్తున్నాను. నా తదుపరి సినిమా చాలా వేగంగా అయిపోతుందని భావిస్తున్నాను.

ప్రశ్న) మా పాఠకులకు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?

స) ‘సాహసం’ సినిమా మీ మేధస్సుకి పని పెట్టే లేదా ఇంటెలిజెంట్ సినిమా కాదు. ఇది పక్కా ఎంటర్టైనర్. నా టచ్ ఉంటూ సాగే టిపికల్ గోపీచంద్ సినిమా అనుకోండి. చాలా ఓపెన్ మైండ్ తో ఈ సినిమా చూడండి మీరు బాగా ఎంజాయ్ చేస్తారు.

అంతటితో చంద్రశేఖర్ యేలేటి గారితో మా ఇంటర్వ్యూని ముగించి, ‘సాహసం’ హిట్ అవ్వాలని ఆయనకి అల్ ది బెస్ట్ చెప్పాము. చంద్రశేఖర్ యేలేటి గారు చాలా సాఫ్ట్ గా మాట్లాడే వక్తి అలాగే మంచి స్వభావం ఉన్న జెంటిల్ మెన్. ఈ ఇంటర్వ్యూ మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాము.

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు