చిట్ చాట్ : వివి వినాయక్ – అదుర్స్ 2 పై ఎన్.టి.ఆర్ ఆసక్తి చూపుతున్నాడు

చిట్ చాట్ : వివి వినాయక్ – అదుర్స్ 2 పై ఎన్.టి.ఆర్ ఆసక్తి చూపుతున్నాడు

Published on Oct 8, 2013 2:01 PM IST

VV-Vinayak

టాలీవుడ్ లో మాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వివి వినాయక్ రేపు తన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన కొద్ది మంది మీడియా మిత్రులతో ముచ్చటించారు. ఈ చిట్ చాట్ లో కోన్ని విశేషాలను తెలియజేశారు.. ఆ విశేషాలు మీకోసం…

ప్రశ్న) ‘నాయక్’ సినిమా తర్వాత ఎందుకని ఇంత లాంగ్ గ్యాప్ తీసుకున్నారు?

స) నేను నా తదుపరి సినిమాతో బెల్లంకొండ సురేష్ కుమారుడు సాయిని హీరోగా పరిచయం చేయనున్నాను. గత కొద్ది రోజులుగా స్క్రిప్ట్ కోసం పని చేస్తున్నాను. అది అతనికి తొలి సినిమా కావడంతో చాలా జాగ్రత్తలు తీసుకొంటున్నాం. ‘లేట్ అయినా పర్లేదు మంచి సినిమా తీయాలి’. నాకు ‘ఆది’ సినిమాతో బెల్లంకొండ గారు లైఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన కొడుకుని పర్ఫెక్ట్ గా లాంచ్ చెయ్యాల్సిన పెద్ద భాద్యత నాపై ఉంది.

ప్రశ్న) సినిమా ఎప్పుడు మొదలవుతుంది?

స) షూటింగ్ ఈ నెల 20 నుంచి మొదలవుతుంది. సమంత హీరోయిన్ గా నటించే ఈ సినిమాకి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తాడు. మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తాను.

ప్రశ్న) మీరు రాబోయే ఎలక్షన్స్ లో పాల్గొంటున్నారా?

స) ఇప్పటివరకూ ఎలాంటి ప్లాన్ లేదు. మా ఫ్యామిలీకి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంది, అలాగే నాకు ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న కొంతమంది నాయకులతో నాకు మంచి పరిచయాలు ఉన్నాయి. అందువల్లే ఈ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇంతకంటే భవిష్యత్తు గురించి ఏమీ చెప్పలేను.

ప్రశ్న) మీకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం?

స) నేను పర్సనల్ గా యాక్షన్ ఫిల్మ్స్ చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తాను. అలాంటి సినిమాలు తీయడంలో కూడా బాగా ఎంజాయ్ చేస్తాను. అలాగే మణిరత్నం సినిమాలు అన్నా కూడా ఇష్టం.

ప్రశ్న) మీకు మీరు చేసిన ఏదన్నా సినిమాకి సీక్వెల్ తియ్యాలన్న ఆలోచన ఉందా?

స) ఎన్.టి.ఆర్ ఎప్పుడు నాతో అదుర్స్ 2 చెయ్యమని అడుగుతూ ఉంటాడు. మేము ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నాం. త్వరలోనే దానిపై నిర్ణయం తీసుకుంటాం.

ప్రశ్న) చిరంజీవి గారి 150వ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు?

స) ప్రస్తుతానికైతే చిరంజీవి గారు సినిమాల్లో నటించే ఆలోచనలో లేరు. ఒకవేళ ఆయన నటించడానికి సిద్దమయితే ఆ అవకాశం నేను తీసుకోవడానికి సిద్దంగా ఉన్నాను.

ప్రశ్న) మీతోటి దర్శకులతో పోల్చుకుంటే మీరు ఎందుకని పెద్దగా ప్రయోగాత్మక సినిమాలు చెయ్యడం లేదు..

స) నిజంగా చెప్పాలంటే నాకు ప్రయోగాలంటే భయం. నేను తీస్తున్న సినిమాపై బడ్జెట్ పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. ఒకవేళ నేను ఏదన్నా కొత్తగా చేద్దాం అని మొదలు పెట్టినా షూటింగ్ మొదలయ్యేటప్పటికి సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయి కాస్త రొటీన్ ఫార్మాట్ సినిమాలా అయిపోతుంది.

ప్రశ్న) మీ భవిషత్తు ప్లాన్స్ ఏంటి?

స) బెల్లంకొండ సాయి సినిమా పూర్తి చేసిన తర్వాత కొత్త వాళ్ళతో వచ్చే సంవత్సరంలో ఓ సినిమా ఉంటుంది.

అంతటితో వివి వినాయక్ గారితో మీడియా మిత్రులు చిట్ చాట్ ముగించారు. ఆల్ ది బెస్ట్ సార్..

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు