ఈ మధ్య కాలం లో వరుసగా రెండు విజయాలతో ఆనందంగా ఉన్న దర్శకుడు వీరభద్రమ్ . గతం లో “అః నా పెళ్ళంట” చిత్రం తో విజయం అందుకున్న ఈ దర్శకుడు మల్లి “పూల రంగడు” చిత్రం తో మరో విజయాన్ని తన ఖాతా లో వేసుకున్నారు. ఈ దర్శకుడితో మేము జరిపిన ఇంటర్వ్యూ మీకోసం
ప్ర : వరుసగా రెండు విజయాలను అందుకున్నారు మీకు మా శుభాకాంక్షలు. ఇలా వెంటవెంటనే విజయం అందుకోవటం ఎలా అనిపిస్తుంది?
స: (నవ్వుతు) కృతజ్ఞతలు. “పూల రంగడు” ఇంత విజయం సాదించటం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది మా బృందం కష్టానికి వచ్చిన ఫలితం. ఇలా వెంటవెంటనే విజయాలు రావటం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి మరిన్ని చిత్రాలను చేస్తానని నమ్మకముంది. నన్ను ప్రతి చోట గుర్తు పడుతున్నారు అది చాలా ఆనందం కలిగించే విషయం.
ప్ర : ఈ చిత్ర విజయానికి ముఖ్యమయిన కారణం ఏదని మీరు అనుకుంటున్నారు?
స: చాలా కారణాలు ఉన్నాయి చిత్రం లో ఉన్న అలరించే విషయాలు ఈ చిత్రం విజయానికి ప్రధాన కారణం. తెలుగు ప్రాంతీయత కావలిసినంత ఉంది ఈ విషయం లో నేను చాలా జాగ్రత్త తీసుకున్నాను. విదేశాల నుండి చాలా మంది మిత్రులు నాకు ఫోన్ చేసి అభినందించారు.
ప్ర : మీకు వచ్చిన అభినందనలలో ఏది ఉత్తమం అని అనుకుంటున్నారు ?
స: అందరు నన్ని అభినందించారు జెమిని కిరణ్ మరియు ఆర్.ఆర్. వెంకట్ వంటి పరిశ్రమ పెద్దలు పర్సనల్ గా అభినందించటం చాల ఆనందం కలిగించింది ఈ చిత్రం జనం కి నచ్చటం వారి మనసుని గుర్తించటం గురించి అందరు నన్ని అభినందించారు.
ప్ర : మీరు జనం మనసు బాగా తెలుసుకున్నట్టునారు ఇది ఎలా చేశారు?
స: నాకు ఖాళి సమయం ఉన్నప్పుడు నేను షాపింగ్ మాల్స్ కేఫ్ లు మరియు రైల్వే స్టేషన్ ల కి వెళ్ళేవాడిని అక్కడి జనం ఎలా ప్రవర్తించేవారో గమనించేవాడిని నా చిత్రాల్లో అవి కనపడేలా జాగ్రత్తలు తీసుకునేవాడిని.
ప్ర : భవిష్యతు లో మేము మీ నుండి ఏం ఎదురుచుదవచ్చు?
స: నా తరువాతి చిత్రం పూర్తి యాక్షన్ చిత్రం. ఈ చిత్రానికి “భాయ్” అనే పేరుని అనుకుంటున్నాను ఈ చిత్రం క పెద్ద కథానాయకుడు మరియు పెద్ద నిర్మాత తో ఉండబోతుంది. త్వరలో అన్ని విశేషాలు వెల్లడిస్తాను ఈ చిత్రం నాకు వరుసగా మూడో విజయాన్ని అందిస్తుందని నాకు నమ్మకం ఉంది.
ప్ర : “భాయ్” చిత్రం మీద చాల నమ్మకం పెట్టుకున్నాటు ఉన్నారు ఏదయినా ప్రత్యేక కారణం ఉందా?
స: (నవ్వుతు). అవును నాకు నా కథ మీద చాలా నమ్మకముంది నేను నా పని పూర్తయిన తరువాతే నిర్మాతని అయిన కథనయకుదినయిన కలుస్తాను ఎప్పుడయితే మీరు మీ కథని పూర్తిగా నముతారో అప్పుడు మీకు విజయం దక్కినట్టే.
ప్ర : సునీల్ కి పెద్ద విజయం ఇచ్చారు కదా అయన ఏమంటున్నారు?
స:అయన చాలా ఆనందంగా ఉన్నారు “నీ మీద నేను ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నావ్” అని చెప్పారు. ఇంకా సునీల్ కామెడి హీరో కాదు యాక్షన్ హీరో ఇషా చావ్లా కూడా చాలా ఆనందంగా ఉంది ఈ చిత్రం తన సినీ జీవితానికి ఎంతో ఉపయోగపడుతుంది.
ప్ర : ఈ చిత్రం నిర్మాతలకు లాభం చేకూర్చింది వారేమంటున్నారు?
స: వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు ఈ చిత్రం మొదలయినపుడే నేను చెప్పను మీకు తప్పకుండ విజయం అందిస్తాను అని వాళ్ళు కూడా ఇంత పెద్ద విజయం సాదిస్తుందని అనుకోలేదు. నేను మా గుర్వుగారు ఈ.వి.వి సత్యనారాయణ గారి సిద్ధాంతం ” నిర్మాత కి లాభం తెచ్చినపుడే మంచి దర్శకుదవుతాడు” అనే సిద్దాంతాన్ని నమ్ముతాను మరియు ఆచరిస్తాను.
ప్ర : ప్రేక్షకులకు ఏమయినా చెప్పాలని అనుకుంటున్నారా?
స:ఈ చిత్రానికి ఇంత భారి విజయం అందించినందుకు ప్రేక్షకులకు నా కృతజ్ఞతలు. భవిష్యత్తు లో కూడా ఇలానే ప్రేక్షకులను అలరిస్తాను.
దానితో ఇంటర్వ్యూ ముగిసింది. వీరభద్రమ్ తరువాతి చిత్రం “భాయ్” విజయం సాదించాలని కోరుకుందాం.
అనువాదం : రv