రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కుమార్ ఈ శుక్రవారం “ఊ కొడతారా ఉలిక్కి పడతారా” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ ఎనర్జిటిక్ యాక్టర్ 123తెలుగు.కాంతో ప్రత్యేకంగా మాట్లాడారు. తన ఆఫీస్ లోనే మేము మనోజ్ ని కలిశాం పలు విషయాల గురించి మాట్లాడాం.ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం గురించే కాకుండా, చిత్రసీమలో తన స్నేహితుల దగ్గర నుండి, అభిమానుల మధ్య కుల విభేదాల వరకు ఎంతో చక్కగా మనోజ్ మాట్లాడారు. ఆ సంభాషణ మీ కోసం.
ప్ర) ఊ కొడతారా ఉలిక్కి పడతారా భారీ అంచనాల నడుమ విడుదల కానుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
జ)నేను నా ఫీలింగ్స్ చెప్పలేను. దీనిని మీరు ఉత్కంఠ అని చెప్పవచ్చు. కాని ఈ చిత్రం విజయం సాదిస్తుంది అని నాకు చాలా నమ్మకం ఉంది. రెండు సంవత్సరాలుగా ఈ చిత్రానికి నన్ను నేను అంకితం చేసుకున్నా. ఈ చిత్రం కోసం నా పర్సనల్ లైఫ్ ని కూడా వెచ్చించా. ప్రస్తుతం పని మొత్తం పూర్తయ్యింది. అకస్మాతుగా ఏ పని లేకపోవటంతో ఖాళీగా అనిపిస్తుంది.
ప్ర) ఈ చిత్రం కోసం శారీరకంగా మరియు మానసికంగా చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం మీద ఇంతలా శ్రమ వెచ్చించడానికి ప్రేరేపించిన అంశాలు ఏవి?
జ) ఈ చిత్ర కథ. నేనెప్పుడు కొత్త కథలను చేసి తెలుగు ప్రజలను ఆకట్టుకోవాలనే అనుకున్నాను. ఈ చిత్ర కథ చాలా బాగుంది. ఈ చిత్రం డార్క్ కామెడికి చెందినది ఇటువంటి విధమయిన చిత్రాన్ని గతంలో తెలుగులో ఎవరు ప్రయత్నించలేదు. ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది.
ప్ర) కామెడి! ఇది నిజంగా ఆశ్చర్యకరమయిన విషయం మొదటి నుండి ఈ చిత్రాన్ని థ్రిల్లర్ గా చెబుతూ వచ్చారు!
జ) ఈ చిత్రంలో మంచి హాస్యం ఉంటుంది. ట్రైలర్లో కావాలనే ఈ విషయాన్నీ ప్రస్తావించలేదు. ఎందుకంటే ప్రేక్షకుడికి ఒక ఆశ్చర్యకరమయిన అనుభూతి ఇద్దామని
అనుకున్నాం. ఈ చిత్రంలో మీరు అన్నట్టు ఉత్కంఠభరితమయిన మరియు థ్రిల్లింగ్ సన్నివేశాలతో పాటు కామెడి సన్నివేశాలు కూడా ఉన్నాయి.
ప్ర) ఎప్పుడు కొత్త రకమయిన చిత్రాలను ప్రయత్నిస్తుంటారు కమర్షియల్ మాస్ హీరోగా పేరు తెచ్చుకోవాలని ఎప్పుడు అనిపించలేదా?
జ ) కమర్షియల్ హీరో అంటే ఏమిటి చెప్పండి (అని నవ్వేశారు) నాకు మీరేం అడుగుతున్నరో అర్ధం అయ్యింది. కాని అలాంటి చిత్రాలు చెయ్యడానికి చాలా సమయం ఉంది ఇప్పుడు పోతే ఇలాంటి చిత్రాలను మళ్ళీ చెయ్యలేము. నాకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలి “మోహన్ బాబు గారి అబ్బాయి కాబట్టి వచ్చేశాడు రా” అనిపించుకోడం నాకు ఇష్టం లేదు. నేను కొత్త వారితో చెయ్యటానికి ఇదే కారణం ఒక్కసారి నాకు భారీ విజయం దక్కితే మరింత చేస్తాను చూస్తూ ఉండండి.
ప్ర ) యాక్షన్ సన్నివేశాలు చేసేప్పుడు మీరు చాలా రిస్క్ తీసుకొని చేసేవారు. అంత రిస్క్ తీసుకొని చేస్తారు థ్రిల్ కోసమా లేకపోతే నిజంగా చేశాను అన్న తృప్తి కోసమా?
జ) నిజాయితిగా సన్నివేశాన్ని చేసానన్న తృప్తి కోసం. ఈ వాక్యం ఇచ్చినందుకు థాంక్స్ ఇంకెవరయిన ఈ ప్రశ్న అడిగితే ఇదే జవాబు ఇస్తాను. నేను ఏం చెయ్యగలను అని చూపించుకోడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. నేను జాకీ చాన్ కి వీరాభిమానిని అయన స్టంట్స్ అలా చూస్తుండటం వలన వాటి ప్రభావం నా మీద పడింది. దానితో పాటు బడ్జట్ ని తక్కువగా ఉంచడానికి ప్రయత్నిస్తుంటా విష్ణు అన్న ఇచ్చిన శిక్షణ చాలా సహాయపడింది.
ప్ర) బాలయ్య కాకపోయి ఉంటే ఆ పాత్రలో ఎవరిని తీసుకునేవారు?
జ) మొదటి రోజు నుండి ఆ పాత్రను బాలకృష్ణ గారినే అనుకున్నాం ఆయన ఒప్పుకోడం మా అదృష్టం ఒకవేళ బాలయ్య ఒప్పుకోలేదంటే ఈ పాత్రలో నాన్నగారిని నటింపచేసేవాళ్ళం.
ప్ర) పరిశ్రమలో చాలా మందికి మరియు బయట వ్యక్తులకు కూడా ఈ చిత్రాన్ని చూపించారు వారి స్పందన ఎలా ఉంది?
జ) డిస్ట్రిబ్యుటర్స్ నుండి వచ్చిన స్పందన ఉత్తమం . కొంతమంది పెద్ద డిస్ట్రి బ్యుటర్స్ ఈ చిత్రం చూసి ఆనందాన్ని వ్యక్త పరిచారు. చిత్ర థియేటర్ల సంఖ్యను పెంచాలని కూడా అనుకుంటున్నారు. ఈ చిత్రం నా కెరీర్లో ఉత్తమ చిత్రం అవ్వనుందని భావిస్తున్నాం.
ప్ర) మీ కెరీర్ ఎంపిక మీద మోహన్ బాబు గారు ఏమంటున్నారు? అయన సంతోషంగా ఉన్నారా?
జ) (బిగ్గరగా నవ్వుతూ) మేము కూడా కొన్ని డిస్కషన్స్ చేస్తుంటాము. నా నటన గురించి మరియు నా కష్టం గురించి అయన చాలా ఆనందంగా ఉన్నారు. ఆయనకి నేను పెద్ద దర్శకులతో మరియు మంచి స్టూడియోస్ తో చెయ్యాలని అనుకుంటున్నారు. నేను అది నా స్వంతంగా బ్లాక్ బస్టర్ సాధించిన తరువాత చెయ్యాలని అనుకుంటున్నాను.
ప్ర)బాలకృష్ణ గారితో పని చెయ్యటం మీకు ఎలా అనిపించింది?
జ) నా అదృష్టం అనిపించింది. అయన గురించి చాలా మందికి తప్పుడు అభిప్రాయం ఉంది. అయన చాలా మంచి వ్యక్తి మరియు కో ఆపరేటివ్ గా ఉంటారు. ఉదాహరణకు నేను దర్శకత్వం వహించిన యాక్షన్ సన్నివేశాలలో కొన్ని సరిగ్గా రాలేదు అనిపించింది కాని బాలయ్య బాబు సీనియర్ యాక్టర్ అవ్వడం మూలాన రీ షూట్ కి అడగటం చాలా ఇబ్బంది అనిపించింది. కాని బాలయ్య ఆ విషయాన్నీ గమనించి ఆ సన్నివేశాన్ని నాకు సంతృప్తి కలిగేలా వచ్చేంత వరకు చేశారు.
ప్ర) శేఖర్ రాజా దర్శకుడిగా విజయవంతం అయ్యారని అనుకుంటున్నారా?
జ) ఖచ్చితంగా! అయన తనవంతు న్యాయం చేశారు కథకు. శేఖర్ రాజా కాకుండా దర్శకత్వ శాఖ మరియు ఆర్ట్ డిపార్టుమెంటు వారు ఈ చిత్రం లో కీలక పాత్రలు పోషించారు. సినిమాటోగ్రాఫర్ రాజశేఖర్ అద్భుతమయిన పనితనం కనబరిచారు.
ప్ర) మీరు పరిశ్రమలో మంచి స్నేహితుడిగా చెప్పుకుంటారు పరిశ్రమలో మీకు మంచి స్నేహితుడు ఎవరు?
జ) నాకు ఎవరయినా నచ్చితే వారిని చివరి వరకు అభిమానిస్తాను. నేను వారి నుండి ఏదీ ఆశించను. నాకు దగ్గరగా అనిపించే స్నేహితులు మాత్రం శింభు, జూ ఎన్టీఆర్, సునీల్.
ప్ర) జూనియర్ ఎన్టీఆర్ లేక మిగిలిన స్నేహితులతో మల్టీస్టారర్ చిత్రం చేసే అవకాశాలు ఏమయినా ఉన్నాయా?
జ) కథ. మంచి కథ ఉంటె మేము మల్టీ స్టారర్ చిత్రం చెయ్యడానికి ఎప్పుడు సిద్దమే. ఇప్పుడు అభిమానులు కులాలతో వేరు చేసి చిత్రాలను చూస్తున్నారు ఇది చాలా బాధాకరమయిన విషయం. ఇలానే కులాల మధ్య నడుస్తే తెలుగు పరిశ్రమ ముందుకి వెళ్ళడం కష్టం. ఒక కులం హీరో చిత్రం విడుదలవుతుంది అంటే మరొక కులం హీరో అభిమానులు చిత్రం గురించి ప్రతికూల విమర్శలు చేస్తారు. ఇది మంచి పని కాదు చిత్రాలు తెలుగు కి గర్వకారణం కులానికి కాదు. ఇలా కులాల గురించి కొట్టుకోవడం ఆపేసి హాలీవుడ్ మరియు బాలీవుడ్ లతో పోటి పడితే మన చిత్రాలకు ఆకాశమే హద్దవుతుంది. అభిమానులు కులాల గోడలు దాటుకొని రాకపోతే తెలుగు పరిశ్రమ ఎదగదు.
ప్ర) బాగా చెప్పారు! హీరోల మీద అభిమానుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఈ విషయాన్నీ వాళ్ళు ట్వీట్లలో ఎందుకు చెప్పారు?
జ) నాకు మిగిలిన వారి గురించి తెలియదు కాని వారి సమస్యలు వారికి ఉంటాయి. నేను నా అభిమానులకు ఈ విషయాన్నీ ఎప్పుడు చెబుతూ వస్తుంటాను. యువ హీరోలలో ఒక్కరు కూడా కులం గురించి పట్టించుకోరు. మేము మంచి స్నేహితులం ఈ విషయాన్నీ అభిమానులు గమనించాలి.
ప్ర) ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం తరువాత ఏ చిత్రం చెయ్యనున్నారు?
జ) ఈ చిత్రం తరువాత నేను రెండు నెలల పాటు విరామం తీసుకోనున్నాను, పని ఒత్తిడిలో కుటుంబాన్ని మరియు స్నేహితులని పట్టించుకోలేదు. వారితో గడపాలి. దానితో పాటు పైరసీ మీద పరిశ్రమ ప్రకటించిన యుద్దాన్ని మరింత ఉదృతం చేస్తాను.
ప్ర ) ఉదృతం? ఏం చెయ్యాలని అనుకుంటున్నారు?
జ) పైరసీ మీద మరియు అది చేసేవారి మీద నేను యుద్ధం చేస్తాను. ఎవరో ఒకరు ఈ సమస్యని పూర్తిగా అరికట్టాలి రాజమౌళి గారు ఈ పని మొదలుపెట్టారు నేను కూడా ఈ సమస్యను పూర్తిగా అరికట్టడానికి ప్రయత్నిస్తాను.
ప్ర) అరి మరియు వివిలతో బాగా ఆడుకుంటూన్నారా ఇద్దరిలో ఎవరు ఎక్కువ అల్లరి చేస్తారు?
జ) ఇద్దరు అంటే నాకు చాలా ఇష్టం వారితో ఆడుకుంటూ ఉంటాను.అరి కాస్త అల్లరి చేస్తుంటుంది ఇద్దరితో నేను బాగా కలిసిపోయాను.
ప్ర) పెళ్ళెప్పుడు చేసుకోబోతున్నారు?
జ) (బిగ్గరగా నవ్వుతూ) “మనకి ఎందుకండి ఆ ప్రశ్నలు. పెద్దవాళ్ళు చూసుకుంటారు” నా మూలాన నా యూనిట్ మొత్తం గత రెండు సంవత్సరాల నుండి అందరికి దూరంగా ఉంటున్నారు. నేను కూడా సోషల్ లైఫ్ కి దూరంగా ఉండాలి అనుకున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడిప్పుడే సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో యాక్టివ్ గా ఉంటున్నా.
__
మహేష్
అనువాదం రవి