ఇంటర్వ్యూ : స్టైలిస్ట్ నీరజ కోన – టాలీవుడ్ ఫ్యాషన్ వైపు మరింత మొగ్గుచూపుతోంది.

ఇంటర్వ్యూ : స్టైలిస్ట్ నీరజ కోన – టాలీవుడ్ ఫ్యాషన్ వైపు మరింత మొగ్గుచూపుతోంది.

Published on Sep 27, 2013 2:00 AM IST

Neeraja-and-samantha
ఒక సంవత్సరం క్రితం నుంచి నీరజ కోన స్టైలిస్ట్ గా తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరచుకుంది. పాపులర్ రైటర్ కోన వెంకట్ సిస్టర్ గా కెరీర్ ప్రారంభించినప్పటికీ ప్రస్తుతం తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాలో నితిన్ కి స్టైలిస్ట్ గా పనిచేసిన తర్వాత ‘రామయ్యా వస్తావయ్యా’, ‘అత్తారింటికి దారేది’, ‘ఎవడు’, ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ సినిమాలకు స్టైలిస్ట్ గా పనిచేసింది. అమెరికాలో చాలా సంవత్సరాలు ఫ్యాషన్ ఇండస్ట్రీలో పనిచేసిన నీరజ కోన హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యింది. ఈ యంగ్ లేడీ తన కెరీర్ గురించి మరియు సినిమాల్లో స్టైలిస్ట్ పాత్ర ఏంటనేది? లాంటి విషయాలను మాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం…

ప్రశ్న) యుఎస్ నుండి టాలీవుడ్ లో స్టైలిస్ట్ గా మీ కెరీర్ మారింది. ఈ ఊహించని మార్పు ఎలా జరిగింది?

స) అది మా బ్రదర్ కోన వెంకట్ వల్ల జరిగింది. నేను చదివింది ఫ్యాషన్, అలాగే 14 సంవత్సరాలు యుఎస్ లో ఉన్నాను. నేను ఫ్యాషన్ ఇండస్ట్రీలో మార్కెటింగ్ మరియు ఫ్యాషన్ డిపార్ట్ మెంట్ కి కావాల్సిన వస్తువుల గురించి చూసుకునేదాన్ని. బ్రదర్ కోన వెంకట్ కొంతమందికి పరిచయం చేసి నన్ను ప్రోత్సహించారు. అది నా లైఫ్ లో జరిగిన చాలా పెద్ద మార్పు ఇక్కడ కూడా నేను ఫ్యాషన్ ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నాను. ఆ తర్వాత నేను హరీష్ శంకర్, నితిన్, సమంత లాంటి వారిని చాలా త్వరగా కలుసుకోగలిగాను. వారి ఇచ్చిన అవకాశాన్ని నిరూపించుకోవడం వల్ల నాకు బాగా హెల్ప్ అయ్యింది.

ప్రశ్న) టాలీవుడ్ గురించి ఒక్కొక్కరూ ఒక్కోలా తమ అభిప్రాయాలను చెబుతుంటారు. అవి నిజమేనా? ఆ విషయంలో మీ అనుభవం ఏమిటి?

స) మీరు అన్నది నిజమే.. టాలీవుడ్ గురించి ప్రతి ఒక్కరికి తమ సొంత అభిప్రాయాలు ఉండవచ్చు. అదే మీరొక అమ్మాయి అయ్యి, నేను టాలీవుడ్ లోకి వెళ్తున్నాను అంటే చాలా మంది వార్నింగ్ ఇస్తారు. కానీ మీరు మీకు కావాల్సినదేమిటి, మీ జాబ్ కి మీరు పరిమితమై ఉంటే మీరు హ్యాపీ గా ఉండవచ్చు. నేను ఇండస్ట్రీలో చాలా మంచి టైం గడుపుతున్నానని చెప్పాలి.

ప్రశ్న) చాలా తక్కువ మంది స్టైలిస్ట్ లకి ఇండస్ట్రీలో గుర్తింపు వచ్చింది. ఆ విషయంలో మీ లక్కీ అని చెప్పుకోవాలి…

ప్రశ్న) (నవ్వుతూ).. నా కెరీర్ మొదట్లోనే కొంతమంది గ్రేట్ పర్సన్స్ ని కలవడం చాలా అదృష్టం అని చెప్పాలి, ఆ విషయంలో నేను చాలా లక్కీ.. వాళ్ళు నన్ను చాలా బాగా గైడ్ చేసారు. నేను కెరీర్ మొదట్లో కొన్ని తప్పులు చేసాను, కానీ వాళ్ళు నాకు హెల్ప్ చెయ్యడంతో ఎంతో నేర్చుకున్నాను. ఆ విషయంలో నేను కొంతమంది మంచి ఫ్రెండ్స్ ని సంపాదించుకోగలిగాను అని చెప్పడం సంతోషంగా ఉంది.

ప్రశ్న) మీరు చెప్పిన విషయం వినడానికి బాగుంది. మీరు మీ ప్రయత్నాలు చేసేటప్పుడు ఎవరు మిమ్మల్ని సపోర్ట్ చేసారు?

స) మొదటగా మా బ్రదర్ కి థాంక్స్ చెప్పాలి. ముందుగా నా స్ఫూర్తి నిచ్చింది, సపోర్ట్ చేసింది. ఆయనే.. ఆ తర్వాత నితిన్, సమంత, హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి, థమన్ లకి థాంక్స్ చెప్పాలి. నా రియల్ లైఫ్ లో వాళ్ళు మంచి ఫ్రెండ్స్.

ప్రశ్న) మీ పరంగా ఇండస్ట్రీలో స్టైలిస్ట్ లకి ఫ్రీడం ఉందంటారా? లేక డైరెక్టర్/ హీరోల విజన్ కి కట్టుబడి ఉండాలా?

స) ముందుగా డైరెక్టర్ ఓ విజన్ ఇస్తాడు. వాళ్ళు ముందుగా వారి పాత్ర ఏమిటి, ఆ పాత్రలో ఉన్న ఫీల్ ఏమిటి? పాత్ర బిహేవియర్ ఎలా ఉంటుంది? అనేది చెప్తారు. మూడు అది విని ఆ తర్వాత నీ ఐడియాలతో రావాలి. ఆ తర్వాత నటీనటులతో డిస్కస్ చేసి, ఆ తర్వాత నేనేమి చెయ్యాలనుకుంటున్నానో చెప్పాలి. ఇవన్నీ జరిగిన తర్వాత ఫ్రీడం వస్తుంది అప్పుడు ఎలాంటి కలర్స్ తీసుకోవాలి, ఎలాంటి మెటీరియల్ వాడాలి అనేది చూసుకుంటాం. డైరెక్టర్ యొక్క విజన్ ని అర్థం చేసుకొని ఆయన్ని సంతృప్తిపరచడమే మాకొక పెద్ద భాద్యత.

ప్రశ్న) మీ స్టైలిస్ట్ లకి కూడా బడ్జెట్ లిమిట్స్ ఉంటాయా?

స) మరోసారి ఈ విషయంలో నేను అదృష్టవంతురాలిని అని చెప్పాలి. ఇప్పటి వరకూ నేను పెద్ద పెద్ద ప్రొడక్షన్ సంస్థలతో మరియు టాప్ నటీనటులతో పనిచేసాను. కావున వల్లెప్పుడు నాకు లిమిట్స్ పెట్టలేదు. నేను కరెక్ట్ గా లుక్ వచ్చిందా లేదా అనేది మాత్రమే చూసుకున్నాను.
neeraja
ప్రశ్న) మీకు అపరిమితమైన బడ్జెట్ ఇస్తే మీరు ఎక్కడ షాపింగ్ చేస్తారు?

స) (అలా కాసేపు ఆలోచించి).. ఎక్కువభాగం లండన్ లో చేస్తాను. నేను నా స్టార్స్ కి హై స్ట్రీట్ ఫ్యాషన్స్ లో చూడటానికి బాగా ఇష్టపడతాను.

ప్రశ్న) మీరు ఇప్పటి వరకూ చేసిన వాటిల్లో ప్రొఫెషనల్ గా బాగా సంతృప్తినిచ్చిన సినిమా ఏది?

స) ఆ విషయం నేను కరెక్ట్ గా పిన్ పాయింట్ చేసి చెప్పలేను. ఇది నా కెరీర్ ప్రారంభం కావున నేను ప్రతి స్టెప్ నాకు చాలా ముఖ్యం. ప్రతి సినిమా నాకు హెల్ప్ అవుతుంది. ‘గుండెజారి గల్లంతయ్యిందే’ నా కెరీర్ కి బూస్ట్ ఇచ్చింది. ‘రామయ్యా వస్తావయ్యా’ కొత్త విషయాలను అర్థం చేసుకునేలా చేసింది. ‘అత్తారింటికి దారేది’ ఫుల్ ఫన్.

ప్రశ్న) మీరు ఇప్పటి వరకు పనిచేసిన దర్శకుల్లో మోస్ట్ డిమాండింగ్ డైరెక్టర్?

స) హరీష్ శంకర్ మోస్ట్ డిమాండింగ్ డైరెక్టర్. అతని తన టెక్నీషియన్స్ దగ్గర నుంచి ఏమి కావాలనేది పర్ఫెక్ట్ గా తెలుసు. అతని లాగే త్రివిక్రమ్ కూడా, ఆయనతో పనిచేసేటప్పుడు పూర్తి ఫన్ ఉంటుంది.

ప్రశ్న) అదే నటీనటుల గురించి అయితే?

స) సమంత అన్ని బౌండరీలను బ్రేక్ చేసేసింది. నన్ను పూర్తిగా నమ్మడమే కాకుండా నాకు పూర్తి ఫ్రీడం ఇచ్చింది. తనకి ప్రయోగాలు చేయడం అంటే ఇష్టం. నితిన్, సమంతలు నాకు నటీనటుల కన్నా ముందు మంచి ఫ్రెండ్స్. నితిన్ నాకు మొదట బిగ్ బ్రేక్ ఇచ్చాడు, అలాగే నాకు ఎంతో కంఫర్ట్ జోన్ ఇచ్చాడు. అది మీకు లబిస్తే మీరు చాలా బెస్ట్ పనితనాన్ని కనబరచగలరు. రామయ్యా వస్తావయ్యా లో తారక్ లుక్ మరియు ఎవడు సినిమాలో అల్లు అర్జున్ లుక్ కోసం నేను పనిచేసాను. అలాగే ఎవడు లో కాజల్ లుక్ కోసం మరియు కొరియర్ బాయ్ కళ్యాణ్ లో యామి గౌతం లుక్ కోసం కూడా పనిచేసాను.

ప్రశ్న) స్టైలిస్ట్ అనే జాబ్ కష్టమైనదా?

స) అవును.! మీరు చేసిన దానిని చాలా సార్లు చేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు కాస్ట్యూమ్స్ పర్ఫెక్ట్ గా ఉంటాయి కాని లైటింగ్ ఎఫెక్ట్స్ వల్ల సమస్య రావచ్చు. దానివల్ల సీన్ సడన్ గా మారిపోతుంది.. అక్కడికక్కడే స్పాట్ లో ఆ సందర్భానికి తగ్గట్టు మార్చగలిగే క్రియేటివ్ మైండ్ ఉండాలి.

ప్రశ్న) మీరు ఇప్పటివరకు టాలీవుడ్ లో ఒక సంవత్సరం పనిచేసారు. ఏమన్నా సమస్యలున్నాయా?

స) (నవ్వుతూ) లేదండి. నేను చాలా హ్యాపీ గా ఉన్నాను, ఎలాంటి సమస్యలు లేవు. నేను చాలా మంది కెరీర్ ని ఏర్పరుచుకుంటున్నాను, నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. ఇక్కడ మీరు మనీ సంపాదించుకోగలరు మరియు గుర్తింపు కూడా తెచ్చుకోగలరు. అన్నిటికంటే మించి మీకు ఏదన్నా పని చేయాలనే తపన ఉంటే ఇక్కడ ఆ చాన్స్ ఉంది.

ప్రశ్న) టాలీవుడ్ లో బాగా డ్రెస్ అయ్యే నటుడు మరియు నటి ఎవరు? అలాగే మీరు స్టైలిస్ట్ గా పనిచేయ్యాలనుకునే డ్రీం క్లైంట్ ఎవరు?

స) తెలుగు హీరోస్ పరంగా బన్ని, చరణ్ డ్రసెస్ బాగుంటాయి. అలాగే హీరోయిన్స్ లో అయితే సమంత డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది. నా వరకు నా డ్రీం క్లైంట్స్ అంటే సూర్య, శ్రీదేవి అని చెప్తాను. నీకు సూర్యతో పనిచేయాలంటే చాలా ఇష్టం.

ప్రశ్న) మన నటుల డ్రసెస్ ఇంప్రూవ్ చెయ్యడానికి ఇక్కడ ఇంకా ఏమన్నా చాన్స్ ఉందంటారా?

స) కచ్చితంగా.. ఇంప్రూవ్ చెయ్యడానికి చాలా పెద్ద చాన్స్ ఉంది. మన నటులు వారి లుక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. వాళ్ళు ప్రతి సినిమాలోనూ డిఫరెంట్ గా కనపడటానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోఈ స్టైలిస్ట్ విభాగానికి ప్రాముఖ్యత ఉంది అలాగే అది రోజురోజుకి అభివృద్ధి చెందుతోంది. చాల అమంది ఫాషన్ కోసం ఖర్చు పెట్టడానికి ఆసక్తి చూపుతున్నారు, అదొక మంచి మార్పని చెప్పాలి.

ప్రశ్న : మీరు ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు​?

స) నేను ఖాళీ సమయం దొరికితే ఎక్కువగా సినిమాలు చూడటం, ఫ్రెండ్స్ ను కలవడం చేస్తాను. అలాగే నాకు నా ఫ్యామిలీతో గడపటం, వివిధ ప్రదేశాలకు వెళ్ళడం (ట్రావెలింగ్), చదవడం, తినడం అంటే చాలా ఇష్టం,
అలాగే ​నేను చాలా తిండిపోతునండి(నవ్వుతూ)..​

ప్రశ్న: భవిషత్తులో టాలీవుడ్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వాలనుకునే స్టైలిస్ట్ లకు ఇచ్చే సలహా ఏమిటి?

స ) మీ డ్రీంని అలాగే కొనసాగించండి. ఒకరోజు మీకో దారి కనపడుతుంది. అది చాలా ముఖ్యమైనది. ఒక్కసారి అవకాశం దొరికితే బాగా కష్టపడి పనిచెయ్యండి ఎందుకంటే అది చాలా కష్టమైనది. కానీ ఫన్ ఉంటుంది.

ప్రశ్న) ‘అత్తారింటికి దారేది’ సినిమాకు సంబంధించి మీకు నచ్చిన విషయం చెప్పండి?

స) నేను ఈ సినిమాకు సంబందించిన టీం అందరికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సినిమా ప్రేక్షకు​లందరూ చూడండి, ఈ సినిమా మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఇది చాలా మంచి సినిమా. షూటింగ్ టైంలో వారితో గడిపిన సమయం నిజంగా చాలా అద్భుతం. సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. థియేటర్ లో ఈ సినిమా చూడటానికి నేను స్పెయిన్ వెళ్ళవలసిన విమాన ప్రయాణాన్ని
​కూడా ​వాయిదా వేసుకున్నాను.

అంతటితో నీరజ కోనతో మా ఇంటర్వ్యూని ముగించాము. ఆమెకి ఆల్ ది బెస్ట్ చెబుతూ, అలాగే తనకి మంచి కెరీర్ ఉండాలని ఆశిద్దాం..

ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు

అనువాదం – రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు