‘ఏ మాయ చేసావే’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ముద్దు గుమ్మ సమంత తెలుగు ఆడియన్స్ కి ఏమ్మాయ చేసిందో గానీ కుర్రకారంతా సమంతని తమ డ్రీం గర్ల్ గా ఊహించేసుకుంటున్నారు. కుర్రకారు హృదయాల్ని దోచేసుకుంటున్న సమంత కెరీర్ మొదట్లోనే హాట్రిక్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం తెలుగులో వరుసగా టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం వరుస షెడ్యూల్స్ తో బిజీ బిజీగా ఉన్న సమంతతో మేము కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆమె మాతో ఎలాంటి దాపరికం లేకుండా తన పరనల్ లైఫ్ గురించి, కెరీర్ గురించి, పుకార్లని తను ఎలా తీసుకుంటుంది అనే విశేషాలను మాతో పంచుకుంది .. ఆ విశేషాలను మీకందిస్తున్నాం..
ప్రశ్న) ప్రస్తుతం మీరు వరుసగా కొన్ని పెద్ద సినిమాలు చేస్తున్నారు. అందులో ముందుగా అత్తారింటికి దారేది వస్తోంది. ఆ సినిమా ఎలా వచ్చింది?
స) ‘అత్తారింటికి దారేది’ లో పవన్ కళ్యాణ్ ది బెస్ట్ ఇచ్చారు. సినిమా చాలా బాగా తయారవుతోంది. ఈ సినిమా షూటింగ్ ఎంత ఈజీ గా అయిపోయిందనేది నేను పర్ఫెక్ట్ గా చెప్పలేను. సినిమా చాలా బాగా వచ్చింది, అలాగే ఈ సినిమా షూటింగ్ లో నేను చాలా బాగా ఎంజాయ్ చేసాను. షూటింగ్ సమయంలో మా టీంతో చాలా ఫన్ ఉండేది, అది మీకు స్క్రీన్ పై కనపడుతుంది. ఇది ఫుల్ కామెడీ ఉండే ఫ్యామిలీ సబ్జెక్ట్. పవన్ గారికి ఉన్న క్రేజ్ గురించి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. పవన్ అలా నడుచుకుంటూ వస్తున్నా టీజర్ వస్తేనే రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. నేను నిన్న ఆయన్ని కలిసినప్పుడు ”అసలు ఎం జరుగుతోంది. ఆ క్రేజ్ ఏంటి?” అని అడిగితే ఆయన సింపుల్ గా ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు.
ప్రశ్న) పవన్ తో కలిసి పనిచెయ్యడం ఎలా ఉంది?
స) మీరు ఆయన్ని కలిస్తే ఆయన ఒక పెద్ద సూపర్ స్టార్ అనే ఫీలింగ్ మీకు కలగదు. షూటింగ్ సమయంలో ఎప్పుడూ ఆయన ఓ బిగ్ స్టార్ అనేది చూపించరు. చాలా అణకువగా ఉండే మనిషి. మీ కళ్ళే మీ మనస్తత్వాన్ని చూపిస్తాయి అంటారు. మనం ఎలా కెమెరా ముందు కనిపిస్తామో, అప్పుడు కనిపించే మీ కళ్ళే ఓ దారి చూపిస్తాయి. ఆ రీతిలోనే ప్రేక్షకులు పవన్ కళ్యాణ్ కి కనెక్ట్ అయి ఉంటారు. ఈ సినిమాలో కూడా అది వారు చూడొచ్చు, ఆయన సింప్లీ సూపర్బ్(నవ్వుతూ).
ప్రశ్న) మరి ఎన్.టి.ఆర్ గురించి మరియు ‘రామయ్యా వస్తావయ్యా’ గురించి చెప్పండి?
స) ‘బృందావనం’ సినిమాతో పోల్చుకుంటే ‘రామయ్యా వస్తావయ్యా’ లో ఎన్.టి.ఆర్ చాలా డిఫరెంట్ గా ఉంటారు. ఈ సినిమాలో చాలా కొత్తగా కనిపిస్తాడు. ఈ సినిమా కోసం అయన బెస్ట్ ఇవ్వడానికి చూస్తున్నాడు. నేను ఇప్పటి వరకూ ఎన్.టి.ఆర్ ని సూపర్బ్ లుక్ లో చూడలేదు. కానీ ఈ సినిమా కోసం తను ఎంతో కష్టపడుతున్నాడు, ఆ విషయంలో నేను చాలా హ్యాపీ గా ఉన్నాను. అతని బెస్ట్ లుక్ లో నేను ఒక పార్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉన్నాను(నవ్వుతూ). వయసు విషయంలో ఇంకా బెటర్ గా ఉండేలా చూస్తున్నారు దాంతో ఎన్.టి.ఆర్ ప్రస్తుతం మునుపటికంటే కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ప్రశ్న) త్రివిక్రమ్ – హరీష్ శంకర్ లు తూర్పు పడమర లాంటి వారు. వారిద్దరితో ఒకేసారి పనిచేయడం ఎలా ఉంది?
స) అత్తారింటికి దారేదిలో త్రివిక్రమ్ గారు కాస్త మనసుకు హత్తుకునే పాత్ర ఇచ్చారు. ఇప్పటి వరకూ నేను బాగా ఎమోషనల్, సీరియస్ ఉన్న రోల్స్ చేసాను. కానీ నేను నిజ జీవితంలో అలా ఉండను. అత్తారింటికి దారేది సినిమాలో నా పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది కావున నా పర్సనల్ లైఫ్ ని కాస్త ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాలో చాలా మంది స్టార్స్ ని బాలన్స్ చేస్తూ త్రివిక్రమ్ సినిమా తీసారు. నాకు తెలిసి అది అందరూ పర్ఫెక్ట్ గా చెయ్యలేరు. షూటింగ్ అయిపోవడం అనేది నాకు బాధ కలిగించింది. నేను అడిగిన దానికంటే త్రివిక్రమ్ గారు ఎక్కువ ఇచ్చారు.
హరీష్ శంకర్ విషయానికి వస్తే అతని మాస్ పల్స్ పర్ఫెక్ట్ గా తెలుసిన వారిలో ఒకరు. ఫ్యాన్స్ ఏ విషయానికి బాగా ఆసక్తికి లోనవుతారు, దాన్ని ఎలా తియ్యాలి అనేది బాగా తెలుసు. అతను మాస్ డైరెక్టర్ కావచ్చు కానీ సున్నిత మనస్తత్వం కలవాడు. అతనికి కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సీన్స్ ఎక్కడ ఎప్పుడు పెట్టాలి అనేది బాగా తెలుసు. ఉదాహరణకి – ఒక షాట్ లో చీర అనుకున్న దాని కంటే ఎక్కువగా ఎగురుతోంది, ఆయన వెంటనే కట్ చెప్పి ఎంతో ఈజీ గా దాన్ని కట్ చేసి దాన్ని వదిలేయ్యమనచ్చు కానీ ఆయన అలా చేయలేదు. అందుకే ఆయనంటే నాకు గౌరవం.
ప్రశ్న) మీకు ఎవరన్నా కథ చెప్పినప్పుడు, అందులో మీరు ఏ ఏ ఎలిమెంట్స్ చూస్తారు?
స) సినిమాలో నా పాత్ర కి అసలు ప్రాముఖ్యత లేదు అనే పాత్రలను ఎంచుకోను. కథ అంతా ఒక వైపు వెళుతూ హీరోయిన్ కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితమయ్యే సినిమాలలో నేను చెయ్యాలనుకోవడం లేదు. అలాగని ‘ఏ మాయ చేసావే’, ‘ఈగ’ లాంటి సినిమాలే ఎప్పుడూ రావు కానీ వచ్చిన వాటిలో బెస్ట్ అనిపించిన దాన్ని ఓకే చేస్తాను. నేను ఎప్పుడూ ఆడియన్స్ ఎలా చూస్తారు అనే దాన్ని బట్టే సినిమాలు ఎంచుకుంటాను. ఆ కథ ప్రేక్షకులకి కనెక్ట్ అవుతుంది అనుకుంటే ఓకే చెప్తాను. నాకు నేషనల్ అవార్డు తెచ్చి పెట్టే పాత్రలు, పెద్ద పెద్ద సినిమాలు అక్కర్లేదు. ఉదాహరణకి .. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నేను ఒప్పుకున్నాను ఎందుకంటే అది రొటీన్ సినిమా కాదు, అదొక డిఫరెంట్ మూవీ.
ప్రశ్న) ప్రతి యాక్టర్ కి ఒక లిమిట్ ఉంటుంది. మీకు తెలిసి మీ వీక్ పాయింట్ ఏమిటి?
స) (ఆలోచిస్తే) ఎప్పుడైతే ఓ సీన్ నాకు ఒప్పుకునే విధంగా ఉండదో లేదా నాకు అది నమ్మశక్యంగా ఉండదో అప్పుడు కాస్త ఫీలవుతాను. అప్పుడు నా పెర్ఫార్మన్స్ అంత వాస్తవంగా ఉండదు అది మీరు చూస్తె చెప్పేస్తారు. అది చాలా నాటకీయంగా ఉంటుంది. పాత్ర విషయంలో ఏమి కావాలి అనే విషయంలో నా జడ్జ్ మెంట్ ని వేరు చెయ్యడం నేర్చుకున్నాను. అంతకు మించి యాక్టింగ్ విషయంలో ఇంకెలాంటి సమస్య లేదు.
ప్రశ్న) మీరు ఎంతో ఓపెన్ గా మాట్లాడుతున్నారు. ఒక హీరోయిన్ గా మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు?
స) నేను చాలెంజ్ ని బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే రకమైన పాత్రలని మాత్రమే చేసి కంఫర్టబుల్ జోన్ లోనే ఉండాలనేది నాకు ఇష్టం ఉండదు. అత్తారింటికి దారేది సినిమాలో కామెడీకి ఎక్కువ స్కోప్ ఉండడంతో నేను చాలా ఎంజాయ్ చేసాను. ప్రపంచంలోనే కమెడియన్స్ చేసే పని చాలా కష్టమైనది, నేను వారికి సెల్యూట్ చేస్తున్నాను. మన రోజు వారి జీవితంలో ఉన్న ఇబ్బందులను సమస్యలను ఉంచుకొని కూడా ప్రేక్షకుల్ని నవ్వించడం అంత సులభమేమీ కాదు.
ప్రశ్న) మీరు కాకుండా, ఇంకే హీరోయిన్ సమాజానికి ఎంతో కొంత సాయం చెయ్యాలి అనేదాన్ని ఎందుకు సీరియస్ గా తీసుకోలేదంటారు..
స) నాకు హెల్త్ బాగోలేక పోవడం దాని నుంచి కోలుకున్నప్పటి నుంచి నేను బాగా మారాను. బహుశా నాకు దేవుడు గుణ పాఠం నేర్పాడేమో. ఆ సంఘటనకి ముందు నేను స్వార్ధ పూరితంగా ఉండే దాన్ని, నేను ఎప్పుడు నా లుక్, నా కాస్ట్యూమ్స్ మొదలైన వారి మీదే దృష్టి పెట్టేదాన్ని. కా ఆ సఘటన తర్వాత ప్రతి ఒక్కటి నా చుట్టూనే తిరగదు అని తెలుసుకున్నాను. ఇండస్ట్రీలో ఒక మూవీ పెద్ద స్టార్ ని చెయ్యొచ్చు మరో మూవీ కింద పడేయోచ్చు కావున నా ఒక్కదాని గురించే ఆలోచించకూడదని తెలిసింది. అప్పుడు ఎంతో ఎఫర్ట్ పెట్టి కష్టపెడితే అనుకున్న దారిలోకి వచ్చాను. ఫేం, డబ్బుని మీరు తీసుకేల్లలేరు అలాగే మీ బాధ్యతల్ని పక్కన పెట్టండి. కొంత వెనక్కి తిరిగి ఇచ్చి సాయం చెయ్యండి ఆ దారిలోనే నేను మారాను. అలాగే నా వయసు కూడా పెరుగుతోంది(నవ్వులు).
ప్రశ్న) మీకు టాప్ స్టార్ హీరోస్ లాగా ఫ్యాన్స్ ఉన్నారు. ఆ విషయంలో మీరెలా ఫీల్ అవుతున్నారు?
స) (నవ్వుతూ) నేను వాళ్ళని ఫ్యాన్స్ అని పిలవను. వాళ్ళు నాకు మంచి ఫ్రెండ్స్. వాళ్ళ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. వాళ్ళందరూ బాగా చదువుకున్న వాళ్ళు, మంచి ఉద్యోగాలలో ఉన్నవారు అలాగే మంచి విలువలు తెలిసిన వారు. వాళ్ళు నాతో సూటిగా ఉంటారు, రియల్ ఫీడ్ బ్యాక్ ఏంటనేది నాకు తెలియజేస్తుంటారు. నేను ఎలా కన్పదకూదదో వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు. నేను వాళ్ళు చెప్పినవి విని వాళ్ళు ఎలా చెప్పారో అలా మార్చుకుంటాను. వాళ్ళు నన్ను ఎలా వారి లైఫ్ లో ఒక పార్ట్ అనుకుంటున్నారో అలాగే వారు కూడా నా లైఫ్ లో ఒక పార్ట్.
ప్రశ్న) మీరు మతాన్ని బాగా నమ్ముతారా?
స) లేదు. కానీ నేను నాస్తికురాల్ని కాదు. నేను ప్రార్ధిస్తాను, నాకు దేవుడి పై నమ్మకం ఉంది. నాకు తెలిసి మనం ఎప్పుడైతే దేవుణ్ణి నమ్ముతామో అప్పుడు సెల్ఫ్ కంట్రోల్, క్రమశిక్షణ వాటంతట అవే వస్తాయి. మీరు చెడు మార్గంలోకి తొందరగా వెళ్ళలేరు.
ప్రశ్న) సినిమాలు కాకుండా, మీరు ఇంకెలా ఎంజాయ్ చేస్తారు?
స) చాలా మంది నన్ను బోరింగ్ అని పిలుస్తుంటారు(నవ్వుతూ). నాకు బాగా లూస్ గా ఉండే బట్టలన్నా, ఓల్డ్ టీ షర్ట్స్ అన్నా బాగా ఇష్టం. నాకు అలా కూర్చొని టీవీ చూడడం అంటే ఇష్టం.(నవ్వుతూ) నాకు ఎలాంటి పని చేయకుండా ఉండడం అంటే ఇష్టం. అలాగే పొలిటికల్ డ్రామాలు, డాక్యుమెంటరీలు అంటే ఇష్టం. వేరే ఎవరన్నా మాట్లాడుకుంటూ ఉంటే వినాలనుకుంటాను, నాకు ఎవరన్నా గట్టిగా అరవడం అంటే ఇష్టం ఉండదు. నాకు ఫుడ్ అన్నా తినడం అన్నా చాలా ఇష్టం. నన్ను హ్యాపీ గా ఉంచే వాటిల్లో ఫుడ్ ఒకటి. నాకు హలీమ్ అంటే మరింత ఇష్టం పెరిగింది(నవ్వులు).
ప్రశ్న) వావ్.. మీ ఫీట్ నెస్ సీక్రెట్ ఏమిటి?
స) నేను వ్యాయామం చేస్తాను. కానీ బరువు తగ్గడానికి ఎలాంటి వర్కౌట్స్ చెయ్యను. నేను బరువు పెరగడానికి వ్యాయామం చేస్తాను(నవ్వులు).
ప్రశ్న ) మీరు ఒక నటిగా ఎలా గుర్తుంది పోవాలనుకుంటున్నారు? కొద్ది సంవత్సరాల తర్వాత మీరు డౌన్ అయినప్పుడు ఎలాంటి వారసత్వాన్ని ఇవ్వాలనుకుంటున్నారు?
స) (ఆలోచిస్తే).. ‘నేను ఎప్పుడు చనిపోతానో .. ‘ అనేది నేను ఎప్పుడూ ఆలోచించలేదు(నవ్వుతూ). నాకు తెలిసి నటన అనేది ఓక జాబ్ మాత్రమే, మనం చేసే జాబు మనం ఎవరనేది తెలియ జేస్తుందంటే నేను నమ్మను. ప్రస్తుతం ప్రజలు ఆలోచించేది అంతా తాత్కాలికం. మీరు ప్రతి ఒక్కరిని హ్యాపీ గా ఉంచాలి మరియు అందరినీ మీలా తయాడు చెయ్యాలను కుంటే ఆ యుద్దంలో మీరు గెలవలేరు. నేను నా కుటుంబ సభ్యులని, నాకు పరిచయమున్న వారిని హ్యాపీగా ఉంచితే అలాగే వాళ్ళంతా నన్ను ప్రేమిస్తే అది చాలా మంచిది. నేను నా లైఫ్ లో మంచిగా బతికితే నా పిల్లలు కూడా మంచి విలువలతో, మంచి పౌరులుగా పెరుగుతారు, నాకు ఆ సంతృప్తి, వారసత్వం చాలండి.
ప్రశ్న) పుకార్ల విషయంలో మీరెలా ఫీల్ అవుతారు? అవి మిమ్మల్ని భాదిస్తాయా?
స) అవును అవి కాస్త బాధిస్తాయి ఎందుకంటే నేను మనిషినే కదా కానీ నేను ఇదివరకు చెప్పినట్టు నేను ప్రజల్ని సంతోష పరచడానికి నటించడం లేదు. నేను 9 నుంచి 6 వరకు జాబు చేస్తున్నాను.6 తర్వాత నటించడం ఆపేస్తాను, ఆ తర్వాత నేను జస్ట్ సమంత. నన్ను పుకార్లు భయపెట్టవు. నాకు నచ్చినట్టు నేనుంటాను. కానీ ఇక్కడా, అక్కడా విన్నప్పుడు కాస్త బాధ పడతాను. కానీ వాటి వల్ల నేను ఏ మాత్రం మారను.
ప్రశ్న) ఇటీవల కాలంలో మీరు అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి?
స) (ఆలోచిస్తే) .. కాంప్లిమెంట్స్ ని నేను అంతగా గుర్తు పెట్టుకోను. కావున నేను చెప్పలేను. కానీ విమర్శల వైపుకి వస్తే నేను చాలా హార్డ్ గా ఉంటాను. వాటిని బాగా సీరియస్ గా తీసుకుంటాను. ఇది వరకు చెప్పినట్టు నాకు నచ్చకపోయినా చెయ్యమన్నప్పుడు నేను కేవలం నటిస్తాను. నా గత సినిమాలు చూసి పరిశీలించిన త్రివిక్రమ్ ఈ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు.
ప్రశ్న) మీరు ముందు ముందు చేయనున్న సినిమాల గురించి చెప్పండి? అలాగే ఏమన్నా బాలీవుడ్ ప్లాన్స్ ఉన్నాయా?
స) ప్రస్తుతం పని చేస్తున్న సినిమాలు ‘అత్తారింటికి దారేది’, ‘రామయ్యా వస్తావయ్యా’, ‘మనం’. ఈ మూడు సినిమాలు చేస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. మూడు సినిమాల్లోనూ మంచి పాత్రలు వచ్చాయి. వచ్చే సంవత్సరం కొన్ని తమిళ సినిమాల్లో నటించనున్నాను. మామూలుగా షూటింగ్ కి వెళ్ళే అంత వరకూ నా తదుపరి సినిమాల గురించి చెప్పను. ప్రస్తుతం ఎలాంటి బాలీవుడ్ ప్లాన్స్ లేవు. ఇక్కడే హ్యాపీ గా ఉన్నాను.
ప్రశ్న) మీకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరు?
స) ఇప్పటివరకూ నా కెరీర్లో సూపర్బ్ డైరెక్టర్స్ తో పనిచేసాను. టీంతో మంచి వర్కింగ్ రిలేషన్ షిప్ ఉంటేనే సినిమా చాలా బాగా వస్తుంది. అందరి దర్శకులలో నందిని రెడ్డి, రాజమౌళి, గౌతం మీనన్, త్రివిక్రమ్ మరియు కొంతమంది ఇష్టమైన దర్శకులు ఉన్నారు.
ప్రశ్న) మీతో పాటు నటించిన కో స్టార్స్ అయితే?
స) (ఒక చిన్న నవ్వు). నాకు అందరి హీరోలతోనూ మంచి రిలేషన్ ఉంది. వాళ్ళు నా ఫ్రెండ్స్ కారు కానీ వాళ్ళందరితో నేను బాగుంటాను. నాకు కాజల్ అంటే ఇష్టం, ఆమెది సూపర్బ్ పర్సనాలిటీ.
అంతటితో సమంతతో మా ఇంటర్వ్యూని ముగించాము. ఆమె ఎనర్జీ, స్మైల్ అలాగే మాతోనే ఉండిపోయింది. ఆమె చేయనున్న తదుపరి ప్రాజెక్ట్స్ మరింత మేరు తెచ్చి పెట్టాలని ఆశిద్దాం. ఈ ఇంటర్వ్యూ మీకు కూడా బాగా ఎంజాయ్ చేసారని ఆశిస్తున్నాం.
ఇంటర్వ్యూ – మహేష్ ఎస్ కోనేరు
అనువాదం – రాఘవ
CLICK HERE FOR ENGLISH INTERVIEW