నవీన్ చాలా పొడవుగా ఉండి, మాస్ లుక్ తో కనిపించే నటుడు. భారీగా ఉన్న జుట్టు మరియు ఆ గడ్డంతో అతన్నిమొదటి సారి చూడగానే ఒక యావరేజ్ తెలుగు హీరో లాగా కనిపించడు. కానీ అతనితో కొంత సేపు మాట్లాడితే అతనిలో ఉన్న తెలివితేటల గురించి మీకు అర్థమవుతుంది. అతను కుటుంబానికి చాలా గౌరవమిచ్చే మనిషి మరియు ఎంతో నమ్మకమైన వ్యక్తి. నవీన్ మాతృ భాష తమిళ్ అయినా తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు. అలాంటి నవీన్ తో మేము ప్రత్యేకంగా ముచ్చటించాము . ‘అందాల రాక్షసి’ చిత్రంలో తను చేసిన పాత్ర గురించి, ఈ చిత్రానికి సంబందించిన విశేషాలు మరియు తన పర్సనల్ లైఫ్ గురించిన విశేషాలను మాకు తెలియజేశారు. ఆ విశేశాలేంతో చూసేద్దమా..
ప్రశ్న) తెలుగులో చాలా బాగా మాట్లాడుతున్నారు, ఈ మధ్య కాలంలో నేర్చుకున్నారా?
జ) నేను మామూలుగా తమిళ వాడినే కానీ నేను ఆంధ్రప్రదేశ్ మరియు కర్నాటకలో ఎక్కువ సమయం గడిపాను. అందువల్ల తెలుగు నేర్చుకున్నాను మరియు నాకు తెలుగు మాట్లాడడంలో ఎలాంటి ఇబ్బంది లేదు.
ప్రశ్న) ‘అందాల రాక్షసి’ చిత్రంలో నటించే అవకాశం ఎలా వచ్చింది?
జ) అది ఒక అద్భుతమనే చెప్పుకోవాలి. నాకు మరియు దర్శకుడు హనుకి స్నేహితుడైన లక్ష్మీ భూపాల్ ద్వారా ఈ అవకాశం లబించింది. హను మాట వరసకి లక్ష్మీ భూపాల్ దగ్గర తన సినిమా కోసం బాగా మాస్ లుక్ ఉండి మంచి బాడీ కలిగిన ఒకకొత్త అబ్బాయి కావాలని చెప్పాడంట. భూపాల్ వెంటనే నా గురించి హనుకి చెప్పడంతో, హనుకి నా ఫోటోలను పంపాను. ఒక రోజు తమిళ సినిమా చిత్రీకరణలో ఉండగా హను ఫోన్ చేసి ఒకసారి కలవగాలరా అని అడిగారు. ఆ తర్వాత నేను హనుని కలిశాను, అతను నన్ను కొద్ది సేపు కింద నుంచి పై దాకా బాగా గమనించి, ఆయన నన్ను అడిగిన ప్రశ్న మీరు చేస్తున్న సినిమా షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుంది?. హను నా వాకింగ్ స్టైల్ ని చెక్ చేశారు మాములుగా నా నడక నాకొక పెద్ద ప్లస్ పాయింట్. నా చిత్రంలో నిన్ను తీసుకుంటున్నాను, సినిమా కోసం నువ్వు ఇంకాస్త జుట్టు మరియు గడ్డం పెంచు అని చెప్పారు.
ప్రశ్న) ఈ చిత్రంలో మీరు చేసిన సూర్య పాత్రకి మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకున్నారు?
జ) నా పాత్రని తీర్చి దిద్దడంలో హను పూర్తి విజయాన్ని సాదించాడు. ‘ ప్రతి సిటీ బస్సులోనూ సూర్య లాంటి వాడు ఒక్కడు ఉంటాడు. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్ ఉన్న బస్సుల్లో ఎక్కువ కనపడుతుంటారు’. అందుకోసం ఒక వారం రోజుల పాటు సిటీ బస్సుల్లో తిరగమని హను నాకు చెప్పారు. అలాగే హను నన్ను నా లగ్జరీ లైఫ్ నుండి కొంత కాలం దూరంగా ఉండమన్నాడు. రోజూ ఆఫీసుకి నడిచిరా అన్నారు. ఒకవేళ నీకు కారులోనే వెళ్ళే అలవాటు దాన్ని మానుకొని కావాలంటే బైక్ లో రావడం అన్న అలవాటు చేసుకోమన్నారు. అలా క్రమక్రమంగా సూర్యా పాత్రలోకి ఒదిగిపోయాను.
ప్రశ్న) నవీన్ కి సూర్యకి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటి ?
జ) వీరిద్దరి మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి మరియు కొన్ని పోలికలు ఉన్నాయి. గతంలో నేను చాలా రిజర్వుగా ఉండేవాడిని, ప్రస్తుతం నేను అలా లేను మరియు నాలో వచ్చిన మార్పును చూసి మా ఫ్యామిలీ మెంబర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. సూర్య పాత్ర చాలా రౌద్రంగా మరియు మాస్ భావాలు కలిగి ఉంటుంది. నేను ఆపాత్రలోకి పూర్తిగా ఒదిగిపోవడానికి గల కారణం ఏమిటంటే మణికొండలో నాకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్లాట్ తీసుకున్నాను మరియు ఆ ఫ్లాట్ మొత్తం పెద్ద పెద్ద మిథున (అందాల రాక్షసి చిత్రంలో లావణ్య పాత్ర పేరు) పోస్టర్లు అంటించాను. మూడు నెలలు నా లైఫ్ లో ప్రతి విషయంలోనూ మిథుననే కనపడేది.. అలా పాత్రలో బాగా లీనమైపోయాను అందువల్ల సెట్ లో లావణ్య ని చూసినా మిథున అనే భావనే వచ్చేది, తను లావణ్య అని ఎప్పుడూ అనిపించేది కాదు.
ప్రశ్న) చాలా ఆసక్తి గా ఉంది. అలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి ఇంకొంచెం వివరంగా చెప్పండి
జ) దీనికి సంబందించిన పూర్తి క్రిడిట్ అంతా మా దర్శకుడు హనుకే చెందుతుంది. ఏం కావాలో అతనికి బాగా తెలుసు మరియు సినిమాలోని ప్రతి ఫ్రేం మీద చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు, ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన మిస్టర్ పర్ఫెక్ట్ . ఉదాహరణకి మేము నటించిన కొన్ని సన్నివేషాలు చాలా బాగా వచ్చేవి, అయినా కానీ ఆ సన్నివేశానికి తగ్గట్టుగా నా జుట్టు లేదని, ఇంకా ఏదన్నా చిన్న చిన్న కారణాల వల్ల కూడా మళ్ళీ రీ షూట్ చేసేవారు. అతనితో కలిసి పనిచేయడం వల్ల నేను ఎంతో నేర్చుకున్నాను మరియు నా లైఫ్ లో ఊహించనిమార్పులు వచ్చాయి.
ప్రశ్న) అందాల రాక్షసి చిత్రం చిత్రీకరణలో మీకు బాగా చాలెంజింగ్ గా అనిపించినా సందర్భం ఏమిటి?
జ) ఈ చిత్రంలో నేను కొంత మంది రౌడీల నుండి తప్పించుకోవడానికి సుమారు 2 కిలోమీటర్లు పరిగెత్తవలసిన చేజింగ్ సన్నివేశం ఉంటుంది. ఈ సన్నివేశాన్ని ఒకేసారి ఎక్కువ కెమరాలతో షూట్ చేశాము,. ఈ సన్నివేశాన్ని మూడు రోజుల పాటు తీశాము. అది అయిన వెంటనే వర్షంలో ఆటో వెనుక పరిగెత్తే ఒక సన్నివేశం తీశాము దీన్ని నాలుగు రోజులు చిత్రీకరించాం. అలా వరుసగా 7 రోజులు పరిగెత్తే సన్నివేశాలలో నటించడంతో బాగా అలసిపోయాను కానీ ఆ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి.
ప్రశ్న) సినిమాలు కాకుండా మీకు నచ్చిన ఇతర అభిరుచులేంటి?
జ) నాకు గేమ్స్ ఆడటం అంటే చాలా ఇష్టం. నేను ప్లే స్టేషన్ కి పెద్ద ఫ్యాన్ ని మరియు ఇప్పటి వరకూ చాలా యాక్షన్ గేమ్స్ ఆడాను. అలాగే నాకు డాన్సు అంటే కూడా చాలా ఇష్టం. అవి కాకుండా ముసలి వారికి వసతి కల్పించడం లాంటి విషయాల్లో చురుకుగా పాల్గొంటాను. వాళ్ళ లైఫ్ చివరిదశలో వాళ్ళు పడే భాదలు చూస్తే నాకు భాదగా ఉంటుంది. నాకు వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, కనీసం ఒక్కరి నైనా దత్తతు తీసుకోవాలి. ‘అలాంటి వాళ్లకి ఏదైనా చెయ్యటం కోసం అయినా నేను లైఫ్ లో పెద్ద వాడిని అవ్వాలి'(చిరునవ్వు చిందిస్తూ). నాకు నా రాయల్ ఎన్ఫీల్డ్ బండి అంటే చాలా ఇష్టం. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పాటు దాన్ని కూడా తీసుకెళ్తాను మరియు కొన్ని సమయాల్లో దాన్ని ముద్దాడుతూ కూడా ఉంటాను.
ప్రశ్న) అది చాలా మంచి ఆలోచన. అయితే మీరు కుటుంబానికి ప్రాధాన్యమిచ్చే మనిషి అనమాట?
జ) అవునండీ.. నేను నా ఫ్యామిలీని అమితంగా ప్రేమిస్తాను మరియు వాళ్ళ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను.
ప్రశ్న) మీ పర్సనల్ లైఫ్ గురించి చెప్పండి? మీరు ఇంతకీ ఒంటరేనా లేక ఎవరితోనైనా సంబందంలో ఉన్నారా?
జ) (ఒక చిరు నవ్వు నవ్వి) ప్రస్తుతం నేను ఒకరితో సంబందంలో ఉన్నాను కానీ అది చెప్పడానికి ఇది సరైన సమయం కాదు.
ప్రశ్న) తెలుగు సినిమాలు చూస్తారా? తెలుగులో మీకు నచ్చిన తారలు ఎవరు?
జ) ఇప్పటి వరకూ చాలా తెలుగు సినిమాలు చూశాను. నేను బళ్ళారిలో పెరిగాను కాబట్టి అక్కడ విడుదలయ్యే ప్రతి పెద్ద హీరో సినిమా చూసేవాన్ని. నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. ఆయన చాలా మంచి డాన్సర్ అందువల్లే నాకు డాన్సు పై మక్కువ ఏర్పడింది. నేను చిరంజీవి గారిని ఆరాదిస్తాను. ఇప్పటికీ చిరంజీవి గారి పాట వచ్చిందంటే చాలా ఆసక్తిగా చూస్తాను. హీరోయిన్ల విషయానికొస్తే సావిత్రి గారు మరియు శ్రీ దేవి గారు అంటే చాలా ఇష్టం. నాకు కనుక శ్రీ దేవి గారిని కలిసే అవకాశం వస్తే ఎగిరి గంతేస్తాను మరియు మీరు ఎంతో గొప్ప నటి అని ఆమెకి చెప్తాను (కొంచెం సిగ్గు పడుతూ నవ్వారు).
ప్రశ్న) మీరు మీ బాడీ కోసం ఏమైనా ప్రత్యెక శ్రద్ధ తీసుకుంటారా? మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం?
జ) మనకు ఉపయోగపడే ఫుడ్ ఏదైనా తినడానికి నేను రెడీ. సహజంగానే నా బాడీ కొంచెం కండలు తిరిగి ఉంటుంది. నాకు గుడ్లు అంటే చాలా ఇష్టం . సుమారు నేను రోజుకు 40 గుడ్లు తినేస్తాను. అదికాకుండా చేపలంటే ఇష్టం.
ప్రశ్న) లావణ్య మరియు రాహుల్ తో కలిసి పని చెయ్యడం ఎలా ఉంది?
జ) వాళ్ళిద్దరూ సూపర్బ్. షూటింగ్ మొదలైన కొత్తలో లావణ్య దగ్గర కొంచెం రిజర్వుగా ఉండేవాడిని. దర్శకుడు హనునే ఒకరోజు నన్ను లావణ్య ఆశ్చర్యపడేలా తన గదికి వెళ్ళమన్నారు మరియు ఇద్దరూ కూర్చొని సినిమాలో మీ మధ్య వచ్చే సన్నివేశాలను ఒకసారి ప్రాక్టీస్ చేయండి అని చెపారు. ఆ తర్వాత నేను అలా చేశాను లావణ్య ఎంతో భయపడ్డారు మరియు నా పై హనుకి ఫిర్యాదు చేశారు. హను అసలు ఏమి జరిగింది అనేది పూర్తిగా లావణ్యకి వివరించి చెప్పాడు. ఆ తర్వాత సినిమాలో మిథునని సూర్య సినిమాలో ఎంత ఎడిపిస్తాడో అనే విషయం నాకు అర్థమైంది. రాహుల్ గురించి చెప్పాలంటే మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. మా మధ్య ఉన్న చనువు చూసిన అందరూ మా ఇద్దరిదీ ‘దోస్తానా’ సంబంధం అని అనుకున్నారు అంటూ నవ్వేశాడు.
ప్రశ్న) అందాల రాక్షసి సినిమా చూసిన వారి నుంచి మీరు అందుకున్న ఫీడ్ బ్యాక్ ఏమిటి?
జ) నేను సురేష్ బాబు గారి దగ్గర నుంచి మంచి అభినందనలు అందుకున్నాను. ఆయన నీ పాత్రకి పూర్తి న్యాయం చేశావు మరియు నాకు చాలా బాగా నచ్చింది అని అన్నారు. నేను అందుకున్న ప్రత్యేక అభినందన ఏదంటే.. సినీమాక్స్ లోని కే.ఎఫ్.సి రెస్టారెంట్ కి వెళ్ళాను, అక్కడ నన్ను చూసి గుర్తు పట్టిన ఒకతను చేతి సైగల ద్వారా ఏదో చెబుతున్నాడు, ఇంతకీ అది ఏమిటంటే అందాల రాక్షసి ట్రైలర్స్ లో నా నటన అతనికి బాగా నచ్చిందంట. మాట్లాడలేని మరియు వినలేని వారికి కూడా అందాల రాక్షసి నచ్చడం అనేది నేను అందుకున్న వాటిలో ఉత్తమైన అభినందన.
ప్రశ్న) ప్రస్తుతం తెలుగు మరియు తమిళంలో ఏమన్నా సినిమాలు చేస్తున్నారా?
జ) ప్రస్తుతం నేను ‘దళం’ అనే తెలుగు సినిమాలో నటిస్తున్నాను. మరో తమిళ సినిమా కూడా ప్రస్తుతం నా చేతిలో ఉంది.
ప్రశ్న) మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది? దీన్ని చదివే పాఠకులకు మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా?
జ) నవ్వుతూ… మీతో మాట్లాడటం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మీడియా వారికి మరియు అందాల రాక్షసి చిత్రాన్ని ఇంతలా ఆదరిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రేక్షకులకు ముందుగా నా కృతఙ్ఞతలు. ఈ చిత్రం కోసం మా టీం అంతా చాలా కష్టపడ్డాం మరియు ఆగష్టు 10న సినీ ప్రేమికుల నుండి మరికొన్ని మంచి అభినందనలు అందుకుంటామని ఆశిస్తున్నాం. ఈ సినిమాని మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ తో కలిసి చూడండి. ఈ చిత్రం చూసిన తర్వాత ఒక మంచి ఫీల్ ఉన్న సినిమా చూసిన భావనతో బయటకు వస్తారు.
అంతటితో నవీన్ గారితో జరిగిన ఇంటర్వ్యూ ముగిసింది. నవీన్ గారితో చేసిన ఇంటర్వ్యూ మీకు బాగా నచ్చుతుందని భావిస్తున్నాం. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘అందాల రాక్షసి’ చిత్రం విజయం సాదించాలని కోరుకుందాం.
అనువాదం రవి…
Click Here For Interview in English