టాలీవుడ్ లో నిర్మాతలుగా మగరాయుళ్ళ హవా కొనసాగుతున్న ఈ తరుణంలో లేడీ నిర్మాతగా ఇండస్త్రీలోకి ఎంటర్ అవ్వడమే కాకుండా మొట్ట మొదటి సినిమానే ‘పంజా’ పేరుతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసింది. ఆ సినిమా తర్వాత నూతన నటీనటులకు, డైరెక్టర్ కి అవకాశమిస్తూ తన సంఘమిత్రా ఆర్ట్స్ బ్యానర్ లో చేసిన సినిమా ‘అలియాస్ జానకి’. ఈ సినిమా రేపు అనగా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నీలిమ తిరుమలశెట్టి గారితో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాము. ఆమెకి తను ఎం చెయ్యాలి అన్నదాని మీద చాలా క్లారిటీ ఉంది. అలాగే సినిమాలు అంటే చాలా ఇష్టం, ఇండస్ట్రీలోనే నిర్మాతగా లాంగ్ లైఫ్ ఉండాలని ఆశిస్తోంది. సినిమా గురించి ఇంకా మరెన్నో విషయాలను మాకు చెప్పారు ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ‘అలియాస్ జానకి’ సినిమా ఎలా మొదలైంది?
స) నేను మంచి సినిమాలను నిర్మించాలనుకున్నాను. నాకు ఫిల్మ్ మేకింగ్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. ‘పంజా’ సినిమా తర్వాత నేను టాలెంట్ ఉన్న కొత్త వాళ్ళతో సినిమాలు చేయాలనుకున్నాను. ఇలా చేయడానికి నాకు స్పూర్తినిచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నా చిన్న సినిమాల ప్రయాణంలో ‘అలియాస్ జానకి’ మొదటి సినిమా.
ప్రశ్న) మీరు వెంకట్ రాహుల్ ని హీరోగా ఎలా ఎంపిక చేసుకున్నారు?
స) నేను సినిమా కథల కోసం వెతుకుతున్నప్పుడు వెంకట్ రాహుల్ ఈ కథతో వచ్చాడు. అప్పుడు నాకు అతనికి మెగా ఫ్యామిలీతో సంబంధం ఉందని తెలియదు. నేను అతను ఆ సినిమాని డైరెక్ట్ చెయ్యాలనుకుంటున్నాడెమో అనుకున్నా కానీ అతను నటించాలన్నాడు. అతనికి తనపై నమ్మకం, దానికి మించి కథ మీద నమ్మకం ఉంది. దాంతో నేను ఒప్పుకున్నాను. కొంతమంది హీరో ఎక్కువ వయసు ఉన్నట్లు కనపడుతున్నాడు అని అడిగారు కానీ అతని పెర్ఫార్మన్స్, సినిమాని తీర్చి దిద్దిన విధానం చూసుకుంటే అతన్ని మీరు విజయానికి మరో రూపంలా ఉన్నాడే అని అంటారు.
ప్రశ్న) ‘అలియాస్ జానకి’ సినిమా ఎలా ఉంటది?
స) ‘అలియాస్ జానకి’ ఒక చిన్న మెసేజ్ తో ఆసక్తికరంగా సాగే సినిమా. బహుశా అందుకే ఏమో మేము దీన్ని ఎఫ్ఫెక్టివ్ మెసేజ్ డ్రామా అంటున్నాం. ఇది ఒక కొత్త జోనర్(నవ్వులు). ఇది చాలా సింపుల్ స్టొరీ. నిజాయితీగా ఉండే ఒక మనిషి తన నిజాయితీ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేదే సినిమా. కానీ మేము చాలా డిఫరెంట్ గా తీసాము.
ప్రశ్న) మీరు చిన్న బడ్జెట్ సినిమాలు చెయ్యాలనుకున్నారు. బడ్జెట్ తగ్గడం వల్ల సినిమా అవుట్ పుట్ క్వాలిటీని మేనేజ్ చెయ్యొచ్చా?
స) నా మొదటి సినిమా పంజా’, అది భారీ బడ్జెట్ మూవీ. ఆ సినిమా ద్వారా ఫిల్మ్ మేకింగ్ లో చాలా విషయాలు నేర్చుకున్నాను. ఎక్కడెక్కడ బడ్జెట్ ని తగ్గించుకోవచ్చు అనేవి తెలుసుకున్నాను. ఉదాహరణకి ప్రీ ప్రొడక్షన్.నిర్మాణ రంగంలో వాతావరణాన్ని అనుగుణంగా మార్చుకోవడం, కావలసిన వాటిని ఆర్గనైజ్ చేసుకునే విషయాల్లో నా సాఫ్ట్ వేర్ బ్యాక్ గ్రౌండ్ కూడా సాయపడింది. మేము అనుకున్న బడ్జెట్ లోనే బాగా తీశాం అనుకుంటున్నాం. ఎప్పుడైతే సినిమాకి ఖర్చు తగ్గుతుందో అప్పుడే ఫిల్మ్ మేకింగ్ లో లింక్ ఉన్న అందరికీ లాభాలు వస్తాయి.
ప్రశ్న) ఒక మహిళగా ప్రొడక్షన్ విభాగంలో ఏమన్నా చాలెంజస్ ఎదుర్కొన్నారా? అలాగే మీరు చిన్న బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు, అది చాలా పెద్ద చాలెంజ్ లాంటిది..
స) మీరు అన్నది నిజం. నేను చాలా విభాగాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నాను, ప్రతి అడుగు ఒక పోరాటం లాంటింది. బాధాకరమైన నిజం ఏమిటంటే ఇది పురుషాధిక్యత కలిగిన ఇండస్ట్రీ. వాళ్ళు మిమ్మల్ని బాగా చూస్తారు కానీ సీరియస్ గా తీసుకోరు. ఆ విషయం నేను తెలుసుకున్నాను. కానీ నేను మానసికంగా చాలా స్ట్రాంగ్ కావున ఇవన్నీ నన్ను పెద్దా ఎఫెక్ట్ చెయ్యలేదు. ఇండస్ట్రీలో మహిళని ఒక బేరర్ లా చూసినా నేను పట్టించుకోను. అన్ని సమస్యలు ఎదుర్కొన్న తర్వాత చివరికి వాళ్ళు నన్ను అంగీకరించారు. నేను ఎలా కష్టపడుతున్నాను, నేను ఎలా పనులు చేసుకుంటూ వెళుతున్నాను అనేది వారికి తెలుసు. ఇప్పుడిప్పుడే వాళ్ళు నన్ను సీరియస్ గా తీసుకుంటున్నారు.
ప్రశ్న) మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మీకు సపోర్ట్ గా నిలిచిందెవరు?
స) నా భర్త నాకు మొదట సపోర్ట్, అలాగే ఆయన నాను ఎప్పటికప్పుడు గైడ్ చేస్తూ ఉంటారు. అలాగే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి కూడా కృతఙ్ఞతలు చెప్పాలి. ‘పంజా’ సినిమా టైం లో వారు ప్రతి పనిలోనూ నాకు అండగా ఉన్నారు. వారందరినీ ఇప్పుడు నా ఫ్యామిలీ లాగా భావిస్తాను. నా పిల్లలు నన్ను బాగా అర్థం చేసుకుంటారు, నా విషయంలో వారు ఎంతో గర్వంగా ఫీలవుతుంటారు. నేను వారిని చాలా జాగ్రత్తగా చూసుకొని, వారికి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి.
ప్రశ్న) సినిమాలు, ప్రొడక్షన్ కాకుండా మిగతా సమయాన్ని మీరెలా గడుపుతారు?
స) ప్రస్తుతం నా ప్రపంచం అంతా సినిమాల చుట్టూనే తిరుగుతూ ఉంది. ఇలా నా లైఫ్ లో జరుగుతుందని అనుకోలేదు కానీ జరిగింది అదే విధి. నాకు టైం దొరికినప్పుడు నా పిల్లలతో ఎక్కువ టైం గడుపుతాను.
పశ్న) అలియాస్ జానకి మ్యూజిక్ చాలా పెద్ద హిట్ అయ్యింది. ఆ విజయాన్ని మీరు ఊహించారా?
స) నేను మొదటి నుంచి మ్యూజిక్ విషయంలో చాలా నమ్మకంగా ఉన్నాను అలాగే శ్రవణ్ కి మంచి పెరోస్తుందని అనుకున్నాను. మ్యూజిక్ చాలా ఫ్రెష్ ఫీల్ ని కలుగ జేసింది. మేము ముందు నుంచి ఊహించాం కానీ ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత మా బలం, ఆనందం రెట్టింపయ్యింది.
ప్రశ్న) అలియాస్ జానకి లో హైలైట్స్ ఏమవుతాయని మీరనుకుంటున్నారు?
స) టీం వర్క్ అనే దానికి చక్కటి ఉదాహరణ అలియాస్ జానకి. ఈ సినిమాకి మ్యూజిక్, సినిమాటోగ్రఫీ మెయిన్ హైలైట్స్ అవుతాయి. కానీ టీం మొత్తం బాగా చేసారు. ఎక్కువ క్రెడిట్ హీరోయిన్ అనిష అంబ్రోసే కి చెందుతుంది. డైరెక్టర్ దయా గారు నటీనటుల నుండి అనుకున్న దాన్ని పర్ఫెక్ట్ గా రాబట్టుకున్నారు.
ప్రశ్న) మీరు ముందు ముందు చేయనున్న సినిమాలేమిటి?
స) ‘అరెరే’ ప్రొడక్షన్ దశలో ఉంది. శేఖర్ కమ్ముల అసిస్టెంట్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. రొమాంటిక్ – కామెడీ ఎంటర్టైనర్ గా ఉండే ఆ సినిమా ఈ సంవత్సరంలోనే రిలీజ్ ఉంటుంది. దాని తర్వాత శేఖర్ సూరి ప్రాజెక్ట్ ఉంటుంది. ఆ సినిమా చాలా వినూత్నంగా, ఫ్రెష్ గా ఉంటుంది.
ప్రశ్న) మీరు మా పాఠకులకి ఏమన్నా చేపాలనుకుంటున్నారా?
స) అలియాస్ జానకి తప్పకుండా చూడాల్సిన సినిమా. సామాజిక భాద్యత కలిగిన టీం అంతా కలిసి అదే విషయాన్ని తెరపై చూపించాము. ప్రస్తుత జెనరేషన్ కి బాగా సరిపోయే సినిమా. అందరూ సినిమా చూసి మమ్మల్ని ప్రోత్సహించండి.
అంతటితో నీలిమ గారితో మా ఇంటర్వ్యూ ని ముగించాం. ఆమె ఈ సినిమా విజయం పై చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని ఆమెకి ఆల్ ది బెస్ట్ చెబుదాం.
ఇంటర్వ్యూ : మహేష్ ఎస్ కోనేరు
అనువాదం : రాఘవ
CLICK HERE FOR ENGLISH INTERVIEW