పూరి జగన్ అంటేనే యువతలో ప్రత్యేకమైన క్రేజ్. ఈ డాషింగ్ డైరెక్టర్ తీసిన రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘హార్ట్ ఎటాక్’ నిన్న విడుదలైంది. ఈరోజు పూరి మీడియాతో కొన్ని కొత్త విషయాలు ముచ్చటించారు. అవేమిటో చూద్దామా??
1. హార్ట్ ఎటాక్ సినిమాకు ప్రేక్షకుల స్పందన ఎలా వుంది?
ప్రేక్షకులనుండి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమా రూపుదిద్ధుకున్న విధానం నాకు నచ్చింది
2. ఈ సినిమాకు మిక్సిడ్ టాక్ వచ్చినట్టుంది?
మాకు కొన్ని సమీక్షలు అలా వినిపిస్తున్నా మొత్తంగా చూసుకుంటే ఆనందకరమైన స్పందనే వచ్చింది. ఒక సినిమాపై ఎవరి అవగాహన వారికి వుంటుంది. అందరినీ ఒప్పించలెం కదా
3. ఈ సినిమాను స్పెయిన్ లో ఎందుకు చిత్రీకరించారు?
ఈ సినిమా కధ చాలా సింపుల్. సాధారణ ప్రేమకధ. దీనిని గనుక ఇండియాలో తీస్తే అనుకున్నంత ఫీల్ రీచ్ అవ్వదు. అందుకే నితిన్ కు కొత్త లుక్ ఇచ్చి స్పెయిన్ లో షూట్ చేశాం
4. నితిన్ తో పనిచేయడం మీకెలా అనిపించింది?
నితిన్ తో కలిసి పనిచేసిన సమయం నాకు చాలానచ్చింది. నటుడిగా ఎంతో పరిణితి సాధించాడు. ఈ సినిమాలో చాలా బాగా చేశాడు
5. ఈ సినిమాకు ఆదా శర్మనే ఎందుకు ఎంచుకున్నారు?
మేము చాలా మండి అమ్మాయిలను ఆడిషన్లు చేశాం. కానీ అదాను చూశాక ఈ పాత్రకు ఆమే సరిపోద్దని నిర్ణయించాం
6. ఈ సినిమాలో విజువల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీటిపై మీరు తీసుకున్న శ్రద్ధ ఏమిటి?
సినిమా ఇంత అందంగా వచ్చిందంటే దానికి అమోల్ రథోడ్ యే కారణం. అతనితో నాకిది నాలుగవ సినిమా. అతను ఈ సినిమాకు పనిచేసిన తీరు చూశాక మైండ్ బ్లాక్ అయ్యింది.
7. ఈ సినిమా ప్రధమార్ధం అంతా ముద్దు చుట్టూ తిరుగుతుంది. కానీ ఎక్కడా ముద్దు కనబడధు. దీనికేమన్నా ప్రత్యేక కారణం వుందా?
నేను ఆ సన్నివేశాన్ని సినిమాలో పెట్టాలని చాలా ప్రయత్నించాను. కానీ సెన్సార్ సభ్యులను దృష్టిలో పెట్టుకుని దాని జోలికి వెళ్లలేదు
8 ఈ సినిమాను మీరే నిర్మించాలని ఎందుకు అనుకున్నారు?
నేను గతంలో కూడా కొన్ని సినిమాలను నిర్మించాను. కాకపోతే ఈ మధ్య కాస్త విరామం తీసుకున్నా. ఇకపై నా బ్యానర్ లో నిర్మాతగా సినిమాలు తీస్తుంటా
9. మీకు ఎటువంటి సినిమాలు నిర్మించాలని వుంటుంది?
నేను సినిమాను కొత్త పంధాలో నడిపించగల యువ దర్శకులను తెరకు పరిచయం చెయ్యాలనుకుంటున్నా. కొన్ని రోజులుపోయాక నేను సినిమాలను మాత్రమే నిర్మిస్తు రచయితగా కొనసాగుతా
10. ప్రతీ ఒక్కరూ సినిమా అంతే సంవత్సరం కాలం తీసుకుంటారు. మీరు అంత త్వరగా ఎలా పూర్తిచేస్తారు?
ఏమో. ఎందుకో తెలీదు గానీ నేను సినిమాలను చాలా వేగంగా పూర్తి చేస్తా. దానిని నేను ఉపయోగించుకోవాలి అనుకుంటున్నా
11. మహేశ్ తో మీ తదుపరి సినిమా ఎలా వుందబోతుంది?
ప్రస్తుతానికి ఇంకా ఏమి ఆలోచించలేదు . కాస్త విరామం తరువాత రాయడం మొదలుపెడతా
CLICK HERE FOR ENGLISH INTERVIEW