సుశాంత్ హీరోగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమా ‘అడ్డా’ మంచి విజయాన్ని సాదించింది. ఈ సినిమా విజయంతో సుశాంత్ కు టాలీవుడ్ లో మంచి బ్రేక్ వచ్చింది. ఈ సినిమా నిర్మాత చింతలపూడి శ్రీనివాస్ తో ఈ రోజు కాసేపు ముచ్చటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ‘అడ్డా’ సినిమా విజయానికి సంబందించిన విషయాలను వారి భవిష్యత్తు ప్రణాళికలను తెలియజేశాడు.
1. ప్రశ్న : మీరు నిర్మించిన ‘అడ్డా’ సినిమాకి రెస్పాన్స్ ఎలా వుంది ?
స : ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ సినిమా ప్రేక్షకులను చాలా తొందరగా ఆకట్టుకుంది.
2. ప్రశ్న: ఈ సినిమాలో సుశాంత్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది ?
స : ఈ సినిమాలో సుశాంత్ చాలా క్లిష్టమైన రోల్ ని ఎంతో సునాయాసంగా చేశాడు. తను నటుడిగా చాలా ఇంప్రూవ్ అయ్యాడు. రాబోవు సినిమాలో ఇంకా మంచి నటనతో అందరి మనసులు గెలుచుకుంటాడు.
3. ప్రశ్న: ఈ సినిమాలో ఏది హైలైట్ అని అనుకుంటున్నారు ?
స: నిసందేహంగా ఈ సినిమాకు అనూప్ రూబెన్స్ అందించిన సంగీతం పెద్ద ప్లస్. ఈసినిమా ఆడియో మంచి విజయాన్ని సాదించింది. అలాగే ఈ సినిమా విజయాన్ని సాదించడానికి కూడా అది చాలా ఉపయోగపడింది.
4. ప్రశ్న: ఇప్పటి వరకు మీకు ‘అడ్డా’ సినిమాతో ఎటువంటి బిజినెస్ లబించింది ?
స : ఈ సినిమా మాకు డీసెంట్ బిజినెస్ ని అందించింది. సిమాంద్రలో జరుగుతున్న ఉద్యమాల వల్ల ఈ సినిమాకు కాస్త సమస్య ఏర్పడింది. కానీ మిగిలిన అన్ని చోట్లనుండి మంచి ప్రాఫిట్ వచ్చింది.
5. అక్కినేని కుటుంబం నుండి ఎటువంటి స్పందన లబించింది. నాగార్జున ఈ సినిమాని చూశారా ?
స : అవును! ఈ సినిమాని వారందరూ చూశారు. అందరికి చూడగానే నచ్చింది. త్వరలో జరుగబోయే ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ లో ఆయన దీని గురించి మాట్లాడుతారు.
6. ప్రశ్న: సినిమా చాలా రిచ్ గా కనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ గురించి తెలియజేస్తారా ?
స : ఈ సినిమాను మేము ఎక్కడ రాజీపడకుండా నిర్మించాము. కొన్ని పాటలను చాలా అసాదరణమైన ప్రదేశాలలో చిత్రికరించాము. ఉదాహరణకు ఒక పాటని ఇటలీ బోర్డర్స్ లో చిత్రికరించాము. అలాగే మరొక పాటని ప్రాన్స్ లోని కొన్ని ప్రదేశాలలో చిత్రికరించాము.
7. ప్రశ్న: మీరు తీసిన ‘కరెంట్’ సినిమా వచ్చి నలుగు సంవత్సరాలు అవుతుంది. ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది ?
స : నిజం చెప్పాలంటే రెండు సంవత్సరాలు మంచి కథ కోసం చూశాను. సినిమా నిర్మించడానికి రెండు సంవత్సరాలు పట్టింది. అందుకే ఇంత గ్యాప్ వచ్చింది. ఇంత గ్యాప్ తరువాత తీసిన ఈ సినిమాకు మంచి రిసల్ట్ వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది.
8. ప్రశ్న : డైరెక్టర్ కార్తిక్ రెడ్డి గురించి చెప్పండి ?
స : ఈ క్రెడిట్ అంత కార్తిక్ కి చెందుతుంది. ఈ కథవిని మేమందరం మంచి విజయం సాదిస్తుందని నమ్మం. తను సినిమా తీస్తున్న విదానం చూసి ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని ఇంకా బలమైన నమ్మకం కలిగింది.
9. ప్రశ్న : మీరు భవిషత్తులో ఏ ఏ సినిమాలు తీయనున్నారు ?
స : అడ్డా సినిమా షూటింగ్ సమయంలో ప్రభుదేవా తమ్ముడు విష్ణు దేవా ఒక స్క్రిప్ట్ ని చెప్పాడు. అది మాకు నచ్చింది. ప్రస్తుతం సుశాంత్ హీరోగా ఒక ద్విబాష చిత్రాన్ని నిర్మించాలని అనుకుంటున్నాము.
CLICK HERE FOR ENGLISH INTERVIEW