ఇంటర్వ్యూ : కార్తీ – నేను అంత రెబల్ కాదండి..

ఇంటర్వ్యూ : కార్తీ – నేను అంత రెబల్ కాదండి..

Published on Dec 17, 2013 9:00 PM IST

Karthi
తమిళ హీరో అయిన కార్తీ ‘యుగానికి ఒక్కడు’, ‘ఆవారా’, ‘నా పేరు శివ’ లాంటి సినిమాలతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. తమిళంతో పాటు తెలుగులో కూడా మార్కెట్ అమితంగా పెంచేసుకున్న కార్తీ తన ప్రతి సినిమాని తెలుగులో కూడా రిలీజ్ చేస్తాడు. కార్తీ హీరోగా నటించిన సినిమా ‘బిరియాని’. హన్సిక హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 20న తెలుగు, తమిళంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా కార్తీతో కాసేపు ముచ్చటించాము. చాలా ఫ్రెండ్లీగా జోక్స్ వేస్తూ మాట్లాడే కార్తీ బిరియాని సినిమా గురించి, తన రాబోయే సినిమాల గురించి మాతో పంచుకున్న విశేషాలు మీకోసం..

ప్రశ్న) మీ మూవీ ‘బిరియాని’ గురించి ఏం చెప్తారు?

స) ఎంతో రియలిస్టిక్ గా ఉండే స్టైలిష్ మూవీ ‘బిరియాని’. డైరెక్టర్ వెంకట్ ప్రభు స్టైలిష్ ట్రీట్ మెంట్ ఉండే ఈ సినిమాలో నేను ప్లే బాయ్ పాత్రలో కనిపిస్తాను. బిరియాని సినిమా అన్ని రకాల ప్రేక్షకులని మెప్పిస్తుంది. సెకండాఫ్ మొత్తం థ్రిల్లర్ లా ఉంటుంది. అలాగే సినిమా ఎమోషన్స్ కి కూడా ప్రాధాన్యత ఉంది మరియు యాక్షన్ ఎపిసోడ్స్ బాగా రియలిస్టిక్ గా ఉంటాయి.

ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

స) ఈ సినిమాలో నా లుక్ చాలా స్టైలిష్ గా ఉంటుంది. నేను అమ్మాయిలని ఇష్టపడతాను. అమ్మాయిలకేమో నా బిహేవియర్ అంటే ఇష్టం. నా పాత్రకి ఓ అలవాటు ఉంటుంది. మందు తాగిన తర్వాత తినడానికి కచ్చితంగా బిరియాని ఉండి తీరాలి. అలా ఓ రోజు బిరియాని కోసం వెతుకుతుండగా కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. దాని వల్ల నా లైఫ్ ఎలా టర్న్ అయ్యిందనేది మీరు వెండితెరపై చూడాలి.

ప్రశ్న) మీరు ఈ మూవీలో ప్లే బాయ్ పాత్ర చేసారు. మీరు రియల్ లైఫ్ లో కూడా ప్లే బాయ్ ఏనా?

స) (నవ్వులు) లేదు లేదండి. నా రియల్ లైఫ్ లో నేను మందు కూడా తాగను.

ప్రశ్న) ఇప్పటివరకు మీరు ఎక్కువ యాక్షన్ సినిమాలే చేసారు కదా?

స) నాకు యాక్షన్ సినిమాలంటే ఇష్టం. చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి యాక్షన్ సీక్వెన్స్ లు ఎక్కువ ఉన్న సినిమాలు బాగా చూసేవాన్ని. కానీ రియల్ లైఫ్ లో మాత్రం నాకు ఇష్టం ఉండదు. నేను చాలా సాఫ్ట్ పర్సన్. నేను మా తల్లితండ్రులు ఏం చెప్తే అది చేస్తాను. అలాగే నేను రెబల్ పర్సన్ ని కాదండి.

ప్రశ్న) ఈ మూవీలో హన్సిక ఎలాంటి పాత్ర చేసింది?

స) ఈ సినిమాలో హన్సిక ఓ జర్నలిస్ట్ పాత్రలో కనిపిస్తుంది. కాస్త కష్టమైన పాత్ర. మా ఇద్దరి మధ్య అంత రొమాన్స్ ఉండదు, చెప్పాలంటే ఈ సినిమా మా ఇద్దరి లవ్ బ్రేక్ అప్ తోనే మొదలవుతుంది. నేను మొదటి సారి హన్సికతో కలిసి పనిచేసాను.

ప్రశ్న) మీరు తెలుగు, తమిళ్ లో రెండు చోట్లా మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. కానీ తెలుగు, తమిళ ప్రేక్షకుల అభిరుచులు వేరు. కానీ దాన్ని మీరలా మేనేజ్ చేస్తున్నారు?

స) అవును, మీరన్న సమస్య అయితే ఉంది. సినిమాలో ఎప్పుడైతే మంచి ఎమోషన్స్ ఉంటాయో అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు రెండు భాషల్లోనూ ఆడుతుంది. కానీ కొన్ని సినిమాలు రెండు భాషల్లో ఆడవు. ఉదాహరణకి.. శకుని సినిమా తమిళ్ లో బాగా ఆడింది అలాగే అక్కడి వారు మేము చూపించిన పొలిటికల్ కంటెంట్ కి కనెక్ట్ అయ్యారు. కానీ నాపేరు శివ లాంటి సినిమాకి ఇలాంటి సమస్య రాలేదు. కావున నేను ఎమోషన్స్ ఉండే కథలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

ప్రశ్న) రొమాంటిక్ సీన్స్ మీరు కంఫర్టబుల్ గా చేయగలరా?

స) లేదండి. నేను రొమాంటిక్ సీన్స్ కి ఒప్పుకోను. ఆ విషయంలో చాలా క్లియర్ గా ఉంటాను. ఇప్పటి వరకూ నేను లిప్ కిస్ సీన్స్ కి ఒప్పుకోలేదు. ఇప్పటికీ చాలా మంది డైరెక్టర్స్ ‘హీరోయిన్స్ కి లేని ఇబ్బంది మీకు ఏంది సార్’ అంటుంటారు(నవ్వులు).

ప్రశ్న) వెంకట్ ప్రభు వర్క్ విషయంలో మీరు హ్యాపీగా ఉన్నారా?

స) అవును. ‘బిరియాని’ సినిమా వెంకట్ ప్రభు కెరీర్లో బెస్ట్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాను. సినిమాలోని ప్రతి పాయింట్ లోనూ ఓ లాజిక్ ఉంటది. ఫైట్స్ వస్తున్నప్పుడు ప్రేక్షకుల దృష్టి పక్కు వెళ్లదు. నేను ఈ సినిమాలో పోలీసులను కొట్టను, నా జీవితంలోని సంఘటనల వల్ల అలా జరుగుతుంది. వెంకట్ ప్రభు సాధ్యమైనంత వరకు రియలిస్టిక్ గా తీయడానికి ప్రయత్నించాడు. అలాగే పాత్రల మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా సహజంగా ఉంటాయి. ఇటీవలే ‘అత్తారింటికి దారేది’ సినిమా చూసాను. అందులో కూడా పాత్రల మధ్య వచ్చే సీన్స్ చాలా సహజంగా ఉంటాయి.

ప్రశ్న) డైరెక్ట్ తెలుగు సినిమాలో ఎప్పుడు నటించబోతున్నారు?

స) నేను మంచి కథ కోసం ఎదురు చూస్తున్నాను. కొంతమంది కొత్తవారి నుండి కొన్ని కథలు విన్నాను. కానీ అవేమీ అంతగా అనిపించలేదు. మంచి కథ దొరకగానే ఓ సినిమా చేస్తాను.

ప్రశ్న) ‘బిరియాని’ సినిమాలో ఇంకేమేమి హైలైట్స్ ఉన్నాయి?

స) యువన్ శంకర్ రాజ సూపర్బ్ మ్యూజిక్ అందించాడు. అతని మ్యూజిక్ సినిమాని బాగా ఎలివేట్ చేసింది. నాజర్ గారు ఈ సినిమాలో ఓ చాలెంజింగ్ రోల్ చేసారు. పంజాబ్ లో బాగా ఫేమస్ అయిన మండి తఖర్ గ్లామరస్ పాత్రలో కనిపించనుంది.

ప్రశ్న) మీ గత రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. ఈ మూవీ విషయంలో ఏమన్నా స్పెషల్ కేర్ తీసుకున్నారా?

స) సౌత్ ఇండియాలో నా సినిమాలకి మంచి మార్కెట్ ఉన్నందు వల్ల నేను కచ్చితంగా నా సినిమాల విషయంలో స్పెషల్ కేర్ తీసుకోవాలి. సినిమా సక్సెస్ అవుతుందని బాగా నమ్ముతున్నాను. ఇక నుంచి మంచి సినిమా కోసం ట్రై చెయ్యడం మానేసి, మంచి సినిమాలనే అందించాలి. నా గత సినిమాల్లో నా వరకు నేను పాత్రకి న్యాయం చేసాను, అలాగే మంచి కథనే ఎన్నుకున్నా కానీ అది సరిగా తీయకపోవడం వల్ల సినిమా ఫెయిల్ అయ్యింది.

ప్రశ్న) మీరు చేస్తున్న తదుపరి సినిమాలేమిటి?

స) ప్రస్తుతం అట్టకతి డైరెక్టర్ రంజిత్ డైరెక్షన్లో ఓ మాస్ అండ్ రియలిస్టిక్ సినిమా చేస్తున్నాను. ఈ సినిమా పేదలకు గవర్నమెంట్ ఇల్లులు కట్టిస్తామన్న ప్రాజెక్ట్ చుట్టూ తిరుగుతుంది. చెప్పాలంటే నార్త్ చెన్నై లోని ఓ స్లమ్ ఏరియాలో జరుగుతుంది. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ప్రత్యేకమైనది. ఇలాంటి స్టొరీని ఇప్పటికి ఒక్కరు కూడా ట్రై చెయ్యలేదని గర్వంగా చెప్పగలను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి.. బిరియాని సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని కార్తీకి అల్ ది బెస్ట్ చెప్పాము.

ఇంటర్వ్యూ : మహేష్ ఎస్ కోనేరు

అనువాదం : రాఘవ

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు