రాబోయే తరానికి మంచి నిర్మాత పరుచూరి కిరీటి. “సింహ” చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న ఈ నిర్మాత. త్వరలో ఇతని మరో చిత్రం “నా ఇష్టం” చిత్రం విడుదల కు సిద్దమయ్యింది. ఈ సందర్భంగా అయన ఇంటర్వ్యూ తీసుకున్నాం. అతని నిరాడంబరత మాకు ఆశ్చర్యం కలగచేసింది. మీకోసం అతనితో జరిపిన ఇంటర్వ్యూ…
ప్రశ్న) మీ మొదటి చిత్రం మాస్ చిత్రం మేరి రెండవ చిత్రం ప్రేమ కథా చిత్రం ముందే అనుకోని చేశారా?
(నవ్వుతు) రెండు . మొదటి చిత్రం బాల కృష్ణ గారిహో చెయ్యాలి అనుకున్నపుడు అయన నుండి ప్రేక్షకులు మాస్ చిత్రాన్నే కోరుకుంటారు మరి రెండవ చిత్రం రానతో చేస్తున్నపుడు ప్రేమకథ చిత్రం చెయ్యటానికి మంచి అవకాశం లా అనిపించింది ఈ చిత్రం చాలా బాగా వచ్చింది.
ప్రశ్న) చిత్రం లో మీకు నచ్చిన అంశాలేవి?
ఈ చిత్ర కథ నాకు చాలా బాగా నచ్చింది. చిత్రం ఆసాంతం సానుకూలంగా నడుస్తుంది. మాములుగా ఎవరయినా దర్శకులుకి మేము 20 నిమిషాలు మాత్రమే సమయం కేటాయిస్తం కథ చెప్పడానికి కాని ఈ చిత్ర దర్శకుడు ప్రకాష్ కథ చెప్పడం మొదలు పెట్టాక మూడు గంటల పాటు విన్నాను చిత్ర కథ అంత బాగుంది మరి.
ప్రశ్న) ఈ చిత్రం మీద మీకున్న అంచనాలేంటి?
ఈ చిత్ర కథ అద్బుతంగా ఉంది చిత్రం త్రికోణ ప్రేమకథ నేఫధ్యంగా ఉంటుంది మాములుగా యువత ల ప్రతి ఒక్కరు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని ఉంటారు కాబట్టి ఈ చిత్రం యువతకి బాగా దగ్గరవుతుంది. ఈ చిత్రాన్ని యువత ఆదరిస్తారని మాకు నమ్మకముంది.
ప్రశ్న)రానా తో కలిసి పని చెయ్యటం ఎలా అనిపించింది?
రానా మంచి నటుడు మరియు మంచి వ్యక్తి కూడా. వెంకటేష్ గారి నుండి మంచి మనసుని మరియు మంచి లక్షణాలను ఒంటబట్టించుకున్నారు ప్రకాష్ మరియు రానా అప్పుడప్పుడు 18 గంటల పాటు పని చేసేవారు ఈ విషయం చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. వారు వాళ్ళ పనిని ప్రేమించారు. ఈ చిత్రం వల్ల నేను రానా మంచి స్నేహితులయ్యాము.
ప్రశ్న)మీ అభిమాన కథానాయకులు ఎవరు?
మహేష్ బాబు మరియు ఎన్.టి.ఆర్. నాకు వీరితో చిత్రాలు చెయ్యాలనేది ఒక కల. త్వరలో వారితో చిత్రాలు నిర్మిస్తాను.
ప్రశ్న)కథానాయిక ఎవరు?
(నవ్వుతు) కాజల్. తను చాలా అందంగా ఉంటుంది
ప్రశ్న) చాలా చిన్న వయసులో చిత్ర నిర్మాణం లో కి వచ్చారు దీనికి కారణమా ఏంటి. ఇది కాకుండా ఏం చేస్తుంటారు?
నాన్న కన్స్త్రక్షం వ్యాపారం లో కి ప్రవేశించారు. నాకు మొదటి నుండి చిత్ర పరిశ్రమ అంటే పిచ్చి యువత రాజకీయాలు లో కి రవళి అంటుంటారు నేను ఎందుకు చిత్ర నిర్మాణం లో కి రాకూడదు అనుకున్నాను? వచ్చేసాను. ప్రస్తుతం నేను ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. నాకు క్రికెట్ ఆడటం అంటే చాలా ఇష్టం.నాకు నటించడం అంటే చాలా ఇష్టం భవిష్యత్తు లో నటిస్తానేమో మీరు నన్ను యాంకర్ గా చూస్తారు.
ప్రశ్న)కథను ఎలా ఎంపిక చేసుకుంటారు?
ముందు నేను కథ విన్నాక నాకు నచ్చితే నాన్నగారికి పంపిస్తూ ఉంటాను. మాములుగా కథలను నేనే వింటుంటాను.
ప్రశ్న)చిత్ర పరిశ్రమ లో స్నేహితులు?
నారా రోహిత్ మరియు రానా మంచి స్నేహితులు.
ప్రశ్న)భవిష్యతు చిత్రాల గురించి.
వేకటేశ్ గారితో “షాడో” చిత్రం చెయ్యబోతున్నాం ఇది కాకుండా వరుస చిత్రాలు ఉన్నాయి త్వరలో ప్రకటిస్తాం.
దీనితో ఇంటర్వ్యూ పూర్తయ్యింది. ఈ యువ నిర్మాతకు విజయం దక్కాలని కోరుకుందాం.
అనువాదం : రv