‘సంతోషం’ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన దశరథ్ ఆ తర్వాత కుటుంబ కథా చిత్రాల దర్శకుడిగా పేరుతెచ్చుకున్నాడు. ‘Mr పర్ఫెక్ట్’ లాంటి సూపర్ హిట్ అందుకున్న తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని తనకు తొలి హిట్ అందించిన కింగ్ నాగార్జునతో ‘గ్రీకు వీరుడు’ సినిమాని తీసారు. ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడటానికి చాలా సాఫ్ట్ గా ఉంటూ సున్నితమైన మస్తత్వం కలిగిన దశరథ్ ఈ సినిమా విడుదల సందర్భంగా కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు మీ కోసం …
ప్రశ్న) ‘గ్రీకు వీరుడు’ సినిమా ఎలా సెట్స్ పైకి వెళ్ళింది?
స) శివ ప్రసాద్ రెడ్డి గారు, నేనూ కలిసి నాగార్జున గారితో ఓ సినిమా చెయ్యాలనుకున్నాము. మేము నాగర్జున గారితో పూర్తి కుటుంబ కథా చిత్రం చెయ్యాలి, అది కూడా ఒక పాత్ర చుట్టూ తిరిగే కథని తీయాలనుకున్నాం. దాంతో ‘గ్రీకు వీరుడు’ సినిమా సెట్స్ పైకి వెళ్ళింది.
ప్రశ్న) సినిమా టైటిల్ ‘గ్రీకు వీరుడు’ కి, నాగార్జున పాత్రకి మధ్య ఏమన్నా సంబంధం ఉందా?
స) ఈ సినిమాలో నాగార్జున గారు ఎన్నారై ఈవెంట్ మేనేజర్ గా కనిపిస్తారు. ఈవెంట్ మేనేజర్ పాత్రకి – ‘గ్రీకు వీరుడు’ టైటిల్ కి ఎలాంటి సంబందమూ లేదు. నాగార్జున గారి ఇమేజ్ కి సూట్ అవుతుందని ఈ టైటిల్ ని ఎంచుకున్నాము. ముందుగా ఈ సినిమాకి ‘లవ్ స్టొరీ’ అనే టైటిల్ అనుకున్నాం కానీ అది ఉన్న ఇమేజ్ ని కాస్త దెబ్బతీసేలా ఉందని టైటిల్ మార్చాము. ఈ సినిమాలో ఒక్క లవ్ గురించి మాత్రమే కాదు కుటుంబ బాందవ్యాలను కూడా చూపించాము.
ప్రశ్న) మీ ‘స’ సెంటిమెంట్ టైటిల్స్ కి ఏమయ్యింది, కొత్త టైటిల్స్ పెడుతున్నారు?
స) ‘నాకు ఎలాంటి టైటిల్ సింటిమెంట్ లేదు’. ‘సంతోషం’ సినిమా తర్వాత ‘సంబరం’ సినిమా రావడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. నేను తీసిన ‘Mr పర్ఫెక్ట్’ సినిమాలో ‘స’ ని ఉపయోగించలేదు. కాబట్టి మీరే ఆ కోణంలో చూస్తున్నారని అనుకోవాలి.
ప్రశ్న) మీ అన్ని సినిమాల్లో చివరికి హీరో తన మనస్తత్వాన్ని మార్చుకుంటాడు. అలా చూపించడానికి ప్రత్యేక కారణం ఏమన్నా ఉందా?
స) మనం నమ్మే కొన్ని విషయాలతో మన లైఫ్ ని మొదలు పెడతాము, కానీ మనకు ఎదురయ్యే అనుభవాల వల్ల మనకు తెలియకుండానే మారిపోతుంటాము. ఇది చాలా కామన్ గా జరిగేదే, నా సినిమాల్లో వాటిని చూపించడం అంటే నాకు చాలా ఇష్టం. ప్రతిఒక్కరూ తమ లైఫ్ లో జరిగిన అనుభవాలను చెప్పాలనుకుంటారు అదే నేనూ చేస్తున్నాను.
ప్రశ్న) ఈ సినిమాలో నాగార్జున గారి నుంచి మేము ఏమేమి ఆశించవచ్చు?
స) ఈ సినిమాకి ఉన్న ఏకైక బలం నాగార్జున గారు మాత్రమే. అతని పాత్ర, లుక్, పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి ప్రధాన హైలైట్స్. ఈ సినిమాలో నాగ్ ని గ్లామరస్ అవతారంలో చూస్తారు.
ప్రశ్న) నయనతారతో పని చేయడం ఎలా ఉంది?
స) నయనతార ఎంతో క్రమశిక్షణ ఉన్న నటి. తనతో షూటింగ్ చేసిన ప్రతి రోజూ చాలా సరదాగా గడిచేది. చెప్పిన టైంకి సెట్స్ కి వచ్చేస్తుంది, పక్కా ప్రొఫెషనల్ అంతే కాకుండా చాలా మంచి మనిషి. ‘నయనతారతో 100 సినిమాలు అయినా చాలా సౌకర్యంగా చెయ్యొచ్చు’.
ప్రశ్న) చూస్తుంటే మీకు విశ్వనాథ్ గారంటే బాగా ఇష్టం అనుకుంటా.. ప్రతి సినిమాలోనూ ఉంటారు..
స) విశ్వనాథ్ గారు చాలా మంచి వ్యక్తి. ఆయన ఒక డైరెక్టర్ గా పక్కన పెడితే చాలా మంచి నటుడు. ప్రతిసారి ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయనంటే నాకు చాలా ఇష్టం.
ప్రశ్న) ఈ సినిమా స్క్రిప్ట్ కి కోనా వెంకట్ – గోపీ మోహన్ లు హెల్ప్ చేసారా?
స) ఈ సినిమా స్క్రిప్ట్ లో కొన్ని చోట్ల కోనా వెంకట్ – గోపీ మోహన్ లు సాయం చేసారు. వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ప్రశ్న) ఈ సినిమాలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని మేము ఆశించవచ్చా?
స) ఈ మధ్య ప్రేక్షకులు సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా కోరుకుంటున్నారు. అది దృష్టిలో పెట్టుకునే కామెడీ మిస్ అవ్వకుండా ‘గ్రీకు వీరుడు’ రాసుకున్నాం. సినిమాలో ఎంటర్టైన్మెంట్ బాగా ఉంటుంది.
ప్రశ్న) ఈ సినిమాలో బ్రహ్మానందం కి ప్రత్యేకమైన పాత్ర ఉన్నట్టుంది?
స) ఈ సినిమాలో బ్రహ్మానందం డాక్టర్ గా కనిపిస్తాడు. బాగా అహంభావం కలిగిన వ్యక్తి, సినిమాలో ఇతని పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంది.
ప్రశ్న) మీ సినిమాల్లో ఎక్కువ సీరియస్ గా కనపడే విలన్స్ ఉండరు. దానికేమన్నా ప్రత్యేక కారణం ఉందా?
స) అది నేను ఎంచుకునే స్క్రిప్ట్ ని బట్టే ఉంటుంది. నేను ఎక్కువగా కుటుంబ కథా చిత్రాలనే ఎంచుకుంటాను, అందుకే సీరియస్ విలన్స్ ని చూపించే ఆస్కారం పెద్దగా ఉండదు. ” మన కుటుంబంలో ఎంతమంది మర్డర్లు చేస్తారండి?’.
ప్రశ్న) ‘గ్రీకు వీరుడు’ సినిమా నుంచి ప్రేక్షకులు ఎమీమి ఆశించవచ్చు?
స) ‘గ్రీకు వీరుడు’ అనేడి ఒక పరిణతి చెందిన ఇద్దరి మధ్య జరిగే లవ్ స్టొరీ. అంటే ఈ లవ్ స్టొరీ లోని పాత్రల మధ్య ఒకరినొకరు చూసి ఆకర్షణకి లోనవ్వడం లాంటివి ఉండవు. మృదువైన ప్రేమ కథలను డీల్ చేయడం చాలా కష్టమైన పని. ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన నాగార్జున గారికి, శివప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
‘గీకు వీరుడు’ సినిమా విజయవంతం అవ్వాలని దశరథ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మా చిట్ చాట్ ని ముగించాము.
CLICK HERE TO ENGLISH INTERVIEW