షూటింగ్లో గాయపడిన ఆమిర్ ఖాన్.. అయినా ఆగలేదట

షూటింగ్లో గాయపడిన ఆమిర్ ఖాన్.. అయినా ఆగలేదట

Published on Oct 19, 2020 9:50 PM IST

బాలీవుడ్ విలక్షణ నటుడు ఆమిర్ ఖాన్ ప్రస్తుతం ఆస్కార్ అవార్డుకు ఎంపికైన హాలీవుడ్ చిత్రం ‘ఫారెస్ట్ గంప్’ సినిమా ఆధారంగా ‘లాల్ సింగ్ ఛద్దా’ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం ఇటీవలే షూటింగ్ మొదలైంది. అయితే ఢిల్లీలో షూటింగ్ జరుగుపుతుండగా ఆమిర్ ఖాన్ గాయపడ్డట్టు వార్తలు వస్తున్నాయి. ఒక కీలక సన్నివేశం షూటింగ్ జరుపుతుండగా ఆమిర్ ఖాన్ కిండపడగా ఆయన పక్కటెముకలకు గాయమైందట.

గాయం బాధిస్తున్నా ఆమిర్ ఖాన్ మాత్రం షూటింగ్ ఆపలేదట. ఎందుకంటే చిత్రీకరణ కోసం నిర్మాతలు భారీ మొత్తం ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేశారు. అందుకే
గాయం బాధిస్తున్నా ఆమిర్ షూట్ వాయిదా వేయలేదట. వెంటనే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ తీసుకుని సన్నివేశం పూర్తిచేశారట. ఆమిర్ ఖాన్ గాయపడిన వార్త తెలిసిన ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన హీరో ఎలా ఉన్నారో వాకబు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఆయనకు పెద్దగా ఇబ్బందేమీ లేదని, బాగానే ఉన్నారని బాలీవుడ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇకపోతే అద్వైత్ చందన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదలచేయనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు