క‌ల్కి: ‘మరియ‌మ్’గా ఎంట్రీ ఇచ్చిన‌ న‌టి శోభ‌న

పాన్ ఇండియా ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘క‌ల్కి 2898 AD’ మ‌రో 8 రోజుల్లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడా అని అభిమానులు ఎంతో ఆస‌క్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో చిత్ర యూనిట్ బిజీగా మారింది.

తాజాగా ఈ సినిమాలోని ఓ కీల‌క పాత్ర‌ను ఇంట్రొడ్యూస్ చేశారు మేక‌ర్స్. ‘మ‌రియమ్’ అనే పాత్ర‌లో న‌టి శోభ‌న న‌టిస్తున్న‌ట్లుగా ఓ పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. “ఆమె లాగే త‌న పూర్వీకులు కూడా ఎదురుచూశారు..” అంటూ ఈ పోస్ట‌ర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయ‌డంతో ఆమె పాత్ర ఏమై ఉంటుందా అనే ఆస‌క్తి అభిమానుల్లో నెల‌కొంది.

ఇక ఈ సినిమాలో ప్ర‌భాస్ అల్ట్రా స్టైలిష్ లుక్ తో స్ట‌న్ చేయ‌నున్నాడు. కాగా ఈ సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాసన్, దీపిక ప‌దుకొనె, దిశా ప‌టాని, మృణాల్ ఠాకూర్ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. సంతోష్ నారాయ‌ణ‌న్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్ పై అశ్విని దత్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.