“ఐఎండిబి” లో కూడా బన్నీ మ్యానియా..టాప్ లిస్ట్ లో!

“ఐఎండిబి” లో కూడా బన్నీ మ్యానియా..టాప్ లిస్ట్ లో!

Published on Dec 5, 2020 1:24 PM IST

ఇప్పటి వరకు ఎలాంటి పాన్ ఇండియన్ సినిమాను కూడా చెయ్యకుండా పాన్ ఇండియన్ లెవెల్లో తన పేరును మారుమోగించిన ఏకైక తెలుగు హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అనే చెప్పాలి. తన లాస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో” సక్సెస్ తో మరింత స్థాయిలో బన్నీ పేరు మారుమోగింది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ క్లీన్ ఫామిలీ ఎంటర్టైనర్ తోనే అదిరిపోయే రీసౌండ్ చేసిన బన్నీ ఇంకా తన మ్యానియా ను కొనసాగిస్తున్నాడు. లేటెస్ట్ గా ప్రసిద్ధ సెట్ “ఐఎండిబి”(ఇంటర్నెట్ మూవీ డేట్ బేస్)లో ఈ ఏడాది వచ్చిన అన్ని ముఖ్య భాషల చిత్రాలు అందులోను హాలీవుడ్ సినిమాలు కూడా ఉన్నాయి.

ఆ సినిమాల తాలూకా ట్రైలర్స్ ను ఎక్కువగా చూసిన టాప్ 20 సినిమాల లిస్ట్ లో తెలుగు నుంచి ఒక్క అల్లు అర్జున్ నటించిన “అల వైకుంఠపురములో” ట్రైలర్ నిలిచి సత్తా చాటింది. ఎన్నో హాలీవుడ్ సినిమాలు ఈ లిస్ట్ లో ఉన్నాయి.

అలాగే మన ఇండియన్ సినిమా నుంచి హిందీ చిత్రం “భాగీ 3” మళ్ళీ “అల వైకుంఠపురములో” సినిమాలకే అందులో చోటు దక్కడం విశేషం. ఈ లిస్ట్ పై ఐఎండిబి వారు ఒక థ్రెడ్ ను కూడా సోషల్ మీడియాలో విడుదల చేశారు. మొత్తానికి మాత్రం బన్నీ మ్యానియా వేరే లెవెల్లో ఉందని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు