కథా బలం ఉన్న ‘గౌరవం’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో అల్లు శిరీష్. మొదటి సినిమా విమర్శకులను మెప్పించడంతో రెండవ సినిమా తో ప్రేక్షకులను మెప్పించి కమర్షియల్ హిట్ అందుకోవాలనే ఉద్దేశంతో కమర్షియల్ హిట్ డైరెక్టర్ మారుతితో కలిసి చేసిన ప్రయత్నమే ‘కొత్త జంట’. ఈ కొత్త జంట సినిమా మే 1న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా అల్లు శిరీష్ తో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. అల్లు శిరీష్ కొత్త జంట గురించి, తన రాబోయే సినిమాల గురించి పంచుకున్న విశేషాలు మీ కోసం..
ప్రశ్న) ఈ సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి?
స) ఈ సినిమాలో నేను ఒక టీవీ యాంకర్ గా కనిపిస్తాను. బాగా స్వార్ధపరుడైన కుర్రాడు. ఎప్పుడూ తన గురించి, తన ఎదుగుదల గురించి మాత్రమే ఆలోచించే కుర్రాడు. ఇలాంటి ఓ కుర్రాడు ప్రేమలో పడితే అందులో నిజం ఎంత ఉంటదనేదే నా పాత్ర. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే హీరోయిన్ పాత్ర కూడా అలానే ఉంటది. వీరద్దరి మధ్య ప్రేమ పుడితే ఎలాంటి సమస్యలు వస్తాయనేదే ఇందులో చూపించాం.
ప్రశ్న) డైరెక్టర్ గా మారుతితో పనిచేయడం ఎలా ఉంది?
స) నాకు మారుతి గారు గత 6, 7 సంవత్సరాల నుంచి తెలుసు. నేను హీరో కాక ముందు నుంచి, మారుతి గారు డైరెక్టర్ కాక ముందు నుంచి నాకు పరిచయం ఉంది. ఈ చిత్రానికి పనిచేసిన టీం అంతా పరిచయం ఉన్నవాళ్ళే కావడం వల్ల బాగా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాము. మారుతితో పనిచేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది.
ప్రశ్న) ఈ సినిమాలో చిరంజీవిగారి పాట రీమిక్స్ చేయాలనేది ఎవరి ఐడియా? అలాగే మధురిమ గురించి చెప్పండి?
స) ఈ సినిమాలో రీమిక్స్ సాంగ్ చేద్దాం అన్నది మారుతి ఐడియానే. ఐటెం సాంగ్ అన్నప్పుడు కొత్తది ఎందుకు బాగా ఫేమస్ సాంగ్ ని రీమేక్ చేద్దాం అనుకొని ఈ పాటని ఎంచుకున్నాం. ఇక మధురిమ విషయానికి వస్తే.. జస్ట్ ఐటెం సాంగ్ కోసం మాత్రమే తనని తీసుకోలేదు. ఇందులో మధురిమ ఓ కీలక పాత్ర పోషించింది. చెప్పాలంటే ఈ పాట చివర్లో ఓ ఇన్సిడెంట్ జరుగుతుంది. అదే కథని మలుపు తిప్పుతుంది. కథకి అవసరం కాబట్టే ఐటెం సాంగ్ పెట్టాం.
ప్రశ్న) మీ మొదటి సినిమా ‘గౌరవం’ ఫ్లాప్ అవ్వడానికి గల కారణం ఏమిటి? ఆ సినిమా చేసినందుకు మీరేమన్నా బాధపడుతున్నారా?
స) గౌరవం ఫ్లాప్ అవ్వడానికి కారణం సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోవడమే. పాటలు రెండే ఉన్నాయి, ఎక్కడా కామెడీ లేదు, లెంగ్త్ ఎక్కువైంది. ముఖ్యంగా తమిళ చాయలు ఎక్కువ కనపడటం వలన నేటివిటీ ఫ్లేవర్ మిస్ అయ్యింది. కానీ ఈ సినిమా చేసినందుకు నేను చాలా గర్వంగా ఫీలవుతున్నాను. కెరీర్ ప్రకారం చూసుకుంటే ఒక్క సినిమా యాక్టర్ గా మీ భవిష్యత్తుని నిర్ణయించదు. గౌరవంలో మంచి కథ ఉంది కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ అయ్యాయి, అందుకే కొత్త జంటలో మంచి కథకి కమర్షియల్ ఎలిమెంట్స్ జత చేసి తీసాం.
ప్రశ్న) మొదటి సారి ఈ సినిమాలో కామెడీ ట్రై చేసారు. కామెడీ చేయడం కష్టంగా అనిపించిందా?
స) కామెడీ చేయడం పెద్ద కష్టం ఏమీ లేదు. మనిషిలో కామెడీ ఉంటే చాలు అది స్క్రీన్ పై వచ్చేస్తుంది. ఈ సినిమా పరంగా కామెడీ అంటే పిచ్చి పిచ్చిగా ఎక్స్ ప్రెషన్స్ పెట్టేయకుండా ఆ పాత్రకి తగ్గట్టు తన చేష్టలతో నవ్విస్తుంటాడు.
ప్రశ్న) ఈ సినిమాలో అల్లు అరవింద్ గారి ప్రమేయం ఎంత వరకూ ఉంది? అలాగే కొన్ని సీన్స్ రీ షూట్ చేసారని, కొన్ని సీన్స్ తీసేసారని అంటున్నారు. దానిపై మీ కామెంట్?
స) నాన్నగారు ప్రమేయం ఏమీ లేదండి. నాన్నగారితో కథా చర్చలు అయిపోతే మళ్ళీ ఎడిటింగ్ రూం లోనే ఇన్వాల్వ్ అవుతారు. అలాగే రీ షూట్ ఏమీ చెయ్యలేదండీ, మేము అనుకున్న సీన్స్ కొన్ని సరిగా రాలేదు, అందుకే వాటిని మళ్ళీ తీసాం. అలాగే మూవీ మొత్తం చూసాక సంపూర్నేష్ బాబు ట్రాక్ కథకి సంబంధం లేకుండా ఉందని అనిపించి తీసేసాం. ఈ నిర్ణయం టీం అంటా కలిసి తీసుకున్నదే..
ప్రశ్న) అల్లు శిరీష్ బాగా అహంకారి అని బయట టాక్ ఉంది. దానిపై మీ కామెంట్?
స) అసలు ఆ వార్త ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కానీ కొంతమంది అలా ఫీలవుతున్నారు. కానీ నాకు దగ్గరగా ఉన్నవారు మాత్రం నేను అంటే బాగా ఇష్టపడతారు. నేను చేసే దానిమీద బాగా కాన్ఫిడెంట్ గా ఉంటాను అందువల్లే కొంతమంది అలా అనుకుంటున్నారేమో.
ప్రశ్న) గతంలో మీ నాన్నగారి నుంచి నిర్మాణ బాధ్యతలు తీసుకుంటాను అన్నారు. కానీ సడన్ గా హీరో అయిపోయారు. ముందు ముందు నిర్మాణ బాధ్యతలు తీసుకునే చాన్స్ ఏమన్నా ఉందా?
స) ముందు ముందు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటాను. మరో 5, 6 సంవత్సరాల్లో బాధ్యతలు తీసుకోవచ్చు. అసలు సమస్య ఏమిటంటే నిర్మాతగా చేయాలంటే నా వయసు, నా అనుభవం సరిపోవడం లేదు. దానికి చాలా అనుభవం కావాలి. నేను ప్రయత్నించా కానీ అది వర్కౌట్ అవ్వలేదు.
ప్రశ్న) అల్లు అర్జున్ సినిమా చూసారా? అల్లు అర్జున్ అబ్బాయి ఎలా ఉన్నాడు?
స) బన్ని సినిమాని ఆడియన్ గా చాలా బాగా ఎంజాయ్ చేసాడు. మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారు అలాగే నచ్చిన సీన్స్ చెప్పాడు. ఈ సమ్మర్లో మంచి సినిమా అవుతుందని అన్నాడు. ఇక బన్ని బేబీ సన్ చాలా బాగున్నాడు. అందరూ అమ్మ పోలిక అంటున్నారు. కానీ ఇప్పుడే ఏమీ చెప్పలేం.
ప్రశ్న) హీరోగా తదుపరి ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు? అలాగే ఏ డైరెక్టర్ తో అయినా చేయాలనే కోరిక ఉందా?
స) ముందు ముందు మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను. అందరూ అలానే కోరుకుంటారు కానీ నేను కథా బలం ఉన్న సినిమాలు, యూత్ ని ఎక్కువగా ఆకట్టుకునే సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. నా రాబోయే 5 సినిమాలని కూడా యూత్ కి నచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత ప్రయోగాత్మక సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. అలాగే పెద్ద డైరెక్టర్స్ తో చేయాలని లేదు కానీ మారుతి లాంటి యంగ్ డైరెక్టర్స్ తో పనిచేయాలనుకుంటున్నాను.
అంతటితో అల్లు శిరీష్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మా ఇంటర్వ్యూని ముగించాం.