వేసవిని టార్గెట్ చేసిన సూపర్ హిట్ డైరెక్టర్

వేసవిని టార్గెట్ చేసిన సూపర్ హిట్ డైరెక్టర్

Published on Sep 29, 2020 11:50 PM IST


ఈ 2020లో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న కొద్దిమంది దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. మహేష్ బాబుతో ఆయన చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో రావిపూడి స్టార్ డైరెక్టర్ అయిపోయారు. ఈయన తర్వాతి సినిమా ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మామూలుగా లాక్ డౌన్ లేకపోతే ఈపాటికే ఈయన ‘ఎఫ్ 2’ సీక్వెల్ ‘ఎఫ్ 3’ ని స్టార్ట్ చేసి ఉండాల్సింది. కానీ ఆలస్యమైంది.

అయితే ఇప్పుడిప్పుడే షూటింగ్స్ మొదలవుతుండడటం వలన ‘ఎఫ్ 3’ పనులు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే నిర్మాత దిల్ రాజు సినిమా కోసం సపరేట్ ఆఫీస్ తీసుకోవడం జరిగింది. 2021 సంక్రాతి తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ఈలోపు వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరూ ప్రస్తుతం చేస్తున్న సినిమాలను ముగించేస్తారు. సంక్రాంతి తర్వాత మొదలుకాబోయే చిత్రం సరిగ్గా మూడే షెడ్యూళ్లలో పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారట రావిపూడి.

అంటే సినిమాను వేసవికి విడుదలచేసే ఆలోచనలో టీమ్ ఉంది. ఇలాంటి ఫ్యామిలీ ఎంటెర్టైనర్లకు అయితే సంక్రాంతి లేదా వేసవి సెలవులు మంచి సీజన్లు. అందుకే వేసవిని టార్గెట్ పెట్టుకుని ఉంటారు. ‘ఎఫ్ 2’లో రెండు జంటలు కాగా ‘ఎఫ్ 3’ మూడు జంటల కథ. ‘ఎఫ్ 2’లో చేసిన వెంకటేష్ వరుణ్ తేజ్, తమన్నా, మెహ్రీన్ ఈ చిత్రంలో నటిస్తుండగా మూడవ హీరో ఎవరు, అతనికి జోడీ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు