డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “ఆరంభం”

డిజిటల్ ప్రీమియర్ కి సిద్ధమైన “ఆరంభం”

Published on May 21, 2024 11:00 AM IST

ఇటీవ‌ల తెలుగులో ఆరంభం అనే చిత్రం థియేటర్ల లోకి వచ్చింది. ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా రిలీజ్ కి ముందు మంచి బజ్ ను సొంతం చేసుకుంది. కానీ, విడుదలైన తర్వాత, ఆరంభం పేలవమైన సమీక్షలను అందుకుంది, అందువల్ల, అది బాక్సాఫీస్ వద్ద ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే, ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ కి రెడీ అయిపోయింది.

మే 23 నుండి తెలుగు డిజిటల్ ప్లాట్‌ఫారమ్ ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంటుంది. థియేట్రికల్ మరియు OTT విడుదల మధ్య రెండు వారాల కంటే తక్కువ సమయం ఉంది. మోహన్ భగత్, భూషన్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రలు పోషించారు. సుప్రీత సత్యనారాయణ, భూషణ్, లక్ష్మణ్ మీసాల, బొడ్డేపల్లి అభిషేక్, సురభి ప్రభావతి ముఖ్య పాత్రల్లో కనిపించారు. అజయ్ నాగ్ దర్శకత్వం వహించిన ఈ టైమ్ ట్రావెల్ చిత్రాన్ని అభిషేక్ వి తిరుమలేష్ నిర్మించారు. సింజిత్ యర్రమిల్లి స్వరాలు సమకూర్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు