ప‌వ‌ర్ఫుల్ గా ‘శివం భజే’ ఫ‌స్ట్ క‌ట్

యంగ్ హీరో అశ్విన్ బాబు న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శివం భ‌జే’ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో మంచి బ‌జ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా సరికొత్త కాన్సెప్ట్ తో రానుంద‌ని మేక‌ర్స్ తెల‌ప‌డంతో ఈ సినిమా కోసం అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా నుండి తాజాగా ఫ‌స్ట్ క‌ట్ వీడియోను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

మంచి స‌స్పెన్స్, క్రైమ్ థ్రిల్ల‌ర్ అంశాల‌తో పాటు మైథ‌లాజిక‌ల్ అంశాలు కూడా ఈ సినిమాలో ఉండ‌బోతున్న‌ట్లు ఈ ఫ‌స్ట్ క‌ట్ వీడియో చూస్తే అర్థ‌మ‌వుతోంది. శివుడు ఆడించే ఆట‌లో చెడుపై మంచి ఎలాంటి పోరాటం చేయ‌నుంద‌నేది మ‌నకు ఈ సినిమాలో చూపించ‌నున్నారు. ఈ ఫ‌స్ట్ క‌ట్ వీడియోను మేక‌ర్స్ చాలా ప‌వ‌ర్ఫుల్ గా క‌ట్ చేశారు.

ఇక ఈ సినిమాలో అశ్విన్ బాబు పాత్ర ఆడియెన్స్ ను ఆక‌ట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. యాక్ష‌న్ కు ఎలాంటి కొద‌వ లేకుండా ప‌లు యాక్ష‌న్ సీన్స్ కూడా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నాయి. దిగంగ‌నా సూర్య‌వంశీ హీరోయిన్ గా న‌టిస్తోన్న ఈ సినిమాను అప్స‌ర్ డైరెక్ట్ చేస్తున్నారు. మ‌హేశ్వ‌ర్ రెడ్డి మూలి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకు వికాస్ బ‌డిసా సంగీతం అందిస్తున్నారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి