శంకర్ మార్క్ లో “భారతీయుడు 2” ఫస్ట్ సింగిల్ ప్రోమో బిట్

శంకర్ మార్క్ లో “భారతీయుడు 2” ఫస్ట్ సింగిల్ ప్రోమో బిట్

Published on May 21, 2024 6:00 PM IST

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) హీరోగా ఐకానిక్ దర్శకుడు శంకర్ సారథ్యంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా హిట్ చిత్రం “ఇండియన్” తెలుగులో “భారతీయుడు” అందుకున్న విజయం కోసం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సీక్వెల్ గా “భారతీయుడు 2” ఇప్పుడు రాబోతుంది. ఇక ఈ క్రేజీ సీక్వెల్ నుంచి ఆల్రెడీ ప్రమోషన్స్ స్టార్ట్ కాగా మేకర్స్ మొదటి పాటపై అప్డేట్ కూడా అందించారు.

ఇక తాజాగా ఫస్ట్ సింగిల్ తాలూకా ప్రోమోని 3 భాషల్లో రిలీజ్ చేయగా మన తెలుగు బిట్ శంకర్ మార్క్ లో వినిపిస్తోంది అని చెప్పాలి. ఏ ఆర్ రెహమాన్ మొదటి భాగానికి వర్క్ చేశారు కానీ సీక్వెల్ కి అనిరుద్ వర్క్ చేసాడు. అయినా అనిరుద్ మ్యూజిక్ కూడా శంకర్ రేంజ్ లోనే ఉండేలా అనిపిస్తుంది. ప్రోమోలో సాలిడ్ బీట్స్ వినిపిస్తున్నాయి.

ఇక రేపు వచ్చే ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో, అంచనాలు అందుకుంటుందో లేదో చూడాలి. ఇక ఈ సినిమాలో కాజల్, రకుల్ ప్రీత్ సింగ్, సిద్ధార్థ్, వివేక్, బ్రహ్మానందం తదితరులు నటిస్తున్నారు అలాగే లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించగా ఈ జూలై 12న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు