మరో 2 భాషల్లో “భీమా”.. ఓటిటి ఆడియెన్స్ రిగ్రెట్ ఫీలవుతారా?

మరో 2 భాషల్లో “భీమా”.. ఓటిటి ఆడియెన్స్ రిగ్రెట్ ఫీలవుతారా?

Published on Apr 24, 2024 6:07 PM IST

టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా మాల్వికా శర్మ హీరోయిన్ గా కన్నడ దర్శకుడు ఏ హర్ష తెరకెక్కించిన లేటెస్ట్ సాలిడ్ యాక్షన్ అండ్ మాస్ డ్రామా “భీమా”. మాస్ ఆడియెన్స్ కి ఒక ఫీస్ట్ లాంటి ఈ చిత్రం ఈ ఏడాది మహా శివరాత్రి కానుకగా వచ్చి ఆడియెన్స్ ని మెప్పించింది. అయితే ఈ చిత్రం డెఫినెట్ గా అందులో ఉన్న కంటెంట్ థియేటర్స్ లో పూర్తి స్థాయి రెస్పాన్స్ ని అందుకోలేకపోయింది.

మాస్ ఆడియెన్స్ కి గోపీచంద్ అభిమానులని థియేటర్స్ లో చూసిన వారిని మెప్పించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటిటి డెబ్యూ కి సిద్ధం అయ్యింది. అయితే ఈ చిత్రం ని డిస్నీ+ హాట్ స్టార్ వారు కొనుగోలు చేయగా అందులో ఈ చిత్రం రేపటి నుంచి రానుంది. తాజాగా ఈ చిత్రం తెలుగు సహా మరో రెండు భాషల్లో స్ట్రీమ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది. తమిళ్ మరియు మళయాళ భాషల్లో కూడా అందుబాటులోకి రానుంది.

అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటంటే చాలా చిత్రాలు థియేటర్స్ లో ఇంకా ఎక్కువ ఆదరణ అందుకోవాల్సింది ఓటిటిలో వచ్చాక రిగ్రెట్ అయ్యినవారు చాలా మంది లేకపోలేరు. అయితే ఈ కోవలోకి భీమా వెళ్లే ఛాన్స్ లు ఉన్నాయని చెప్పవచ్చు. కొత్తగా చూసేవారు అప్పుడు మిస్ అయ్యిన మాస్ ఆడియెన్స్ ని భీమా థ్రిల్ చేస్తుంది. గూస్ బంప్స్ ఎలిమెంట్స్ కూడా చాలా ఉంటాయి. మరి ఓటిటిలో వచ్చాక ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు