ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్న స్టైలిష్ స్టార్.?

ఆల్రెడీ ప్రిపేర్డ్ గా ఉన్న స్టైలిష్ స్టార్.?

Published on Oct 1, 2020 10:30 PM IST


ఇపుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న భారీ బడ్జెట్ అండ్ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. సుకుమార్ దర్శకత్వంలో తెరక్కుతుందనే వీరిద్దరి కాంబోలో ఇది హ్యాట్రిక్ చిత్రం కావడంతో బన్నీ ఫ్యాన్స్ సెపరేట్ అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ చిత్రాన్ని పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇక అక్కడ నుంచి మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

ఐటీ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని ఒక ఎర్ర చందనం దుంగల స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. అంటే దాదాపు అడవుల్లోని షూటింగ్ ఉంటుంది. అందు వలన ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేయడంతో కేరళలో షూట్ ను ప్లాన్ చేసుకున్నారు. అది కూడా ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ తోనే దీన్ని మొదలు పెట్టనున్నారు.

బన్నీ పాల్గొనబోయే ఈ సీక్వెన్స్ కోసం బన్నీ ఆల్రెడీ పక్కా ప్రిపేర్డ్ గా ఉన్నాడట. అందుకు సంబంధించిన రిహార్సల్స్ అన్నీ బన్నీ ఎప్పుడో ఫినిష్ చేసేసి షూట్ కోసం రెడీగా ఉన్నాడట. ఇక అన్నీ సెట్టయ్యి షూట్ మొదలు కావడమే తరువాయి భాగం అని ఇపుడు తెలుస్తుంది. ఈ చిత్రంలో బన్నీ సరసన రష్మికా మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు