చంద్రబాబు, పవన్ లకు చిరు శుభాకాంక్షలు!

చంద్రబాబు, పవన్ లకు చిరు శుభాకాంక్షలు!

Published on Jun 12, 2024 5:34 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించింది. ఈ విజయంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ సందర్భం గా మెగాస్టార్ చిరంజీవి గారు వీరికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగో సారి ప్రమాణస్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సి ఎం కొణిదల పవన్ కళ్యాణ్ గారికి, మిగతా మంత్రి వర్గానికి హార్దిక శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి కి అహర్నిశం పాటుపడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆశిస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు