చిట్ చాట్ : అజ్మల్ – నేను కమల్ హాసన్ గారిలా అవ్వాలనుకుంటున్నాను.!

చిట్ చాట్ : అజ్మల్ – నేను కమల్ హాసన్ గారిలా అవ్వాలనుకుంటున్నాను.!

Published on Apr 16, 2014 1:38 PM IST

Ajmal1

తమిళ డబ్బింగ్ ‘రంగం’, రామ్ చరణ్ ‘రచ్చ’ సినిమాలో కనిపించిన హన్డ్సం బాయ్ అజ్మల్ హీరోగా నటించిన సినిమా ‘ప్రభంజనం’. ప్రస్తుత రాజకీయాలని మార్చాలనే కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా అజ్మల్ తో కాసేపు చిట్ చాట్ చేసాం.. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ‘రచ్చ’ సినిమా తర్వాత తెలుగు సినిమాలకు ఎందుకు దూరంగా ఉన్నారు?

స) మీరు అన్నట్టు తెలుగుకి దూరంగా ఉన్నాను. దానికి ప్రధాన కారణం ఇప్పటికే తమిళ్, మలయాళంలో కమిట్ మెంట్స్ ఉన్నాయి. అవన్నీ ఫినిష్ చేసే పనిలో ఉన్నాను. అవి పూర్తవ్వగానే ఇక్కడ సినిమాలు చేస్తాను.

ప్రశ్న) ‘రంగం’ తర్వాత మళ్ళీ ఎందుకు పొలిటికల్ సబ్జెక్ట్ ఎందుకు ఎంచుకున్నారు?

స) సొసైటీకి మంచి చేయాలనుకునే ఒక వ్యక్తి పాలిటిక్స్ లోని అవినీతిని నిర్మూలించడానికి ఏం చేసాడు అనేదే ఈ సినిమా కథ. ‘రంగం’ సినిమా చూసాక ఈ చిత్ర నిర్మాతలు ఈ సినిమాకి నేనైతే సరిపోతానని నన్ను ఎంచుకున్నారు.

ప్రశ్న) ‘ప్రభంజనం’లో మీ పాత్ర గురించి చెప్పండి?

స) లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసే ఒక రిచ్ కుర్రాడు సొసైటీకి తను చేయాల్సిన భాద్యత గురించి తెలుసుకొని వాటిని పరిష్కరించడానికి ఒక కొత్త దారిని ఎన్నుకునే పాత్రని ఇందులో పోషించాను.

ప్రశ్న) ‘ప్రభంజనం’ సినిమాకి ‘రంగం’కి ఏమన్నా సంబంధం ఉందా?

స) అస్సలు సంబంధం లేదు. రంగం కి దీనికి చాలా తేడా ఉంటుంది. ముఖ్యంగా నా పాత్రకి కూడా సంబంధం ఉండదు, నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది.

ప్రశ్న) సీనియర్ నటులైన కోట శ్రీనివాసరావు, నాజర్ లాంటి వాళ్ళతో పనిచేయడం ఎలా ఉంది?

స) వారిద్దరితో పనిచేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. ఈ సినిమాలో నాకు కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. వాటిని ఎలా చెప్పాలి, డైలాగ్ డెలివరీ ఎలా ఉండాలి అనే విషయంలో వారిద్దరే నాకు చాలా హెల్ప్ చేసారు.

ప్రశ్న) మీకు తెలుగు భాష ఏమన్నా ఇబ్బందిగా అనిపించిందా? తెలుగు ఎలా మేనేజ్ చేస్తున్నారు?

స) భాషతో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా దగ్గర భాషని త్వరగా నేర్చుకోవడానికి ఒక టెక్నిక్ ఉంది. అలాగే నెఉ తెలుగు నేర్చుకోవడానికి చాలా కష్టపడుతున్నాను, అలాగే స్పెషల్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను.

ప్రశ్న) ఒకే సారి మూడు భాషల్లో సినిమాలు చేయడాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు?

స) భాష విషయంలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నా వరకూ మాత్రం ఒక సినిమా తర్వాత ఇంకో సినిమా చేస్తున్నాను అనే ఫీలవుతాను. నేను కమల్ హాసన్ గారిలా అవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన భాషతో సంబంధం లేకుండా ఎలాంటి పాత్రనైనా చెయ్యగలడు.

ప్రశ్న) మీరు ఇప్పుడు చేస్తున్న, ఆ తర్వాత చేయనున్న సినిమాల గురించి చెప్పండి?

స) ప్రస్తుతం రాధిక ఆప్టే హీరోయిన్ గా చేస్తున్న ఓ తమిళ సినిమా చేస్తున్నాను. ఇది కాకుండా తెలుగులో వంశీ గారితో ‘తను మొన్నే వెళ్ళిపోయింది’ సినిమా చేసాను. అది కూడా షూటింగ్ పూర్తయ్యింది త్వరలో రిలీజ్ అవుతుంది.

అంతటితో అజ్మల్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మా చిట్ చాట్ ని ముగించాం..

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు