చిట్ చాట్ : మహేష్.పి – నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది.

చిట్ చాట్ : మహేష్.పి – నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది.

Published on Jul 5, 2014 5:10 PM IST

mahesh-babu-b

ఈ శుక్రవారం విడుదలైన ‘రా రా కృష్ణయ్య’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన మహేష్ తోలి చిత్రంతోనే ప్రేక్షకులను మెప్పించాడు. ‘రా రా కృష్ణయ్య’ సినిమా అనుభవాలను, విడుదల తర్వాత ప్రేక్షకుల నుండి, పరిశ్రమ ప్రముఖుల నుండి వస్తున్న స్పందనను తెలియజేయడానికి పాత్రికేయులతో సమావేశం అయ్యారు. మహేష్ చెప్పిన సంగతులు మీకోసం..

ప్రశ్న) ‘రా రా కృష్ణయ్య’ సినిమా విడుదల తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా అనిపించింది..?

స) సినిమా చూసినవారు అందరూ బాగుందని ప్రశంసిస్తున్నారు. విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. నేను ఏదైతే అనుకున్నానో ఆ సినిమానే షూట్ చేశాం. ప్రేక్షకులకు ఏ అంశాలు కనెక్ట్ అవుతాయని భావించామో వాటిని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. ఆడియన్స్ రెస్పాన్స్ చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను.

ప్రశ్న) సినిమా కోసం మొత్తం సౌత్ ఇండియా అంతా కవర్ చేసినట్టు ఉన్నారు..?

స) నేను ముందు నుండి సినిమాలో 3 డిఫరెంట్ కల్చర్స్ చూపించానుకున్నాను. అలా చూపించడం వలన తనికెళ్ళ భరణి గారి క్యారేక్టరైజేషణ్ గాని, మిగతా ఆర్టిస్టులను కొత్తగా చూపించే అవకాశం లభించింది. 5 పాటలు ఒకదానితో మరొకటి సంబంధం లేకుండా ప్రేక్షకులకు కొత్తగా అనిపించాయి. సినిమాకు ఒక ఫ్రెష్ ఫీలింగ్ తీసుకురావడం కోసమే చెన్నై, కేరళ, హైదరాబాద్, బెంగుళూరు నేపధ్యంలో చిత్రీకరించాను.

ప్రశ్న) సినిమా కథ కాపీ అని ఆరోపణలు వస్తున్నాయి..?

స) ఇటువంటి కథతో చాలా సినిమాలు వచ్చాయి. చెనై ఎక్స్ ప్రెస్, తేరే నాల్ లవ్ హోగయా.. ఇలా చాలా సినిమాలు ఉన్నాయి. నేను డాని బోయాల్(స్లండాగ్ మిలీనియర్) దర్శకత్వంలో వచ్చిన ‘ఏ లైఫ్ లెస్ ఆర్డినరీ’ సినిమా స్ఫూర్తితో ఈ కధ రాయడం జరిగింది. ‘మనం ఏ పని అయితే చేయకూడదని బలంగా అనుకుంటామో.. కొన్ని పరిస్థితులలో అదే పనిని చేయవలసి వస్తుంది.’ ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది. దాని ఆధారంగా ఈ కథను రాసుకున్నాను.

ప్రశ్న) మీకు సినిమాలో బాగా నచ్చిన సన్నివేశం ఏది..?

స) సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందని కొందరు, సెకండ్ హాఫ్ బాగుందని కొందరు అంటున్నారు. నాకు ఫస్ట్ హాఫ్ నచ్చింది. యువత అభిరుచికి తగ్గట్టు ఫస్ట్ హాఫ్ ఉంది. సెకండ్ హాఫ్ లో సందీప్, జగపతి బాబుల మధ్య వచ్చే సన్నివేశాలు కూడా బాగా నచ్చాయి.

ప్రశ్న) హీరోగా సందీప్ కిషన్ ను సెలెక్ట్ చేసుకోవడానికి కారణం..?

స) సందీప్ కిషన్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. నేను సందీప్ ని సెలెక్ట్ చేసుకోలేదు. దర్శకుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో నిర్మాత నేను చేసిన షోరీల్ చూసి ‘రా రా కృష్ణయ్య’కు దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు. కొత్త హీరో అయితే బాగుటుందని ఆలోచిస్తున్న సమయంలో సందీప్ వద్దకు నిర్మాత తీసుకువెళ్ళారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ విడుదలకు ముందు ఈ కథ విని ఓకే చేశారు.

ప్రశ్న) సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. దానిపై స్పెషల్ కేర్ ఏమైనా తీసుకున్నారా..?

స) సాయి శ్రీరామ్ సినిమా అందంగా రావడానికి చాలా కృషి చేశాడు. సినిమాలో మూడు డిఫరెంట్ కల్చర్స్ చూపిస్తున్నాం. వాటికి మనం గౌరవం ఇవ్వాలి. చిన్న తప్పు కూడా రాకుడదని చాలా గ్రౌండ్ వర్క్ చేశాం. మా సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్, నేను ఒక నెల పాటు సౌత్ మొత్తం తిరిగాం. గ్రౌండ్ వర్క్ బాగా చేయడం వలన సినిమా అంత అందంగా వచ్చింది.

ప్రశ్న) జగపతి బాబు గారితో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా అనిపించిది..?

స) 100 సినిమాలు పైగా నటించిన ఒక హీరోని దర్శకత్వం చేయడం అనేది నా అదృష్టం. మాటల్లో చెప్పలేని ఫీలింగ్ అది. జగపతి బాబు గారు షూటింగ్ టైంలో నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు.

ప్రశ్న) ఈ మూవీ మీ కెరీర్ కు ఎంత వరకు హెల్ప్ అయ్యిందని భావిస్తున్నారు..?

స) కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ అయితే దర్శకుడికి పేరు వస్తుంది. ఎంటర్టైన్మెంట్ మూవీలో దర్శకుడికి అంతగా పేరు రాదు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్, ఎంటర్టైన్మెంట్ మీద ఎక్కువుగా ఫోకస్ చేస్తాం. ఈ సినిమా తర్వాత నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇప్పుడు నేను ఎటువంటి సినిమా అయినా చేయగలను అని భావిస్తున్నాను.

ప్రశ్న) మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..?

స) ‘రా రా కృష్ణయ్య’ సినిమా చూసి ఇండస్ట్రీలో కొంత మంది ప్రముఖులు ఫోన్ చేసి అభినందించారు. డిష్కషన్ స్టేజ్ లో ఉన్నాయి. త్వరలో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి అనౌన్స్ చేస్తాను అని అన్నారు.

 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు