చిట్ చాట్ : శృతి సోది – టాలీవుడ్ లో హీరోయిన్ కి లార్జ్ రీచ్ ఉంటుంది.

చిట్ చాట్ : శృతి సోది – టాలీవుడ్ లో హీరోయిన్ కి లార్జ్ రీచ్ ఉంటుంది.

Published on Jan 26, 2015 4:27 PM IST

Shruti-Sodhi-
ఫిలాసఫీ స్టూడెంట్ గా స్టడీస్ పూర్తి చేసిన శృతి సోది ఆ తర్వాత మీడియా ప్రపంచంలో అడుగు పెట్టి జీ న్యూస్ లో కెరీర్ ని ప్రారంభించి ఆ తర్వాత్ న్యూస్ ఎక్స్ లో యాంకర్ గా పనిచేసింది. ఆ తర్వాత నటన మీద ఉన్న ఇష్టంతో పంజాబీలో హీరోయిన్ గా మారింది. పంజాబీలో మూడు సినిమాలు చేసిన శృతి సోదికి తెలుగులో నందమూరి హీరో అయిన కళ్యాణ్ రామ్ సరసన పటాస్ సినిమాలో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా గత శుక్రవారం విడుదలై పెద్ద హిట్ అయ్యింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకోవడానికి మీడియా మిత్రులతో కాసేపు ముచ్చటించింది. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) మీడియాలో కెరీర్ ప్రారంభించిన మీరు సినిమాల్లో రావడానికి గల కారణం ఏమిటి.?

స) మీడియా నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావాలని ముందు నుంచే నేను ఫుల్ ప్రిపేర్ గా ఉన్నాను. నాకు ముందు నుంచే యాక్టర్ కావాలని ఉంది. అందుకే నేను అవకాశం రాగానే ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చాను. నాకు స్టార్ అవ్వాలనే పెద్ద కోరిక లేదు కానీ ఓ మంచి యాక్టర్ అవ్వాలని ఉంది.

ప్రశ్న) ‘పటాస్’ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చింది.?

స) నాకు సినిమా చాన్స్ లన్నీ వరుసగా వచ్చాయి. పంజాబీలో వరుసగా మూడు సినిమాలు వచ్చాయి. అవి పూర్తయ్యే టైంలోనే నా మేనేజర్ ద్వారా పటాస్ కోసం మెయిన్ హీరోయిన్ ని వెతుకుతున్నారని తెలిసి నా ఫొటోస్ పంపాము. డైరెక్టర్ అనిల్ రావిపూడికి నచ్చడంతో వెంటనే ఓకే చేసేసారు. చెప్పాలంటే అన్నీ ఫాస్ట్ ఫాస్ట్ గా జరిగిపోయాయి.

ప్రశ్న) కళ్యాణ్ రామ్ తో పనిచేసిన అనుభవం గురించి చెప్పండి.?

స) ఒక్క మాటలో చెప్పాలంటే కళ్యాణ్ రామ్ జెంటిల్మెన్ అండ్ వెరీ ప్రొఫెషనల్ పర్సన్.. ఎప్పుడన్నా మనం ఓ కొత్త ప్లేస్ లోకి, కొత్త వాళ్ళ మధ్యకి వెళ్తున్నాం అంటే చిన్న టెన్షన్ ఉంటుంది. నేను సెట్ లో అడుగుపెట్టిన ఫస్ట్ షెడ్యూల్ లో అంతా కాస్త టెన్షన్ గానే గడిచింది. కానీ నేను చేస్తున్న హార్డ్ వర్క్ చూసి కళ్యాణ్ రామ్ మరింత హెల్ప్ చేసి నన్ను ప్రోత్సహించారు. డైరెక్టర్ కూడా నా డైలాగ్ డెలివరీ విషయంలో ఎంతో సపోర్ట్ చేసారు. అలాగే అంతరూ వెరీ అటాచ్ మెంట్ తో వర్క్ చేసారు.

ప్రశ్న) తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎలా ఉంది.? అలాగే తెలుగు మరియు పంజాబీ ఇండస్ట్రీస్ మధ్య ఉన్న తేడా చెప్పండి.?

స) తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చాలా బాగుంది. నాకు మొదటి అవకాశమే ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ లో రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పటివరకూ అందరూ నన్ను చాలా బాగా ట్రీట్ చేసారు. ఇక తేడా అంటే రెండు ఇండస్ట్రీలకి వ్యత్యాసం ఉంది. మెయిన్ గా చెప్పాలి అంటే టాలీవుడ్ లో ఉండే స్టార్స్ లేదా పరిచయం అయ్యే హీరోయిన్స్ కి రీచ్ ఎక్కువ ఉంటుంది, పంజాబీలో కూడా రీచ్ ఉంటుంది కానీ అంత పెద్ద రేంజ్ లో ఉండదు. పంజాబీ ఇప్పుడిప్పుడే పెద్ద ఇండస్ట్రీగా మారుతోంది. ఇంకా కొంత సమయం పడుతుంది టాలీవుడ్ అంత రీచ్ అవ్వడానికి.. అలాగే టాలీవుడ్ లో బడ్జెట్, కలెక్షన్స్, హై లెవల్ టెక్నికల్ టీం ఇలా అన్నీ హై లెవల్ లో ఉంటాయి. అలాగే ఇక్కడ స్టార్స్ కి హిందీ మరియు ఇతర భాషల్లో కూడా క్రేజ్ ఉంది.

ప్రశ్న) పంజాబీతో పోల్చుకుంటే టాలీవుడ్, బాలీవుడ్ అనేది గ్లామరస్ ఇండస్ట్రీస్.. మరి మీరు గ్లామరస్ చేయడానికి పాత్రలు, బికినీ వేయడానికి సిద్దమేనా.?

స) అవును మీరన్నది నిజమే తెలుగు, హిందీ ఇండస్ట్రీలు గ్లామరస్ ఫీల్డ్స్.. నాకు పాత్ర పరంగా గ్లామరస్ గా కనిపించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు. ఉదాహరణకి హీరోయిన్ ఓ స్విమ్మింగ్ పూల్ సీన్ లో జీన్స్ టీ షర్ట్ వేసుకుంటే బాగోదుగా ఆ టైంలో బికినీనే వేసుకోవాలి.. కాబట్టి నేను వేసుకోవడానికి రెడీ.. హీరోయిన్ గా ఓ పాత్ర చేస్తున్నాను అంటే అప్పుడు నేను శృతిని కాదు ఆ పాత్ర ఏం చెబితే అది చేయాలి. సో గ్లామర్ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. గ్లామర్ విషయంలో మా పేరెంట్స్ కి కూడా అర్థమయ్యేలా నేను చెప్పగలను.

ప్రశ్న) ఒక నటిగా మీకు ఎంతో స్పూర్తినిచ్చిన నటులు ఎవరన్నా ఉన్నారా.?

స) నన్ను ఎవరు ఈ ప్రశ్న అడిగినా నాకు స్ఫూర్తినిచ్చిన నటులుగా చెప్పుకునే వారు ఎవరూ లేరు. కానీ నేను పని చేసే సినిమాలో నటుల నుంచి ఎక్కువ స్ఫూర్తి పొందుతాను. ఉదాహరణకి పటాస్ టైంలో కళ్యాణ్ రామ్ ని చూసి ఎంతో స్ఫూర్తి పొందాను. ఆయన తన పాత్ర కోసం ఎంత కేర్ తీసుకున్నారు, ఎలా తనని తాను మౌల్డ్ చేసుకున్నాడు అనేది చూసి ఇన్స్పైర్ అయ్యాను.

ప్రశ్న) పటాస్ తర్వాత వేరే తెలుగు సినిమాలు ఏమన్నా ఓకే చేసారా.?

స) ప్రస్తుతాని ఒక రెండు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు. ఫైనల్ అవ్వగానే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాను.

అంతటితో తన కెరీర్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి మా చిట్ చాట్ ని ముగించాం..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు