‘మనసారా’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై ‘బస్ స్టాప్’ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరోయిన్ శ్రీ దివ్య. తమిళంలో వరుసగా కమర్షియల్ హిట్స్ అందుకుంటున్న ఈ భామ తెలుగులో నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తోంది. శ్రీ దివ్య నటించిన ‘వారధి’ సినిమా గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా శ్రీ దివ్యతో కాసేపు చిట్ చాట్ చేసాం..
ప్రశ్న) ‘వారధి’ మూవీ చూసిన వారి నుంచి మీకు ఎలాంటి ఫీడ్ బ్యాక్ వస్తోంది.?
స) చాలా మంది నుంచి నా పెర్ఫార్మన్స్ కి చాలా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. అలాగే సినిమా చూసిన ప్రతి ఒక్కరూ నా పాత్రని మెచ్చుకుంటున్నారు.
ప్రశ్న) ఈ సినిమా సెలక్ట్ చేసుకోవడంలో మీకు నచ్చిన అంశం ఏమిటి.?
స) డైరెక్టర్ సతీష్ కార్తికేయ నాకు కథ చెప్పిన విధానం నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాల్లో ఇలాంటి స్పెషల్ పాత్రలు రావడం చాలా అరుదు. ఆఅ అవకాశం నాకు వచ్చింది అందుకే వదులుకోలేదు.
ప్రశ్న) ఇప్పటి వరకూ మీరు తెలుగు, తమిళ భాషల్లో అన్నీ హోమ్లీ పాత్రలే చేసారు. అవుట్ అండ్ అవుట్ గ్లామరస్ పాత్ర చేస్తారా.?
స) నో.. అస్సలు చెయ్యను.. నాకు ట్రెడిషనల్ గర్ల్ పాత్రలు చేయడం అంటే బాగా ఇష్టం. అలాగే హోమ్లీ గర్ల్ పాత్రలని చాలా ఎనర్జిటిక్ గా చేయగలనని నమ్ముతాను. ఆన్ స్క్రీన్ లిప్ కిస్ లకి, పూర్తి గ్లామరస్ పాత్రలకి నేను విరుద్దం.
ప్రశ్న) మీరు చేస్తున్న తదుపరి ప్రాజెక్ట్స్ ఏమిటి.?
స) ప్రస్తుతం తెలుగులో సాయి కిరణ్ అడవి ‘కేరింత’ సినిమా చేస్తున్నాను. కేరింతలో నేను చేసిన పాత్ర ఇప్పటి వరకూ అన్ని పాత్రలకంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కేరింత రిలీజ్ కి సిద్దమవుతోంది. అలాగే తమిళంలో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. త్వరలోనే సైన్ చేస్తాను.
ప్రశ్న) మీరు చేయాలనుకునే డ్రీం రోల్స్ ఏమన్నా ఉన్నాయా.?
స) ఉన్నాయి.. నాకు అలనాటి నటి గౌతమి తన సినిమాల్లో చేసిన పాత్రల్లాంటివి చేయాలనుకుంటున్నాను. అలాంటి పాత్ర వస్తే ఎగిరి గంతేసి మరీ చేస్తాను.
ప్రశ్న) మీరు సినిమాలు ఎంచుకోవడంలో ఎందుకు సెలక్టివ్ గా ఉన్నారు.?
స) ముందుగా డైరెక్టర్ చెప్పిన పాత్ర నాకు బాగా నచ్చాలి. నా దగ్గరికి వచ్చిన ప్రతి రోల్ నేను చేయాలని అనుకోను. నాకు చెప్పిన పాత్ర నన్ను ఎగ్జైట్ చెయ్యాలి అలాగే నా పాత్ర చేయడానికి నాకు చాలెంజింగ్ గా అనిపించాలి.
CLICK HERE FOR ENGLISH INTERVIEW