చిట్ చాట్ : బెల్లంకొండ శ్రీనివాస్ – సినిమాల ఎంపికలో తుది నిర్ణయం నాన్నగారిదే

చిట్ చాట్ : బెల్లంకొండ శ్రీనివాస్ – సినిమాల ఎంపికలో తుది నిర్ణయం నాన్నగారిదే

Published on Jul 27, 2014 5:09 PM IST

Bellamkonda-Srinivas

గత శుక్రవారం విడుదలైన ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఫస్ట్ సినిమాతోనే ఇటు పరిశ్రమ వర్గాలను అటు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు శ్రీనివాస్. ఫైటులు, డాన్సులలో మాస్ ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నాడు. తొలి రోజు నుండి ‘అల్లుడు శీను’ సినిమా సూపర్ హిట్ టాక్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సంతోషాన్ని పంచుకోవడానికి మీడియాతో సమావేశం అయ్యారు హీరో శ్రీనివాస్. శ్రీనివాస్ చెప్పిన విశేషాలు మీకోసం..

ప్రశ్న) మీ తొలి సినిమా ‘అల్లుడు శీను’తో సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు..?

స) సంతోషంగా ఉంది. విడుదలైన ప్రతి ఏరియా నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. నా జీవితంలో అత్యంత మధురమైన క్షణాలు ఇవి. నా సక్సెస్ కి కారణమైన వినాయక్ గారికి, చోటా.కె.నాయుడు గారికి స్పెషల్ థాంక్స్. ఇండస్ట్రీ నుండి, బయట ప్రేక్షకుల నుండి ఫస్ట్ టైం హీరోగా చేయలేదు, 10 సినిమాల ఎక్స్ పీరియన్స్ ఉన్న హీరోలా చేశాడు అని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అవి వింటుంటే చాలా సంతోషంగా ఉంది. మూవీ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

ప్రశ్న) తొలి సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారా..?

స) హీరోగా రాణించాలి అంటే టాలెంట్ తో పాటు ప్రతి క్షణం కష్టపడాలి. 5 సంవత్సరాల క్రితం వినాయక్ గారు నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తాను అని చెప్పారు. యాక్టింగ్ ట్రైనింగ్ కోసం లాస్ ఏంజెల్స్ వెళ్ళాను. వియత్నాంలో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. డాన్స్, ఫైట్స్ లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను.

ప్రశ్న) వినాయక్ దర్శకత్వంలో నటించడం ఎలా అనిపించింది..?

స) వినాయక్ గారు చిన్నప్పటి నుండి బాగా తెలుసు. వినాయక్ గారు మా ఫ్యామిలీ మెంబెర్. స్క్రిప్ట్ కోసం చాలా రోజులు కష్టపడ్డారు. తొలి సినిమాకి ఇంత మంచి స్క్రిప్ట్ దొరకడం నా అదృష్తం. షూటింగ్ టైంలో ప్రతి సన్నివేశం చాలా వివరించి చెప్పేవారు. వినాయక్ గారి వలెనే నేను అంతా బాగా నటించాగాలిగాను. నా సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనకే చెందుతుంది. నా క్యారెక్టర్ ప్రతి ఒక్కరికి నచ్చేలా డిజైన్ చేశారు. కమర్షియల్ సినిమాలలో కొత్త తరహ జోనర్ ఇది.

ప్రశ్న) ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లాంటి సీనియర్ నటులతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?

స) నా తొలి సినిమాలోనే ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం లాంటి గొప్ప నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టం. వారితో నేను అంతా బాగా నటించడానికి కారణం వాళ్ళు ఇచ్చిన ఫ్రీడమ్. చాలా ప్రోత్సహించారు. లాస్ ఏంజెల్స్ యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకోవడం చాలా హెల్ప్ అయ్యింది.

ప్రశ్న) తొలి సినిమాలోనే స్టార్ హీరోయిన్లు సమంత, తమన్నాలతో వర్క్ చేశారు. వాళ్ళతో వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ ఎలా ఉంది..?

స) సమంత తెలుగులో స్టార్ హీరోయిన్. చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోల పక్కన నటించింది. నేనొక కొత్త హీరో. అయినా సెట్లో తను చాలా ఫ్రెండ్లీగా ఉండేది. స్టార్ హీరోయిన్లా ఇప్పుడు బిహేవ్ చేయలేదు. సినిమా కోసం చాలా కష్టపడింది. బాగా నటించింది. తమన్నా కూడా మంచి సపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు ఇద్దరికీ చాలా థాంక్స్.

ప్రశ్న) మీరు సినిమా చూసిన తర్వాత ఇంకా బాగా చేసుంటే బాగుండేది అని ఏ విషయంలో అనిపించింది..?

స) ఏ నటుడికైనా తనను స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఇంకా బాగా చేయాలని అనిపిస్తుంది. నాకు కూడా అలానే అనిపించింది. ఇంకా బాగా డాన్సు , ఫైట్స్ చేసుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఎక్స్ ప్రేషన్స్ బాగా పలికించి ఉంటె బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా చూసుకుంటే నా ఫస్ట్ సినిమాలో నేను చేసిన యాక్టింగ్, ఫైట్స్, డాన్సులతో చాలా హ్యాపీగా ఉన్నాను.

ప్రశ్న) మీకు సొంత నిర్మాణ సంస్థ ఉంది, బయట బ్యానర్ నుండి అవకాశాలు వస్తే చేస్తారా..? లేదా..?

స) స్క్రిప్ట్ బాగుంటే నాకు ఇతర బ్యానర్లలో సినిమాలు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. స్టొరీ బాగుంది, నేను మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి స్కోప్ ఉంది అనిపిస్తే తప్పకుండా చేస్తాను.

ప్రశ్న) ఇతర భాషలలో హీరోగా చేసే అవకాశం ఉందా..? మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి..?

స) సౌత్ సినిమాలలో తెలుగులోనే యాక్ట్ చేయాలని అనుకుంటున్నాను. ప్రజెంట్ ‘అల్లుడు శీను’ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాను. తర్వాత సినిమా గురించి ఇంకా ఆలోచించలేదు. కంగారుగా, హాడావుడి పడి ఏదో ఒక సినిమా చేయడం ఇష్టం లేదు. మరో మంచి కథ మా దగ్గరకు వచ్చినప్పుడు సెకండ్ సినిమా స్టార్ట్ చేస్తాం. ఆ విషయాలు నాన్నగారు చూసుకుంటారు. కథల విషయంలో, సినిమాల ఎంపికలో తుది నిర్ణయం నాన్నగారిదే. అంటూ ముగించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు