“కల్కి” పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన దీపికా పదుకునే!

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రధాన పాత్రలో, టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మైథాలజీ మూవీ కల్కి 2898AD. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే, దిశా పటాని లు ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కి సంబందించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు ముంబైలో నిర్వహించారు. ఈ వేడుకలో హీరోయిన్ దీపికా పదుకొనె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ఈ చిత్రంలో నటించడం పట్ల పలు వ్యాఖ్యలు చేశారు. అద్భుతమైన ఎక్స్ పీరియన్స్ అని, ఎంతో నేర్చుకున్నా అని అన్నారు. పర్సనల్ గా, ప్రొఫెషనల్ గా ఈ చిత్రం ఎంతో ఉపయోగపడింది అని అన్నారు. అమితాబ్ బచ్చన్ చెప్పినట్లు గా మొత్తం డిఫరెంట్ వరల్డ్ లో ఉన్నట్లు అనిపిస్తుంది అని అన్నారు. అంతేకాక డైరెక్టర్ నాగ్ అశ్విన్ తో వర్క్ చేయడం అధ్బుతమైన అనుభవం అని పేర్కొన్నారు. ఈ చిత్రంలో దీపికా పదుకునే తల్లి పాత్రలో నటిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.