స్లో పాయిజన్ లా ఎక్కేస్తున్న “దేవర”.. ఈ 2 భాషల్లో వేరే లెవెల్

స్లో పాయిజన్ లా ఎక్కేస్తున్న “దేవర”.. ఈ 2 భాషల్లో వేరే లెవెల్

Published on May 22, 2024 1:00 AM IST

పాన్ ఇండియా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ సినిమా నుంచి ఇటీవల ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ఫియర్ సాంగ్ పాన్ ఇండియా భాషల్లో వచ్చింది.

అయితే రీసెంట్ గా సంగీత దర్శకుడు అనిరుద్ నుంచి వస్తున్న ఫస్ట్ సింగిల్స్ లానే మొదట్లో రొటీన్ గానే అనిపించినా ఇదీ నెమ్మదిగా ఎక్కడం స్టార్ట్ అయ్యింది. ఓ స్లో పాయిజన్ లా మూవీ, మ్యూజిక్ లవర్స్ కొన్ని పర్టిక్యులర్ లైన్స్ ని బీట్స్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సాంగ్ మన తెలుగు మినహా హిందీలో అయితే క్రేజీ రెస్పాన్స్ తో దూసుకెళ్తుంది.

2 లక్షలకు పైగా లైక్స్ హిందీ వెర్షన్ కి రాగా తమిళ్ వెర్షన్ కి లక్ష లైక్స్ క్రాస్ చెయ్యడం విశేషం. ఈ మధ్యకాలంలో మన తెలుగు సినిమాలకు తమిళ్ వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వడమే మానేశారు. అలాంటిది దేవర కి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడంలో ఎన్టీఆర్ తో పాటు అనిరుద్ ఫ్యాక్టర్ కూడా వర్క్ అయ్యింది అని చెప్పాలి. మొత్తానికి అయితే ఈ సాంగ్ బాగానే వర్క్ అవుతుంది ఇప్పుడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు