ప్రత్యేక ఇంటర్వ్యూ : గుణ్ణం గంగరాజు – కథ బాగుంటే ఏ జోనర్ సినిమా అయినా హిట్ అవుతుంది.

ప్రత్యేక ఇంటర్వ్యూ : గుణ్ణం గంగరాజు – కథ బాగుంటే ఏ జోనర్ సినిమా అయినా హిట్ అవుతుంది.

Published on May 13, 2014 6:50 PM IST

Gunnamgangaraju
గుణ్ణం గంగరాజు – ఈ పేరు వైవిధ్యంకి మారుపేరు అని చెప్పవచ్చు. అటు వెండి తెరపై ‘లిటిల్ సోల్జర్స్’, ‘ఐతే’, ‘అనుకోకుండా ఒకరోజు’ లాంటి సినిమాలను అందించిన ఆయన అమృతం లాంటి సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులను తెగ నవ్వించాడు. ఈ నవ్వులను బుల్లితెర నుంచి వెండితెరపైకి తీసుకు రావాలనే ఉద్దేశంతో చేసిన ప్రయత్నమే ‘అమృతం – చందమామలో’. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేము గుణ్ణం గంగరాజుతో కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించాం. ఆయన ఈ సినిమా గురించి, తన భవిష్యత్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పిన విశేషాలు మీ కోసం…

ప్రశ్న) సూపర్ హిట్ అయిన అమృతం సీరియల్ ని సినిమాగా తీయాలని ఎందుకు డిసైడ్ అయ్యారు?

స) మామూలుగా మళ్ళీ అదే సీరియల్ ని ఏమి తీస్తాం అని సీరియల్ చేయకుండా ఆపేసాను. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఈ సీరియల్ ని ఇంకో స్టేజ్ కి ఎలా తీసుకెళ్ళాల అని ఆలోచిస్తున్నప్పుడు సినిమాగా తీస్తే ఎలా ఉంటుందా అనే ఆలోచన నుంచి ఇది మొదలైంది.

ప్రశ్న) అమృతం సీరియల్ తో పోల్చుకుంటే ఈ సినిమా ఎంతవరకూ డిఫరెంట్ గా ఉంటుంది?

స) సినిమాకి తగ్గట్టు అమృతం స్క్రిప్ట్ లో మార్పులు చేసాను. ఈ సినిమా కాన్సెప్ట్ స్పేస్ లో ఉంటుంది. అలాగే కొత్తగా అనిపించడం కోసం ఇప్పుడున్న యువ హీరోలను ఈ సినిమాలో పెట్టుకున్నాను.

ప్రశ్న) ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్, ప్రోమోస్ ఆసక్తిగా ఉన్నాయి. మరి సినిమా గురించి చెప్పండి?

స) అవును మీరన్నది నిజమే ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మేము ట్రైలర్ ని ఫేస్ బుక్ లో రిలీజ్ చేసాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా అమృతం సీరియల్ లానే ఉంటుంది. కానీ ఈ సినిమా స్పేస్ లో ఉండటం వలన చూడటానికి చాలా ఆసక్తిగా ఉంటుంది.

ప్రశ్న) ఈ సినిమా బడ్జెట్ మరియు నిర్మాణ విలువల గురించి చెప్పండి?

స) మేము ఈ సినిమా కోసం రెండు సంవత్సరాలు పనిచేశాం, అలాగే ఈ సినిమా కోసం మేము పెట్టిన బడ్జెట్ 7 కోట్లు. మొత్తం షూటింగ్ హైదరాబాద్ లో చేసాం అలాగే స్పేస్ ఎపిసోడ్ కోసం ప్రత్యేక సెట్స్ వేసాము. ఈ స్పేస్ లుక్ ని సెట్లో తీసుకు రావడానికి మేము చాలా కష్టపడ్డాం.

ప్రశ్న) విజువల్స్ పరంగా సినిమా చాలా రిచ్ గా ఉంది. దాని గురించి కాస్త వివరంగా చెబుతారా?

స) విజువల్స్ పరంగా అంటే నేను ఒకటే చెబుతాను.. ఈ సినిమా కెమెరా వర్క్ మరియు విజువల్స్ పరంగా ఇండియన్ స్క్రీన్ పై ది బెస్ట్ గా చెప్పుకునే సినిమాల లిస్టులో చేరిపోతుంది.

ప్రశ్న) మీ సీరియల్ లో అంతమంది తెలిసిన నటులు ఉన్నాకానీ మీరెందుకు ఈ సినిమాలో కొత్త నటీనటుల్ని మార్చారు.?

స) ఈ సినిమాలో మేము ఇద్దరినే మార్చాము. వాళ్ళే శ్రీనివాస్ అవసరాల మరియు హరీష్. ఈ సినిమా అనుకున్నప్పుడే ఫ్రెష్ ఫీల్ కోసం యంగ్ నటీనటుల్ని తీసుకోవాలనుకున్నాం. అందుకే కొత్తవారిని తీసుకున్నాం.

ప్రశ్న) ఇలాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలను తెలుగు ఆడియన్స్ ఆదరిస్తారంటారా?

స) అది ఏ జోనర్ సినిమా అయినా స్టొరీ బాగుండి, ఎంటర్టైనింగ్ గా ఉంటే ఏ జోనర్ సినిమా అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు మరియు హిట్ చేస్తారు.

ప్రశ్న) ఈ సినిమాలోని గ్రాఫిక్స్ గురించి చెప్పండి?

స) ఈ సినిమాలో సుమారు 60 నిమిషాల పాటు అదిరిపోయే గ్రాఫిక్స్ ఉంటుంది. ఈ సినిమాలో వేసిన స్పేస్ సెట్, కాస్ట్యూమ్స్ మరియు విజువల్ ఎఫెక్ట్స్ గ్రాండ్ గా ఉండడం కోసం ఎక్కువ ఖర్చు పెట్టాం. నిర్మాణ విలువల విషయంలో మేము ఎక్కడా రాజీ పడలేదు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోనే 9 నెలలు ఉండడానికి గల కారణం అదే..

ప్రశ్న) ఇప్పటి వరకూ చేసిన ప్రమోషన్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఏ తరహాలో ప్రమోషన్స్ చేయబోతున్నారో చెప్పగలరా?

స) మా సినిమానే చాలా కొత్తగా ఉంటుంది. అందుకే మేము భారీగా ప్రమోషన్స్ చేస్తున్నాం. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన ఓ కామిక్ బుక్ ని రిలీజ్ చేయనున్నాం. ఇలాంటి తరహా ప్రమోషన్స్ ఇది వరకూ ఎవ్వరూ చేయలేదు..

ప్రశ్న) మీరు తీసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది?

స) నాకు పర్సనల్ గా బాగా నచ్చిన సినిమా ‘అనుకోకుండా ఒక రోజు’. అదే డైరెక్టర్ గా అయితే ‘లిటిల్ సోల్జర్స్’ సినిమా అంటే ఇష్టం.

ప్రశ్న) ఎందుకు మీరు సినిమాకి సినిమాకి మధ్య అంట గ్యాప్ తీసుకుంటున్నారు?

స) నవ్వుతూ.. వరుసగా సినిమాలు చేయాలంటే నాకు బడ్జెట్ కూడా కావాలి కదా.. నా పరంగా నాకు ఇలా టైం తీసుకొని సినిమాలు చేయడమే బాగుంది.

ప్రశ్న) మీరు తీసిన సినిమాల్లో ఏ సినిమాని అయినా రీమేక్ చేయాలనుకుంటున్నారా?

స) అవును.. అనుకుంటున్నాను.. ఈ సినిమా బాగా ఆడితే, ఈ సినిమాకి సీక్వెన్స్ తీయాలనుకుంటున్నాను అలాగే దాన్ని హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాను.

ప్రశ్న) మీ డ్రీం ప్రాజెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా.?

స) అవును,, చరిత్రలో పసిద్ది గాంచిన అభిమన్యు జీవితంపై ఒక భారీ బడ్జెట్ సినిమా చేయాలని ఉంది.

అంతటితో గుణ్ణం గంగరాజుతో మా ఇంటర్వ్యూని ముగించి ఈ ‘అమృతం – చందమామలో’ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము..

CLICK HERE FOR ENGLISH INTERVIEW

సంబంధిత సమాచారం

తాజా వార్తలు