ఇంటర్వ్యూ : హేమంత్ మధుకర్ – “నిశ్శబ్దం” కు అనుష్కనే లైఫ్ లైన్

ఇంటర్వ్యూ : హేమంత్ మధుకర్ – “నిశ్శబ్దం” కు అనుష్కనే లైఫ్ లైన్

Published on Sep 25, 2020 8:01 PM IST


మన దక్షిణాదిలోనే ఒక లేడీ ఓరియెంటెడ్ చిత్రం తీయాలి అంటే మొట్ట మొదట గుర్తుకు వచ్చే పేరు అనుష్క శెట్టి. ఇప్పటి వరకు ఎన్నో చిత్రాల్లో అలరించిన అనుష్క ఇపుడు మెయిన్ లీడ్ లో నటించిన చిత్రం “నిశ్శబ్దం”. ఈ చిత్రం వచ్చే అక్టోబర్ నెల 2వ తారీఖున అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ గా రిలీజ్ కానుంది. మరి ఈ చిత్ర దర్శకుడు హేమంత్ మధుకర్ తో మేము ఒక వర్చువల్ ఇంటర్వ్యూను తీసుకున్నాం. మరి ఈ దర్శకుడు ఎలాంటి విషయాలను వెల్లడించారో చూద్దాం.

 

ప్ర) అసలు ఈ ప్రాజెక్ట్ ఎలా మొదలయ్యింది? అనుష్క ఎలా భాగస్వామ్యం అయ్యారు?

మొదట్లో చాలా చిన్నగానే ప్లాన్ చేద్దామనుకొని ప్రీ ప్రొడక్షన్ పనిని స్టార్ట్ చేశాను, ఆ తర్వాత మామూలుగానే ఓసారి కోనా వెంకట్ గారిని కలిసి లైన్ వినిపించాను. ఆయన విన్నాక ఈ చిత్రాన్ని స్టార్ క్యాస్ట్ తో ప్లాన్ చేద్దామని అన్నారు. అలాగే అనుష్క గారిని తీసుకోవడంలో కూడా పూర్తి క్రెడిట్ కోనా గారికే చెందుతుంది. ఆయనే ఆమె పేరును సజెస్ట్ చేసి ఆమెకు స్క్రిప్ట్ వినిపించేలా చేసారు. ఆ వెంటనే ఆమె కూడా స్క్రిప్ట్ ను ఓకె చేసేసారు. అలా ఆమె ఈ చిత్రంలో భాగస్వామ్యం అయ్యారు.

 

ప్ర) మాధవన్, అంజలి, షాలిని పాండే అలాగే హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడ్సెన్ ను ఎలా అప్రోచ్ అయ్యారు?

స) మాధవన్ గారిని అయితే సింపుల్ గానే కలవగలిగాను అలా కలిసే ఆయనకు కథను చెప్పాను. ఇక అంజలి మరియు షాలినీలా విషయానికి వస్తే పాత్రలకు తగ్గట్టుగా ఎంచుకున్నాము. కానీ మైఖేల్ విషయంలో ప్లాన్డ్ గానే అనుకున్నాము. ఎందుకంటే యూఎస్ కు చెందిన ఒక హాలీవుడ్ నటుణ్ని ఎంచుకోవాలి అనుకున్నాము అలా ఆయనను నిశ్శబ్దంలో తీసుకున్నాం.

 

ప్ర) అనుష్కతో పనిచేసిన అనుభవం ఎలా ఉంది?

స) ఆమె ఒక మంచి వ్యక్తిగా అందరికీ తెలిసిందే. ప్రతీ ఒక్కరినీ అనే తన మనసు నుంచి సమానంగా చూస్తారు. ఇవన్నీ పక్కన పెడితే ఆమె డెడికేషన్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఆమె మాత్రమే నా టీం అండ్ చిత్రానికి లైఫ్ లైన్.

 

ప్ర) మీ నిర్మాతల కోసం మాకు ఏమన్నా చెప్పండి?

స) కోనా వెంకట్ గారు మరియు విశ్వప్రసాద్ గారు ఇద్దరూ మాకు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని పూర్తి స్వేచ్ఛను ఇచ్చేసారు. అమెరికా లాంటి దేశంలో 55 రోజులు షూటింగ్ జరపడానికి ఇలాంటి సినిమాను చేయడానికి వారే ప్రధాన కారణం.

 

ప్ర) మీ సినిమాపై ఎంత నమ్మకంగా ఉన్నారు?

స) ఒక్క నేను మాత్రమే కాదు మొత్తం మా చిత్ర యూనిట్ అంతా ఫైనల్ అవుట్ ఫుట్ చూసి చాలా సంతోషంగా ఉన్నాం. స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ వారు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ తీసుకున్నాక కొంత మంది అమెజాన్ సభ్యులు ఈ చిత్రాన్ని మా గ్రూప్ అంతటికీ కాల్ చేసి అభినందించారు.

 

ప్ర) ఏయే అంశాలు ఈ చిత్రంలో ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ గా నిలుస్తాయి?

స) స్క్రిప్ట్ కోసం ఇప్పుడే రివీల్ చెయ్యను కానీ, ఈ సినిమాలో నటులు ఇచ్చిన పెర్ఫామెన్స్ లు చాలా బాగుంటాయి. అలాగే ప్రత్యేకంగా థాంక్స్ చెప్పాలి అంటే నా సౌండింగ్ అండ్ సినిమాటోగ్రఫీలు అందించిన షానియల్ డియో కు చెప్పాలి. వారికి ఖచ్చితంగా మంచి గుర్తింపు వస్తుంది అని నమ్ముతున్నాను.

 

ప్ర) భవిష్యత్తులో ప్రాజెక్ట్స్ ఏమిటి?

స) ప్రస్తుతానికి నా దగ్గర రెండు కథలు ఉన్నాయి. కానీ వాటి గురించి నిశ్శబ్దం విడులయ్యాకే ఆలోచిస్తాను.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు