ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరో సుధీర్ బాబు. ‘ఏ మాయ చేసావే’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించి ఆ తర్వాత సోలో హీరోగా మారి ప్రేమకథా చిత్రమ్ తో తెలుగు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు. సుధీర్ బాబు త్వరలోనే ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సుధీర్ బాబుతో మేము కాసేపు ప్రత్యేకంగా ముచ్చటించి తన పర్సనల్ విషయాలు, కెరీర్ మరియు రాబోవు సినిమాల గురించిన విశేషాలు తెలుసుకున్నాం.. ఆ విశేషాలు మీ కోసం..
ప్రశ్న) నేషనల్, వరల్డ్ లెవల్ బాడ్మింటన్ గేమ్స్ కి సెలక్ట్ అయిన మీరు స్పోర్ట్స్ వదిలేసి, టోటల్ డిఫరెంట్ ఫీల్డ్ అయిన సినిమాల వైపుకి ఎలా వచ్చారు.?
స) రెండూ ఒకదానితో ఒకటి సంబందం లేని ఫీల్డ్స్.. కానీ నా డెస్టినీ ఇదే అనుకుంటా అందుకే సినిమాల వైపు వచ్చాను. నా పరంగా నాకు రెండూ ఇష్టమున్న ఫీల్డ్స్.. నేను స్పోర్ట్స్ లో 100% మనసు పెట్టి పనిచేసాను, ఇప్పుడు సినిమాల్లోనూ 100% పనిచేస్తున్నాను. బాడ్మింటన్ మీద ఎక్కువ దృష్టి పెట్టకపోవడానికి కారణం చదువు డిస్టర్బ్ అవుతూ ఉండడం. నేషనల్ లెవల్ రేంజ్ కి వెళ్ళాలి అంటే బాడ్మింటన్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి దానివల్ల కాస్త చదువు దెబ్బతినేది. చదువు చాలా ఇంపార్టెంట్ అందుకే స్పోర్ట్స్ ని కాస్త తగ్గించాను. అలా స్పోర్ట్స్ కి దూరమై సినిమాలకు దగ్గరయ్యాను.
ప్రశ్న) సినిమాలలోకి రావడానికి మీకు స్ఫూర్తి ఎవరు.?
స) నాకు చిన్నప్పటి నుంచే సినిమాలు అంటే ఇష్టం.. నాకు మొదటి స్ఫూర్తి సినిమాలే.. ఆ తర్వాత కృష్ణ గారే నాకు స్ఫూర్తి. చిన్నప్పుడు విజయవాడలో ఉండేవాన్ని.. అప్పట్లో కృష్ణ గారి సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి, ఇంటికి వచ్చి ఆ డైలాగ్స్ చెబుతూ ఉండేవాన్ని. అలా కృష్ణ గారిని స్ఫూర్తిగా తీసుకొనే సినిమాల్లోకి వచ్చాను.
ప్రశ్న) అతిధి పాత్రలో మెరిసి, ఆ తర్వాత రీమేక్ తో హీరోగా పరిచయం అయ్యి ఇప్పుడు డైరెక్ట్ తెలుగు సినిమాలతో మీ కెరీర్ సాగుతోంది. ఈ మూడేళ్ళ ప్రయాణం గురించి చెప్పండి.?
స) మొదటి నుంచి సోలో హీరోగా చెయ్యాలనేదే నా కోరిక. కానీ నేను ఒక్కడినే ఒక సినిమాని హాండిల్ చేయగలనా లేదా అన్న చిన్న సంశయంతో ఓ పాత్ర చేయాలనీ అనుకున్నాను. ‘ఏ మాయ చేసావే’ మా ప్రొడక్షన్ సినిమా కావున అందులో చిన్న పాత్ర చేసాను. ఆ సినిమా టైంలో గౌతమ్ మీనన్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నాను. అది నా మొదటి సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది. జర్నీ చాలా బాగుంది. సినిమా సినిమాకి నా గ్రోత్ చాలా బాగుంది. నా కెరీర్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే నేను అభిమానులకు ఎప్పుడూ ఓ మంచి సినిమా అందించాలనే ఉద్దేశంతో స్టోరీస్ పరంగా చాలా సెలక్టివ్ గా ఉన్నాను.
ప్రశ్న) మోసగాళ్ళకు మోసగాడు సినిమా ఎలా మొదలైంది.? ఈ సినిమాకి స్వామి రారాకి ఉన్న సంబందం ఏమిటి.?
స) స్వామి రారా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ రాబోతోందని వార్తల్లో వినేవాడిని. అరే ఈ సినిమా నాకు వస్తే బాగుండు అని అనుకునే వాన్ని. ఒకరోజు చక్రి, బోస్ వచ్చి ఈ సబ్జెక్ట్ చెప్పారు. నాకు నచ్చడంతో ఓకే చెప్పాను. ఇది ‘స్వామి రారా’ ఫార్మాట్ లో కాకుండా పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటుంది. స్వామి రారా కథకి దీనికి సంబంధం ఉండదు. ఈ రెండు సినిమాల్లో ఉన్న కామన్ పాయింట్ ఒకటే .. అదే విగ్రహాల చోరీ చుట్టూ తిరగడం.. ఈ ఒక్క పాయింట్ తప్ప ఇంకేదీ సంబంధం ఉండదు.
ప్రశ్న) మోసగాళ్ళకు మోసగాడు సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి.? అలాగే గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఎలాంటి కొత్తదనం చూపబోతున్నారు.?
స) ఈ సినిమాలో నేనొక దొంగగా కనిపిస్తాను. చిన్న చిన్న దొంగాతానాలు చేసుకుంటే ఉండే నాకు ఒక పెద్ద అమౌంట్ అవసరం అవుతుంది. దాని కోసం నేను ఏం చేసాను అన్నదే మిగిలిన కథ. నా గత సినిమాల స్టొరీ బ్యాక్ డ్రాప్ వలన స్టైలిష్ లుక్ లో కనిపించే అవకాశం రాలేదు. కానీ ఈ సినిమాలో ఆ ఛాన్స్ వచ్చింది. అందుకే ఈ సినిమాలో నా మొత్తం లుక్ ని మార్చుకొని చాలా స్టైలిష్ గా కనిపిస్తాను. ఈ సినిమాతో నేను గుడ్ లుకింగ్ ఫెలో అని అందరూ ఫీలవుతారని మాత్రం అనుకుంటున్నాను.
ప్రశ్న) కృష్ణ గారి మోసగాళ్ళకు మోసగాడు సినిమా అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. అలాంటి సినిమా టైటిల్ ని ఈ సినిమాకి పెట్టాలనే ఆలోచన ఎవరిది.? ఈ టైటిల్ పెట్టడంలో మీకు ఎలాంటి భయం వేయలేదా.?
స) ఈ మూవీకి మోసగాళ్ళకు మోసగాడు అనే టైటిల్ పెట్టాలనేది నా ఆలోచన కాదు, బోస్, చక్రినే డిసైడ్ అయ్యి నా దగ్గరకి తీసుకు వచ్చారు నేను ఓకే అన్నాను. ఆ టైటిల్ పెట్టడం వలన సినిమాపై అంచనాలను ఉంటాయి, ఆ అంచనాలను కచ్చితంగా అందుకుంటాము. భయం ఏమీ లేదు ఎందుకంటే సినిమా చూసాక మీరే ఆ టైటిల్ పర్ఫెక్ట్ అని అంటారు.
ప్రశ్న) డైరెక్టర్ నెల్లూరు బోస్, హీరోయిన్ నందిని గురించి చెప్పండి.?
స) బోస్ కి నటీనటుల నుంచి ఎలాంటి నటనని రాబట్టుకోవాలో, తన సినిమా కోసం ఏమేమి కావలి అన్నది పర్ఫెక్ట్ గా తెలుసు. దొంగగా ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా చెయ్యలా అని ఉండేది, కానీ తను ఎలా కావాలి అన్నది క్లారిటీగా చెప్పడం వలన నా పని చాలా ఈజీ అయిపొయింది. ఇక హీరోయిన్ నందినికి ఇది తొలి తెలుగు సినిమా. చాలా మంచి పెర్ఫార్మార్. ఈ సినిమాలో తన పాత్ర చాలా ఫన్నీగా ఉంటుంది. జస్ట్ పాటల కోసమే కాకుండా కథకి ప్రాముఖ్యత ఉన్న పాత్ర చేసింది. తనకి మంచి పేరొస్తుంది.
ప్రశ్న) మొదటి సినిమా కంటే ఈ సినిమాకి చక్రి ఎక్కువగానే ఖర్చు పెట్టినట్టున్నారు. బడ్జెట్ ఎక్కువవుతోందని భయపడలేదా.?
స) అవును బడ్జెట్ పరంగా స్వామి రారా కంటే ఎక్కువగానే చక్రి పెట్టాడు. కథా పరంగా బడ్జెట్ కి డిమాండ్ ఉంది, అలాగే సినిమా అనుకున్నప్పుడే దీన్ని కమర్షియల్ గా తీస్తున్నాం, బాగా గ్రాండ్ గా ఉండాలని బడ్జెట్ ఎక్కువవుతుందని అనుకునే ఈ సినిమా తీసాడు. ఎందుకు అంటే తనకి కథ మీద చాలా నమ్మకం ఉంది. అందుకే ధైర్యం చేసాడు.
ప్రశ్న) కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ గురించి చెప్పండి.?
స) కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ ఓ ప్యూర్ లవ్ స్టొరీ.. ఎబిసిడి కూడా రాని ఓ కుర్రాడు అమెరికాలో ఓ పెద్ద కంపెనీకి సిఈఓ ఎలా అవ్వగలిగాడు. ఫైనల్ గా ఆ అమ్మాయి ప్రేమని గెలుచుకోగలిగాడా లేదా అన్నదే మెయిన్ స్టొరీ లైన్. ఈ సినిమాలు ఈ మూవీలో నా పాత్రలో చాలా వేరియేషన్స్ ఉంటాయి. యాక్టర్ గా నాకు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమా అవుతుంది.
ప్రశ్న) ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’లో మహేష్ బాబు గెస్ట్ రోల్ చేసాడు అనే దానిపై మీ కామెంట్.? అలాగే ‘మోసగాళ్ళకు మోసగాడు’లో మంచు మనోజ్ చేసిన గెస్ట్ రోల్ గురించి చెప్పండి.?
స) చాలా రోజుల నుంచి ఈ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి, కానీ మహేష్ బాబు ఇందులో ఎలాంటి గెస్ట్ రోల్ చేయలేదు. ముందుగా అనుకున్నాం, కానీ మహేష్ బాబు ఒక గెస్ట్ రోల్ చేసాడు అంటే అభిమానుల్లో అంచనాలు ఉంటాయి, ఆ అంచనాలను అందుకునేలా ఆ పాత్ర ఉండాలి. కేవలం 15 సెకన్ల కోసం మహేష్ బాబుని గెస్ట్ రోల్ చేయమనండం కరెక్ట్ కాదు అందుకే వద్దు అనుకున్నాం. నాగ చైతన్య, రానా కలిసి గెస్ట్ రోల్ చేసారు. అది చూడా చాలా చిన్న పాత్రలు.
ఇక మోసగాళ్ళకు మోసగాడు కోసం మనోజ్ కి ఫోన్ చేసి అడగగానే చేసేస్తాను అన్నాడు. కథ వినమని చెప్పినా అవసరం లేదు చేసేస్తా డార్లింగ్ అని చేసాడు. తనతో ఫస్ట్ అనుకున్నప్పుడు చంద్ర మోహన్ గారికి స్ట్రోక్ రావడం వలన షూట్ కాన్సల్ అయ్యింది. మళ్ళీ తనే తన డేట్స్ అడ్జస్ట్ చేసి నిశ్చితార్దం ముందు రోజు ఎండలో చేసాడు. ఈ మధ్య బందువులకి కాల్ చేసి ఫ్యామిలీ ఫంక్షన్స్ కి రమ్మంటేనే రావడం లేదు అలాంటిది ఫ్రెండ్ షిప్ కోసం ఒక్క కాల్ చేయగానే చేయడం అనేది గ్రేట్.
ప్రశ్న) మీకు వచ్చిన సక్సెస్ మరియు ఫెయిల్యూర్స్ నుంచి ఏమి నేర్చుకున్నారు.?
స) నాకు తెలిసి నా కెరీర్లో ఇప్పటివరకూ సక్సెస్ మాత్రమే ఉంది, ఫెయిల్యూర్ లేదనుకుంటున్నాను. ఎప్పుడైతే నువ్వు నమ్మిన దాని కోసం 100% ఎఫోర్ట్ పెడతావో అదే నీ సక్సెస్ అని అనుకుంటాను. హిట్ అయ్యింది కదా అని ఎఫోర్ట్ తగ్గించడం, ఫ్లాప్ అయ్యింది కదా అని ఎఫోర్ట్ పెంచడం లాంటివి నా దగ్గర ఉండవు. అందుకే ప్రతిది సక్సెస్ గానే ఫీలవుతాను..
ప్రశ్న) మీకు ఎంతో సపోర్ట్ గా ఉన్న ఘట్టమనేని ఫ్యామిలీ స్టార్స్ నుంచి మీరేమి నేర్చుకున్నారు.?
స) సూపర్ స్టార్ కృష్ణ – కృష్ణ గారి నుంచి క్రమ శిక్షణ నేర్చుకున్నాను. ఆయన చెప్పిన టైంకి వస్తారు ఏ మాత్రం లేట్ అవ్వదు. వీటికంటే మించి ఫ్యామిలీ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు.
విజయనిర్మల – కృష్ణ గారి గురించి చాలా కేర్ తీసుకుంటారు. ఒక చిన్న పిల్లాడిలా చూసుకుంటారు. ఆ కేరింగ్ అనేది ఆమె నుంచే నేర్చుకోవాలి. అలాగే ఆమె ఎంతో మందికి ఇన్స్పిరేషన్. చాలా కాన్ఫిడెంట్ లేడీ అండ్ షీ నెవర్ గివ్ అప్.
మహేష్ బాబు – ఓపిక (పేషన్స్).. సినీ ఇండస్ట్రీలో పలు విషయాలు, పలువురు ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ తను మాత్రం చాలా పేషన్స్ గా ఉంటారు. అంట ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. అలాగే తను అంత పెద్ద స్టార్ హీరో కానీ ఇప్పటికీ ప్రతి సీన్ చేసేటప్పుడు మొదటి సినిమా ఫస్ట్ సీన్ చేస్తున్నంత ఎనర్జీ లెవల్స్ అతనిలో ఉంటాయి. ఈ రేంజ్ కి వచ్చాక అంత ఎనర్జీ లెవల్స్ చూపడం చాలా కష్టం. ఇక కృష్ణ గారు – మహేష్ లో ఉన్న కామన్ పాయింట్. ఫ్యామిలీ విషయంలో చాలా కేర్ తీసుకుంటారు. తన చుట్టూ ఉన్నవాళ్ళు కంఫర్ట్ గా ఉన్నారా లేదా అని తెలుసుకుంటూనే ఉంటారు, ఏం కావాలన్నా సాయం చేస్తాడు.నాకు తెలిసి మహేష్ బాబు లాంటి వాళ్ళని ఈ కాలంలో చూడలేము. ఆయనలా ఉండడం చాలా కష్టం కూడా..
సీనియర్ నరేష్ – ఆయన్ని సీనియర్ అని అనలేం, ఆయన ఇప్పటికీ యంగ్. కో ఆర్టిస్ట్స్ లకి కంఫర్ట్ ఇస్తే సీన్ బాగా వస్తుందనేది ఆయన నుంచే నేర్చుకున్నాను.
ప్రశ్న) ఒక స్క్రిప్ట్ ని ఫైనలైజ్ చేసేముందు మీరు ఏమేమి చూస్తారు.? కథల ఎంపికలో కృష్ణ గారి సపోర్ట్ ఎంత వరకూ తీసుకుంటారు.?
స) కథ వినగానే నేను ఎగ్జైట్ అయ్యానా లేదా అన్నది చూస్తాను, అలాగే కథ కొత్తగా ఉందా లేదా అనేది చూస్తాను అండ్ ఫైనల్ గా అలాంటి పాత్ర ఇంతకముందు చేసానా లేదా.? ఇంతక ముందే చేసి ఉంటే చెయ్యను. అలాగే కథ విన్నాక కృష్ణ గారి సలహాలు కూడా తీసుకుంటూ ఉంటాను. కానీ ఫైనల్ నిర్ణయం మాత్రం నాదే..
ప్రశ్న) మీరు స్వతహాగా ఎలాంటి వ్యక్తి.?
స) స్వతహాగా నాకు సిగ్గు ఎక్కువ (వెరీ షై), చాలా సెన్సిటివ్, కోపం చాలా ఫాస్ట్ గా వస్తది, అంతే ఫాస్ట్ గా తగ్గిపోద్ది, అన్నిటికంటే మించి అన్ని పనుల్లో 100% ఎఫోర్ట్ పెడతాను.
ప్రశ్న) మీరు డిస్ట్రిబ్యూటర్ గా పలు సినిమాలని డిస్ట్రిబ్యూట్ చేసి ఈ మధ్య బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేస్తారా.? అలాగే నిర్మాతగా కూడా మారే అవకాశం ఉందా.?
స) తెలియకుండానే చాలా సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేసాను. మళ్ళీ త్వరలో డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. అలాగే నిర్మాతగా కూడా కచ్చితంగా సినిమా చేస్తాను. కానీ మంచి కథ సెట్ అయినప్పుడే చేస్తాను.
ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?
స) ‘మోసగాళ్ళకు మోసగాడు’ మే 21న రిలీజ్ కానుంది, అలాగే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది. ఇది కాకుండా ‘చూపులు కలిసిన శుభవేళ’ అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా జరుగుతోంది. ఇప్పటికే 40% అయ్యింది. ఈ సినిమా కూడా ఇదే సంవత్సరం రిలీజ్ కానుంది.
అంతటితో మా స్పెషల్ ఇంటర్వ్యూని ముగించి, మోసగాళ్ళకు మోసగాడు మంచి విజయం అందుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము. అలాగే ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న సుధీర్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాం.
ఇంటర్వ్యూ – ఆర్
CLICK HERE FOR ENGLISH INTERVIEW