‘దేవర’ ఫియర్ సాంగ్ పై ఆ విమర్శ

‘దేవర’ ఫియర్ సాంగ్ పై ఆ విమర్శ

Published on May 20, 2024 2:15 PM IST

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘యంగ్ టైగర్ ఎన్టీఆర్’ హీరోగా రాబోతున్న పాన్ ఇండియా సినిమా ‘దేవర పార్ట్ 1’. ఈ సినిమా నుంచి నిన్న వచ్చిన టైటిల్ సాంగ్ ‘ఫియర్ సాంగ్’ బాగా ఆకట్టుకుంటుంది. ఐతే, ఈ పాట విషయంలో ఓ చిన్న విమర్శ కూడా బాగా వినిపిస్తోంది. అనిరుధ్ స్వరపరచిన సాంగ్ సౌండింగ్ చాలా బాగున్నా.. లిరిక్స్ మాత్రం అర్థం కాకుండా మ్యూజిక్ డామినేట్ చేసిందని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. రచయిత రామజోగయ్య శాస్త్రి సాహిత్యం బాగుంటుంది. అలాంటి రచయిత రాసిన లైన్లు స్పష్టంగా వినిపించి ఉంటే బాగుండేది అని నెటిజన్లు పోస్ట్ లు పెడుతున్నారు.

అలాగే, ఈ పాట లిరికల్ వీడియోలో ఎన్టీఆర్ కంటే.. అనిరుధ్ నే ఎక్కువ చూపించడం కూడా తారక్ ఫ్యాన్స్ కి నచ్చలేదు. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. మొత్తానికి దేవర సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. . అనిరుధ్ రవిచందర్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్, తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు