ఇంటర్వ్యూ : అవినాష్ మదేటి – అల్లు అర్జున్ ని చూసి చాలెంజింగ్ గా తీసుకున్నాను.!

ఇంటర్వ్యూ : అవినాష్ మదేటి – అల్లు అర్జున్ ని చూసి చాలెంజింగ్ గా తీసుకున్నాను.!

Published on Sep 14, 2014 7:52 PM IST

avinash

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ డైరెక్షన్ లో ‘మొగుడు’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటుడు అవినాష్ మదేటి. ఆ తర్వాత ‘డిస్కో’ సినిమాలో నటించిన అవినాష్ ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న ‘బూచమ్మ బూచోడు’ సినిమాలో ఓ కీలక పాత్ర చేసాడు. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో తన ఆనందాన్ని మరియు తన తదుపరి సినిమా ముచ్చట్లను మాతో పంచుకున్నారు. ఆ విశేషాలు మీ కోసం..

ప్రశ్న) ముందుగా ‘బూచమ్మ బూచోడు’ హిట్ అయినందుకు కంగ్రాట్స్.. అసలు సినిమాల్లోకి రావడానికి మీకు బాగా స్పూర్తిని ఇచ్చిన అంశం ఏమిటి.?

స) థాంక్స్ అండి.. చిన్నప్పటి నుంచీ ప్రతి కార్యక్రమంలో సినీ సెలబ్రిటీలను పొగడడం, పలువురు వారి నటనని మెచ్చుకునే వారు.. అది చూసాక వారి సినిమాలను మొదలు పెట్టాను. అలా చూస్తూ చూస్తూ ఈ కళ వైపు ఆసక్తి పెరిగిపోయింది. ఆ తర్వాత బిటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్న టైంలో నేను సినిమాల్లోకి రావాలని అని నిర్ణయించుకొని డాన్స్ నేర్చుకోవడం మొదలు పెట్టాను. 2010లో బన్ని షెడ్ లోనే నేను డాన్స్ నేర్చుకునేవాన్ని.. బన్నిని రోజూ చూస్తుండేవాన్ని,, అప్పుడే నా మదిలో ఒక ప్రశ్న మెదిలింది. స్టార్ కిడ్, ఎంతో బ్యాక్ అప్ ఉన్న బన్నినే ఇంత కష్టపడితే నేను ఎంత కష్టపడాలి అని 90 కేజీలు ఉన్న నేను 6 నెలల్లో 66 కేజీలు తగ్గడమే కాకుండా 6 ప్యాక్ తెచ్చుకున్నాను. అది జరిగిన 2 నెలలకి నాకు ‘మొగుడు’ సినిమా ఆఫర్ వచ్చింది.

ప్రశ్న) మొదటిసారి కృష్ణవంశీతో పనిచేసేటప్పుడు ఎలాంటి టెన్షన్ పడలేదా.? సెకండ్ సినిమా తర్వాత ఎందుకు గ్యాప్ తీసుకున్నారు.?

స) నాకు నేనే కెమెరా పెట్టుకొని నటించడం అలవాటు చేసుకోవడం వలన నేను కృష్ణవంశీ గారి సెట్లో టెన్షన్ పడలేదు. మొదటి రెండు రోజులు మాత్రం ఇంతమంది సీనియర్ ఆర్టిస్ట్ లతో నేను చేస్తున్నానా అని టెన్స్ అయ్యాను కానీ కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ వారితో పాటు నటించగల టాలెంట్ ఉంటేనే కదా నన్ను సెలక్ట్ చేసుకొని ఉంటారని భయపడకుండా చేసాను. ఆ తర్వాత డిస్కో సినిమా చేసాను. కానీ నటుడిగా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని గ్యాప్ తీసుకొని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాను. అందుకే అంత గ్యాప్ వచ్చింది. ఇకపై గ్యాప్ ఉండదండి..

ప్రశ్న) మరి మీరు అంత కష్టపడి నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఎక్కడన్నా ఉపయోగపడ్డాయా.?

స) సినిమాల పరంగా ఇంకా ఉపయోగపడలేదు.. కానీ మార్షల్ ఆర్ట్స్ వల్ల అనుకోని విధంగా నాకు బ్రాండింగ్ దొరికింది. మార్షల్ ఆర్ట్స్ వల్లే నేను సిక్స్ ప్యాక్ చేసాను. నా లుక్ నచ్చడంతో ఇండో అమెరికన్ కాన్సర్ ఇన్స్టిట్యూట్ కి చెందిన యాడ్ లైఫ్ వారు నన్ను మోడల్ గా తీసుకున్నారు. అంతే కాకుండా వారు ఫస్ట్ టైం నా ఫొటోస్ ని ఔటర్ పబ్లిసిటీ కోసం వాడుకున్నారు. అది నాకు మరింత గుర్తింపు తెచ్చింది.

ప్రశ్న) బూచమ్మ బూచోడు కథ విన్నప్పుడు మీ రియాక్షన్ ఏమిటి.? ఘోస్ట్ పాత్ర కోసం ఏమన్నా ఇన్స్పిరేషన్స్ తీసుకున్నారా.?

స) నన్ను పిలిచి డైరెక్టర్ గారు కథ చెప్పారు.. కథ నాకు నచ్చగానే నేను రెడీ సార్ ఈ సినిమా చేస్తానని చేసేసాను. ఘోస్ట్ పాత్ర నేను చేయడం మొదటిసారి.. కొన్ని ఘోస్ట్ సినిమాలు చూసాను, అలాగే డైరెక్టర్ చెప్పింది ఫాలో అయిపోయాను..

ప్రశ్న) బూచమ్మ బూచోడు సినిమాకి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి.?

స) నువ్వు చేసిన పాత్ర చిన్నదో పెద్దదో, ఘోస్ట్ పాత్రలో మాత్రం పెర్ఫార్మన్స్ చాలా బాగుంది అని చాలా మంది అన్నారు. అలాగే కొంతమంది నీలోని నటున్ని చూపించిన సినిమా అని కొంతమంది అన్నారు.

ప్రశ్న) ఇకపై హీరోగా రాణించాలనుకుంటున్నారా? లేక ఎలాంటి పాత్ర వచ్చినా చేస్తారా.?

స) హీరోగా వెళ్లాలని ఏమీ లేదండి.. ఏమన్నా అవకాశం వస్తే చేస్తాను. హీరో కంటే ఒక నటుడిగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు నటుడిగా గుర్తింపు తెచ్చేది చిన్న పాత్ర అయినా నేను చెయ్యడానికి రెడీ,, అది నెగటివ్ అయినా హీరో ఫ్రెండ్ అయినా పర్లేదు..

ప్రశ్న) మీ తదుపరి సినిమాల గురించి చెప్పండి.?

స) ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలే చేస్తున్నాను. ‘హైదరాబాద్ లవ్ స్టొరీ’ పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ‘కవిత’ సినిమా సెట్స్ పై ఉంది. ఇందులో నా పాత్ర సైకిక్ నెగటివ్ రోల్ చేస్తున్నారు. ఇది కాకుండా రాజమౌళి గారి ‘బాహుబలి’లో నటిస్తున్నాను. అందులో కూడా విలన్స్ వైపు ఉండే పాత్రే చేస్తున్నాను. బాహుబలి లాంటి సినిమాలో చిన్నదో పెద్దదో పాత్ర చేసే అవకాశం రావడం చాలా గొప్ప గిఫ్ట్ గా భావిస్తున్నాను.

అంతటితో మా ఇంటర్వ్యూని ముగించి ముగించి అవినాష్ తన కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆల్ ది బెస్ట్ చెప్పాము..

సంబంధిత సమాచారం

తాజా వార్తలు