చిరు నెక్స్ట్ కూడా ఇలాంటి సినిమానేనా?

చిరు నెక్స్ట్ కూడా ఇలాంటి సినిమానేనా?

Published on May 22, 2024 10:00 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “విశ్వంభర” (Vishwambhara) కోసం తెలిసిందే. అయితే ఇది చిరు నుంచి స్ట్రెయిట్ సినిమా కావడంతో మెగా అభిమానుల్లో మరిన్ని అంచనాలు నెలకొనగా ఈ సినిమా తర్వాత చిరు 157 సంబంధించి ఇంట్రెస్టింగ్ బజ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.

మెగాస్టార్ తో వర్క్ చేసిన ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా మెగాస్టార్ 157ని టేకప్ చేయనున్నారు అని టాక్ వచ్చింది. మరి ఇది దాదాపు నిజం అన్నట్టుగానే వినిపిస్తుండగా ఈసారి మాత్రం గాడ్ ఫాథర్ లా రీమేక్ కాకుండా స్ట్రెయిట్ సినిమా తోనే వస్తే బాగుంటుంది అని ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు. అంతే కాకుండా ఆల్రెడీ రీమేక్ సినిమాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూస్తూనే ఉన్నాము. మరి ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ నుంచి ఎలాంటి సినిమా రానుందో వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు